క్రైమ్/లీగల్

ముత్తూట్ ఫైనాన్స్ దొంగలకు ఆరేళ్ల జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమీన్‌పూర్, సెప్టెంబర్ 19: సంచలనం రేకెత్తించిన రామచంద్రాపురం మినీ ముత్తూట్ ఫైనాన్స్‌లో దొంగతనానికి పాల్పడిన నలుగురు నిందితులకు సంగారెడ్డి జిల్లా జడ్జీ సాయికళ్యాన్ చక్రవర్తి బుధవారం శిక్షలు విధించారు. వివరాలలోకి వెళ్తే 2015 షిబ్రవరి 4 వతేదిన మహరాష్టక్రు చెందిన లక్ష్మణ్ నారాయణ్ ముధంగ్ ,గణేష్ పాండురంగ భోంస్లే, కుమార్ పాల్ త్రిలోక్ చంద్‌షాలు తమిల్‌నాడు రాష్ట్రానికి చెందిన మురుగణ్ సుబ్రమణ్య పుజారీతో జత కలిసారు. ఒక ప్రణాళికను రూపొందించి దొంగతనానికి పథకం రచించారు. అందులో భాగంగాణే రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని మినీముత్తుట్ సంస్థలో దొంగతనానికి పాల్పడ్డారు. ఈ విషయమై కేసు 2015 నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అక్రమంగా ఆయదాలు కలిగి ఉండి దొంగతనానికి యత్నించిన నేరానికి గాను సెక్షన్‌లు 120(బి), 395, 201, 411, 414 రెడ్‌విత్ 34, 109 ఐపీసీ, సెక్షన్ 25(బి), (ఎ) యాక్ట్ 1959 ప్రకారం వాదోప వాదనలు విన్న జిల్లా జడ్జ్ సాయికళ్యాన్ చక్రవర్తి నిందితులకు 6 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పును వెల్లడించారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
చేగుంట, సెప్టెంబర్ 19: అతివేగంగా కారులో వెళ్తూ నిలిచి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఓ యువకుడు మరణించిన సంఘటన చేగుంట మండలం వల్లూరు జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. నార్సింగి మండల కేంద్రానికి చెందిన టెంట్‌హౌజ్ యజమాని ఎంకె.ప్రసాద్(35) చేగుంటలో నివాసం ఉంటున్నందున చేగుంటకు వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో ప్రసాద్ అక్కడికక్కడే మరణించాడు. మృతుని భార్య, పిల్లలు చేగుంటలో నివసిస్తున్నందున చేగుంటకు వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరిగినట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు. ప్రసాద్ శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ఎండు గంజాయి సీజ్
* నిందితుడి రిమాండ్
జహీరాబాద్, సెప్టెంబర్ 19: పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఎక్సైజ్ పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 2 కిలోల ఎండు గంజాయిని సీజ్‌చేవారు. నిందితున్ని రిమాండ్‌కు పంపించారు. ఎక్సైజ్ సీఐ.అశోక్ కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి.. నాగులకట్ట, భవాని మందిర్ సమీపంలో గంజాయి పాకెట్లను అమ్ముతున్నట్లు సమాచారం రావడంతో సిబ్బంధితో పాటు దాడులు నిర్వహించారు. దీంతో రాములు(57) అనే వ్యక్తికి అదుపులోకి తీసుకున్నారు. ఆయన వద్దనుంచి 2 కిలలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితున్ని రిమాండ్‌కు పంపించినట్లు సీఐ.అశోక్‌కుమార్, ఎస్‌ఐ.సుధాకర్, హెడ్‌కానిస్టేబుల్ శ్యాంసుందర్, కానిస్టేబుల్లు రాజు, మోహన్, లలిత తదిరతలు పాల్గొన్నారు.

ఏటీఎంలో దొంగతనానికి విఫలయత్నం
అమీన్‌పూర్, సెప్టెంబర్ 19: ఒక ఏటీఎంలో గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనానికి విఫలయత్నం చేసిన సంఘటన రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో బుదవారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. సంఘటనకు సంబందించి సీఐ రామచంద్రారావు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ వెనక భాగంలో ఉన్న బాలాజీ జోద్‌పూర్ మిఠాయి దుకాణం సమీపంలో గత కొంతకాలంగా ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంను కొనసాగిస్తున్నారు. ఎప్పటిలాగే మంగళవారం రాత్రి మిఠాయి దుకాణాన్ని మూసి వేసి నిర్వాహకులు ఇంటికి వెళ్లారు. తెల్లవారుజామున వచ్చేసరికి ఏటీఎం తలుపులు తెరిసి ఉన్నాయి. దీంతో అనుమానం వచ్చిన మిఠాయి దుకాణం యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సంఘటనా స్తలానికి చేరుకున్న పోలీసులు ఏటీఎంను పరిశీలించారు. గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనానకి ప్రయత్నించినట్టు ప్రాథమిక సమాచారానకి వచ్చిన పోలీసులు వెలిముద్రల నిపుణులకు సమాచారం ఇచ్చారు. కాగా మిఠాయి దుకాణం పై కప్పు నుండి లోపలకు ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తులు దుకాణం గల్లాపెట్టేను దొంగిలించే ప్రయత్నం చేసారు. పక్కనే ఏటీఎం కనిపించడంతో తన వెంట తెచ్చుకున్న డ్రిల్‌తో ప్రయత్నించారు. ఏటీఎం ఎంతకు తెరుచుకోకపోవడంతో అక్కడి నుండి వెళ్లిపోయినట్లు పోలీసులు బావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.