మెదక్

రిమ్మనగూడ రోడ్డు ప్రమాదం దురదృష్టకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, సెప్టెంబర్ 14: రిమ్మనగూడవద్ద జరిగిన రోడ్డు ప్రమాదం దురదృష్టకరమని, మృతులంతా పేదవారే అవడం బాధాకరమని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం గజ్వేల్ ఆసుపత్రి వద్దకు చేరుకొని బాధిత కుటుంబాలను పరామర్శించడంతోపాటు సంఘటనకు సంబంధించిన వివరాలను ఆయన పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ నుండి అడిగి తెలుసుకున్నారు. పాములపర్తికి చెందిన బాధితులు ఓ అశుభ కార్యానికి టాటాఏసీలో వెళు తండగా, రిమ్మనగూడవద్ద లారీ అతివేగంగా వస్తూ ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అ క్కడికక్కడే మృతిచెందగా, పరిస్థితి విషమంగా ఉన్న మరికొంతమందిని హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలందిస్తున్నట్లు స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలతోపాటు గాయపడినవారిని అన్నిరకాలుగా ఆదుకుంటామని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి బాధితులకు హామీ ఇచ్చారు. ఆయన వెంట పోలీస్‌కమిషనర్ జోయల్ డెవిస్, శాంతిభద్రతల డీసీపీ నర్సింహారెడ్డి, పర్యాటక శాఖ చైర్మెన్ భూపతిరెడ్డి, డీసీసీబీ చైర్మెన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, గ్రంధాలయ సంస్థ చైర్మెన్ ప్రభాకర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మెన్ గాడిపల్లి భాస్కర్ తదితరులు ఉన్నారు.

ప్రమాదంపై మంత్రి హరీష్‌రావు దిగ్బ్రాంతి
గజ్వేల్, సెప్టెంబర్ 14: రిమ్మనగూడ రోడ్డు ప్రమాద సంఘటనపై మంత్రి హరీష్‌రావు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం మంత్రి హరీష్‌రావు విలేఖరులతో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించిన ఆయన ప్రభుత్వం అన్నిరకాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు చ ర్యలు తీసుకుంటుండగా, ఇప్పటికే నిమ్స్ వైద్యులకు స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు వివరించారు.