మెదక్

క్రాంతి కిరణ్‌కు టికెట్ కేటాయింపునకు నిరసనగా జెడ్పీటీసీ మమత రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, సెప్టెంబర్ 18: అధికార టీఆర్‌ఎస్ పార్టీలో అసంతృప్తి కారుచిచ్చు రోజు రోజుకు పెరిగిపోతోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను తొమ్మిది సెగ్మెంట్లకు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. 8 స్థానాలకు సిట్టింగ్‌లకే టికెట్లు కేటాయించగా పటన్‌చెరు, సంగారెడ్డి, నారాయణఖేడ్, మెదక్, నర్సాపూర్, దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గాల్లో అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి. అందోల్ ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బాబుమోహన్‌ను తప్పించి జర్నలిస్టు నాయకుడు క్రాంతి కిరణ్ పేరును ప్రకటించారు. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎక్కడ అసంతృప్తి వ్యక్తంకాకపోగా మంగళవారం అల్లాదుర్గం జెడ్పీటీసీ సభ్యురాలు కంచరి మమత నిరసన గళమెత్తారు. ఏకంగా పార్టీకే రాజీనామాను సమర్పించడం విశేషం. సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మమతతో పాటు ఉమ్మడి అల్లాదుర్గం మండలం టీఆర్‌ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు కె.బ్రహ్మంలు మాట్లాడుతూ పార్టీలో తమకు అవమానం ఎదురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికుడని చెప్పుకుంటున్న క్రాంతి కిరణ్ కనీసం దసరా పండుగకు సైతం గ్రామానికి రాడని, గ్రామస్థులే అతన్ని ఎన్నుకోవడానికి తిరస్కరిస్తున్నారని విమర్శించారు. స్థానికంగా ఉండని వ్యక్తిని స్థానికుడని చెప్పి టికెట్ కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు. టికెట్ కేటాయించాక కనీసం మర్యదపూర్వకంగానైనా తమను కలవకుండానే ప్రచారం నిర్వహించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2001 నుండి టీఆర్‌ఎస్ పార్టీలో పని చేస్తూ పార్టీని అభివృద్ధి చేసామన్నారు. గ్రామాల్లో కనీసం కార్యకర్తలు కూడా లేరని, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొంటూనే పార్టీని సంస్థాగతంగా నిర్మించినట్లు తెలిపారు. 2014 ఎన్నికలకు ముందు జెడ్పీటీసీగా పోటీ చేసి గెలుపొందామని, మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలకుగాను 11 స్థానాలను టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుని ఎంపీపీ పీఠాన్ని కైవసం చేసుకున్నట్లు తెలిపారు. తాను జెడ్పీటీసీగా గెలుపొందినప్పటి నుంచి అవమానాలనే చవిచూసామన్నారు. తన భర్త లేనప్పుడు ఒక సందర్భంలో ఒక నాయకుడు చులకన చేసి మాట్లాడారని, ఆ మాటలను తలుచుకుంటూ మమత కన్నీటి పర్యంతమయ్యారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో తమకు ఏ మాత్రం పరిచయం లేని బాబుమోహన్‌ను బరిలోకి దింపినా కష్టపడి గెలిపించుకున్నామన్నారు. బంగారు తెలంగాణ అని చెప్పుకుంటున్న కేసీఆర్‌తో ఏది సాధ్యం కాదని ధ్వజమెత్తారు. జడ్పీటీసీగా తనను ఎన్నుకున్న ప్రజలకు అందుబాటులో ఉండి వారికి సేవలందిస్తామన్నారు. కార్యకర్తల అభిష్టం మేరకు భవిషత్ కార్యచరణను ప్రకటిస్తామన్నారు.