మెదక్

ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, సెప్టెంబర్ 14: జిల్లాలో 28 మంది ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు జిల్లా ఎస్పీ చందనాదీప్తి తెలిపారు. ఇందులో నర్సాపూర్‌లో 18 మంది, మెదక్‌లో 10 మందిపై ఉన్నట్లు తెలిపారు. క్రిమినల్ కేసులకు సంబంధించిన వారిని ప్రతిరోజు తహశీల్దార్ ముందు బైండోవర్ చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. పోలింగ్ స్టేషన్లను రెగ్యులర్‌గా సందర్శించి సమస్యాత్మక ప్రాంతాల్లో బందోబస్తును అధికంగా ఏర్పాటు చేస్తామని ఆమె వెల్లడించారు. ఈ ఎన్నికలను కట్టుదిట్టంగా నిర్వహిస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ నగేష్ పాల్గొన్నారు.