మెదక్

అధికారులపై రైతుల కనె్నర్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లాదుర్గం, సెప్టెంబర్ 18: అల్లాదుర్గంలో ఎన్నో ఏళ్లుగా భూములను నమ్ముకొని పంటలు సాగుచేస్తున్న భూములకు పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలని జిల్లా అధికారులకు పలుమార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో ఆగ్రహించిన రైతులు మంగళవారం అల్లాదుర్గం-నాందేడ్ అఖోల రహదారిపైకి చేరుకొని పెద్దయేత్తున ధర్నా, రాస్తారోకోలు చేశారు. అధికారులకు వ్యతిరేఖంగా నినాదాలు చేశారు. పట్టణ శివారులో 379 సర్వేలోని భూముల్లో తాము ఎన్నో ఏళ్లుగా పంటలు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నామని రైతులు తెలిపారు. ప్రభుత్వం గతంలో పట్టా కలిగిన రైతులకు పాస్ పుస్తకాలు, రైతుబంధు చెక్కులు అందజేస్తామని తెలిపారన్నారు. 379 సర్వేలోని రైతులకు ఇప్పటి వరకు పాస్ పుస్తకాలు, చెక్కులు అందజేయలేదని తెలిపారు. ఈ విషయమై రైతులు గతంలో అల్లాదుర్గంకు వచ్చిన జిల్లా కలెక్టర్, జేసీకి, ఆర్డీఓ, తహశీల్దార్ల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. నెల రోజుల్లో అర్హులైన రైతులకు పాస్ పుస్తకాలు, చెక్కులు అందజేస్తామని తెలిపారన్నారు. నేటికి ఐదు నెలలు గడిచినా పాస్ పుస్తకాలు, చెక్కులు ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన రైతులు హైవే రోడ్డుకు చేరుకొని పెద్దయేత్తున ధర్నా చేపట్టారు. వారం రోజుల్లోగా 379 సర్వే నంబర్‌లోని రైతులకు కూడా చెక్కులు, పాస్ పుస్తకాలు ఇవ్వకపోతే జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తామని రైతులు హెచ్చరించారు. ఈ ధర్నా వద్దకు సీఐ రవీందర్‌రెడ్డి తన సిబ్బందితో ధర్నా చేస్తున్న రైతులకు సముదాయించి న్యాయం చేసేలా ఉన్నతాధికారులతో మాట్లాడుతానని హామి ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించుకున్నారు. ఈ ధర్నాకు జడ్పీటీసీ మమత బ్రహ్మం సంఘీభావం తెలుపుతూ రైతుల పక్షాన తహశీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.

ప్రణయ్ హంతకులను కఠినంగా శిక్షించాలి
* తెలంగాణ మాల యువసేన ఆధ్వర్యంలో ధర్నా
పటన్‌చెరు, సెప్టెంబర్ 18: ప్రణయ్ హంతకులను ప్రభుత్వం అత్యంత కఠినంగా శిక్షించాలని తెలంగాణ మాల యువసేన నాయకులు డిమాండు చేశారు. పరువు హత్య పేరిట ఓ యువకున్ని దారుణంగా అంతమొందించడం సభ్యసమాజం ఎంతమాత్రం హర్షించదన్నారు. ప్రణయ్ హత్యకు నిరసనగా మాల యువసేన అధ్వర్యంలో మంగళవారం జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. కూతురు ప్రాణానికి కంటే అధికంగా ప్రేమించిన వ్యక్తిని ఆమె తండ్రి డబ్బు మదంతో కోటి రూపాయలకు డీల్ కుదుర్చుకుని చంపించడం దారుణమైన సంఘటనగా వారు అభివర్ణించారు. ప్రణయ్ భార్య డిమాండు చేసిన ప్రకారం ఆమె తండ్రిని వెంటనే ఉరి తీయాలని అన్నారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ కేసును రాష్ట్ర న్యాయస్థానం సాధ్యమైనంత తొందరగా పరిష్కారం చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో తెలంగాణ మాల యువసేన కార్యదర్శి గాలి బాబురావు తదితరులు పాల్గొన్నారు.

విద్యాధరి సన్నిధలో ఘనంగా మూల ఉత్సవం
* విద్యాధరి అమ్మవారికి లక్ష పుష్పార్చన
గజ్వేల్, సెప్టెంబర్ 18: తెలంగాణ జిల్లాల్లో సుప్రసిద్ద పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న వర్గల్ విద్యాధరి క్షేత్రంలో మంగళవారం మూల ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ వ్యవస్థాపక చైర్మన్ యాయవరం చంద్రశేఖరశర్మ ఉత్సవానికి అంకురార్పన చేయగా, అమ్మవారికి విశేష పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజలు, అలంకరణ, చంఢీహోమం, లక్ష పుష్పార్చన తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. విద్యాధరి క్షేత్రంతో పాటు శనైశ్చర, లక్ష్మి గణపతి, స్వయంభు శంభులింగేశ్వర క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడగా, అమ్మవారి నామస్మరణతో శంభూగిరులు మార్మోగాయి. ఈ సందర్బంగా క్షేత్రానికి తరలివచ్చిన భక్తులకు నిర్వాహకులు తీర్థ ప్రసాదాలతోపాటు మహా ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమాల్లో నిర్వాహకులు పొద్దుటూరి నర్సింహారావు, దాచెపల్లి వెంకటకృష్ణ, బొమ్మిడాల సత్యనారాయణ, కాటెపల్లి విశ్వనాథం, గంగా శ్రీనివాస్‌గుప్త, ఇర్రి మల్లారెడ్డి, అత్తెల్లి బాపిరాజు, గంగిషెట్టి సుదాకర్, ఎన్‌బీ ప్రభాకర్ గుప్త, సుర్వి భీష్మాగౌడ్, టేకులపల్లి బాల్‌రెడ్డి, మర్రి పుష్పాల్‌రెడ్డి, గుడాల కృష్ణమూర్తి, బెజుగామ బానుమూర్తి, రాజేశ్వర్‌రావు, కైలాస శ్రీనివాస్, శ్రీరాంరంగయ్య, గుండేశ్వరశర్మ, గంగిషెట్టి ప్రవీన్, బిక్కుమల్ల సంతోష్, బచ్చు ప్రదీప్‌కుమార్, దోసపాటి రవి తదితరులు పాల్గొన్నారు.