క్రైమ్/లీగల్

వైద్యం వికటించి వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జహీరాబాద్, సెప్టెంబర్ 15:వైద్యం వికటించి ఓ వ్యక్తి మృతి చెందాడు. మహారాష్ట్ర నాసిక్ జిల్లా శీనాల్ తాలుకా నాగావ్ గ్రామానికి చెందిన ప్రవీణ్‌విజయ్ జాదవ్(25) ఈ సంఘటనలో మృతి చెందాడు. ఎస్‌ఐ.సత్యనారాయణ కథనం ప్రకారం వివరాలు ఈవిధంగా ఉన్నాయి..మృతుడు గైదేని సంతోష్ సోమ్‌నాథ్ అనే లారీ డ్రైవర్‌వద్ద క్లీనరగా పనిచేస్తున్నాడు. మహీంద్రా కర్మాగారానికి లోడ్‌తీసుకుని వచ్చిన వారు తిరిగి లోడ్‌కోసం మహీంద్రా 2వ గేట్‌వద్ద లారీ ఆపుకుని వేయిటింగ్ చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ప్రవీణ్‌కు ఫీట్స్ రావడంతో నాగులకట్టవద్దగల చంద్రకళ క్లీనిక్‌కు డ్రైవర్ తీసుకుని పోయాడు. ఆసుపత్రి వైద్యుడు ఆయనను పరీక్షించి ఇంజక్షన్‌చేసి, గోలీలు రాసిచ్చాడు. పక్కనే ఉన్న మెడికల్‌లో మందులు తీసుకుని వేసుకుని తిరిగి లారీవద్దకు వెళ్లి పడుకున్నాడు. భోజనానికి వెళ్లిన కొద్దిసేపటి తరువాత డ్రైవర్‌కూడా లారీ వద్దకొచ్చి క్లీనర్‌ను పలకరించాడు. ఎంతకీ స్పందన లేకపోవడంతో ప్రభుత్వాసుపత్రికి ఆయనను తరలించగా ఇదివరకే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. దీంతో శనివారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం క్లీనర్ మృతికి వైద్యుడే కారణమని పేర్కొంటూ మృతదేహాన్ని క్లీనిక్ ముందుంచి ఆందోళన చేశారు. లారీ డ్రైవర్ ఫిర్యాదు మేరకు వైద్యం వికటించి క్లీనర్ మృతిచెందినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ.సత్యనారాయణ తెలిపారు. ఈ విషయమై వైద్యుడికి ఫోన్‌లో సంప్రదించేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.