మెదక్

బిల్లులు ఇవ్వడం లేదని కాంట్రాక్టర్ ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, సెప్టెంబర్ 18: చేసిన పనులకు అధికారులు బిల్లులు చెల్లించడంలో జాప్యం చేయడం, అప్పులు ఇచ్చిన వారి వత్తిడి పెరగడంతో గత్యంతరం లేక ఓ సివిల్ కాంట్రాక్టర్ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడుతుండగా పోలీసులు అడ్డుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ సంఘటన సంగారెడ్డిలోని ఆర్ అండ్ బీ కార్యాలయంలో మంగళవారం కలకలం రేకెత్తించింది. నర్సాపూర్ నియోజకవర్గం పరిధిలోని దౌల్తాబాద్, హత్నూర, సిరిపుర, చిలప్‌చేడ్ మండలాల గుండా మెదక్ రోడ్డును కలిపే రహదారిని డబుల్ రోడ్డుగా విస్తరిస్తున్నారు. ఇందుకు సంబంధించి మధ్యలో కల్వర్టుల నిర్మాణం చేస్తున్నారు. రూ.83.09 లక్షలు, రూ.92.81 లక్షలతో రెండు కల్వర్టుల పనులను చేసేందుకు హైదరాబాద్‌కు చెందిన రామ్ ఇన్‌ప్రాటెక్ అనే నిర్మాణ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. పనులు పూర్తి చేస్తున్నా ఇతర పనుల కాలేదనే సాకుతో బిల్లులు చెల్లించడం లేదని, ఎన్నికల విధుల్లో ఉన్నానని, ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆగాలని అధికారులు దాట వేస్తున్నారని ఆరోపిస్తూ సదరు నిర్మాణ సంస్థకు చెందిన కాంట్రాక్టర్ రమణారెడ్డి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశారు. కాగా అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకోవడంతో అఘాయిత్యం తప్పింది. తనకు మొత్తంగా రూ.30 లక్షల బిల్లులు రావాల్సి ఉందని, అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, మామూళ్లు ఇచ్చినా జాప్యం చేస్తున్నారని ఆరోపించాడు. పనుల నిర్మాణానికి అవసరమైన పెట్టుబడుల నిమిత్తం ప్రైవేట్ వ్యక్తుల వద్ద వడ్డీకి తెచ్చానని, వడ్డీ పెరగడంతో పాటుగా అప్పు తీర్చాలని తనపై వత్తిడి పెరిగిందని కాంట్రాక్టర్ ఆవేదన వ్యక్తం చేసాడు. సంబంధిత అధికారి మాట్లాడుతూ ఒక పనికి సంబంధించి రూ.4 లక్షలు మాత్రమే ఇవ్వాలని, మరోపనికి సంబంధించి రూ.29 లక్షలపైచీలుకు చెల్లించాల్సి ఉందని అంగీకరిస్తున్నారు. బిల్లులు చేసి సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు పంపించామని, తామేమి ఉద్దేశపూర్వకంగా బిల్లులు చెల్లించడంలో జాప్యం చేయడం లేదని సదరు అధికారులు సమర్థించుకుంటున్నారు. ఆర్ అండ్ బీ అధికారుల అవినీతి, మామూళ్లు ఇవ్వని కాంట్రాక్టర్లను బిల్లులు చెల్లించకుండా వేధింపులకు గురి చేసే తతంగం ఓ కాంట్రాక్టర్ బల్వన్మరణానికి పాల్పడే యత్నం ద్వారా మరోమారు రుజువైంది.