మెదక్

ప్రశాంత వాతవరణంలో పండుగను జరుపుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, సెప్టెంబర్ 12: గణేష్ నవరాత్రుల ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఏఎస్పీ మహేందర్ సూచించారు. వినాయక చవితి పండగను పురస్కరించుకొని బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని కల్యాణ మండపంలో మత పెద్దలతో శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండ, మత సామరస్యంతో వినాయక చవితి పండగను జరుపుకోవాలని కోరారు. రాత్రి సమయాల్లో గణేష్ మండపాల వద్ద జాగ్రత్తగా ఉండాలని నిర్వాహకులకు సూచించారు. పండగ సందర్భంగా గట్టిబందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని, ఎలాంటి అనుమాన సంఘటనలు ఉన్నా వెంటనే సమాచారం అందించాలని కోరారు. డీజే సౌండ్ బాక్స్‌లు పెట్టేందుకు అనుమతులు లేవని ఈ విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. సంగారెడ్డి డీఎస్పీ శ్రీ్ధర్‌రెడ్డి మాట్లాడుతూ సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మకూడదని, ఫేస్‌బుక్, వాట్సప్ వంటి సామాజిక మాధ్యమాలలో వచ్చే వార్తలలో చాల వరకు తప్పుడు వార్తలేనని, ఎవరైన ఇలా తప్పుడు వార్తలను, మార్పింగ్ చేసిన ఫోటోలను ప్రచారం చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వివిధ మతాలకు చెందిన మత పెద్దలు మాట్లాడుతూ శాంతియుతంగా పండగను జరుపుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, అందరి మనోభావాలు గౌరవిస్తూ పోలీస్ అధికారుల సూచనలు పాటిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సంగారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి, పట్టణ సీఐ వెంకటేశ్, ట్రాఫిక్ సీఐ సంజయ్‌కుమార్, వివిధ మతాలకు చెందిన పెద్దలు వేణుగోపాల్, అన్వర్, బుచ్చిరెడ్డి, తాహేర్, అబుబకర్, దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు.