క్రైమ్/లీగల్

సిద్దిపేటలో స్వైన్‌ఫ్లూ కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, సెప్టెంబర్ 18 : స్వైన్ ఫ్లూ వ్యాధితో ఒక వ్యక్తి మృతిచెందిన సంఘటన సిద్దిపేట జిల్లా కేంద్రంలో కలకలం రేపుతోంది. స్థానిక గణేశ్‌నగర్‌కు చెందిన మల్లంపల్లికాశీనాధ్ ( 58) టెలికాం డిపార్టుమెంట్‌లో పనిచేస్తు స్వైన్ ఫ్లూ వ్యాధితో మంగళవారం మృతిచెందారు. కాశీనాధ్‌కు గత వారం రోజుల క్రితం తీవ్రమైన జ్వరం రావంతో పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స చేయించుకున్నారు. తీవ్రమైన జ్వరం తగ్గకపోవటంతో చికిత్స నిమిత్తం హైదరబాద్ కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కిమ్స్ పరీక్షలు నిర్వహించి స్వైన్ ఫ్లూ వ్యాధిగా నిర్ధారించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందారు. ప్రత్యేక అంబులెన్స్ ద్వారా కాశీనాధ్ మృతదేహాన్ని సిద్దిపేటకు తరలించారు. కాశీనాధ్‌కు ఇద్దరు కూతుళ్లు శే్వత, దివ్య, కుమారుడు వివేక్ ఉన్నారు. వివేక్, దివ్యలు హైదరాబాద్‌లో నివసిస్తారు. శే్వత విదేశాల్లో ఉంటారు. కాశీనాథ్ మృతదేహాం రాగానే త్వరగా అంత్యక్రియలు ముగించారు. గణేశ్‌నగర్ ప్రాంతంలో వైద్య సిబ్బంది తీవ్రమైన జ్వరం, జలుబు వ్యాధితో సోకితే ప్రభుత్వ ఆసుపత్రిలో సంప్రదించాలని కోరారు. రెండేళ్ల క్రితం సిద్దిపేట ఖాదర్‌పురాలో స్వైన్ ఫ్లూ వ్యాధితో ఒక వ్యక్తి మృతిచెందటం జరిగింది.
డీఎంహెచ్‌ఓ అమర్‌సింగ్ వివరణ
సిద్దిపేట గణేశ్‌నగర్‌కు చెందిన టెలికాం ఉద్యోగి కాశీనాథ్ స్వైన్‌ఫ్లూ వ్యాధితో మృతిచెందిన విషయంపై డీఎంహెచ్‌ఓ అమర్‌సింగ్‌ను వివరణ కోరగా కాశీనాథ్‌కు స్వైన్‌ప్లూ పరీక్షలు పాజిటివ్‌గా వచ్చినప్పటికీ, మల్టిఆర్గన్స్ దెబ్బతిని మృతిచెందినట్లు తెలిపారు.