మెదక్

సిద్దిపేట కమిషనరేట్‌ను సందర్శించిన ఐజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, సెప్టెంబర్ 19 : తెలంగాణ రాష్ట్ర స్పెషల్ పోలీస్ బెటాలియన్ ఐజీ అభిలాష్ బిస్త్ బుధవారం సిద్దిపేట పోలీస్ కమిషనరేట్‌ను సందర్శించారు. సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్ పుష్పగుచ్చం ఇచ్చిన స్వాగతం పలికారు. సిద్దిపేట కమిషనరేట్ పరిస్థితులపై సీపీ జోయల్ డేవిస్‌ను అడిగి తెలుసుకున్నారు. సిద్దిపేట జిల్లాకు నూతనంగా తెలంగాణ రాష్ట్ర స్పెషల్ పోలీస్ 9వ బెటాలియన్ మంజూరైనందుకు స్థల పరిశీలన చేశారు. కొమురవెళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఐనాపూర్ గ్రామ శివారులోని ప్రభుత్వ స్థలం సర్వే నెంబర్ 140 నందు 213 ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. ఈకార్యక్రమంలో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఈఈ సుదర్శన్‌రెడ్డి, ఏసీపీ మహేందర్, సీఐ రఘు, తహశీల్దార్ భిక్షపతి, ఎస్‌ఐలు కోటేశ్వర్‌రావు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
నూతన సీపీ కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించిన సీపీ జోయల్
దుద్దేడ వద్ద నిర్మిస్తున్న సీపీ కార్యాలయ నూతన భవన నిర్మాణ పనులను సీపీ జోయల్ డేవిస్ పరిశీలించారు. పనులు నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలన్నారు.

బహిరంగ చర్చకు రండి
* తెరాస రాష్ట్ర కార్యదర్శి సవాల్‌కు టీజేఎస్ జిల్లా యువత కన్వీనర్ రాజశేఖర్‌రెడ్డి ప్రతి సవాల్
మెదక్, సెప్టెంబర్ 19: తెరాస రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి సవాల్‌కు యువజన జన సమితి ప్రతి సవాల్ చేసింది. విపక్షాలు అభివృద్ధిపై చర్చకు రండని చిన్నశంకరంపేటలో మంగళవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో దేవేందర్‌రెడ్డి సవాల్ చేశారు. అందుకు బుధవారం మెదక్ రహదారి బంగ్లాలో విలేఖరుల సమావేశంలో యువజన జన సమితి ప్రతి సవాల్ చేస్తూ గురువారం చిన్నశంకరంపేట చౌరస్తాలో వంద మంది బృందంతో దేవేందర్‌రెడ్డి అవినీతిని మెదక్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్దిపైన చర్చకు వేదిక ఏర్పాటు చేశామని యువత జిల్లా టీజేఎస్ కన్వీనర్ రాజశేఖర్‌రెడ్డి సవాల్ చేశారు. ఈ వేదికకు తెరాస రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి రావాలని ఆయన ఆహ్వానించారు. పరోక్షంగా తెరాస కార్యకర్తల సమావేశంలో ఓ న్యాయవాది అంటూ ఆయన ఎవరో అంటూ జనార్దన్‌రెడ్డిపై దేవేందర్‌రెడ్డి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. దేవేందర్‌రెడ్డి అవినీతిని, మెదక్ నియోజకవర్గంలో జరిగిన రెండు వేల కోట్ల అభివృద్ది పనులపై కూడా చర్చకు సిద్దంగా ఉన్నామని ఆయన సవాల్ చేశారు. మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఎన్నికల సమయంలో అఫ్టావిటలో పేర్కొన్న ఆస్తులకు ఇప్పుడున్న ఆస్తులను బహిర్ఘతం చేస్తామని, అందుకు సంబంధించిన ఆధారాలతో వస్తున్నట్లు ఆయన తెలిపారు. తమ నాయకుడు టీజేఎస్ జిల్లా కన్వీనర్ జనార్దన్‌రెడ్డితో పాటు యువకులు, రైతులు కలిసి చిన్నశంకరంపేట చౌరస్తాకు గురువారం ఉదయం 10 గంటలకు చేరుకుంటామని తెలిపారు.

టీఆర్‌ఎస్ కార్యాలయం ప్రారంభం
పటన్‌చెరు, సెప్టెంబర్ 19: పటన్‌చెరు పట్టణంలో మాజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి బుధవారం టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. జాతీయ రహదారి ప్రక్కన కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం పార్టీ జెండా ఆవిష్కరించారు. త్వరలో జరగబోయె శాసనసభ ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడి నుండే మొదలు పెడతామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. గెలుపు ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఓటరును కలవాలని నిర్ణయించామన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో 18 వేల మెజారిటితో విజయం సాధించామని గుర్తుచేసారు. ఈ సారి ఎన్నికలలో సుమారు యాభై వేల ఓట్ల మెజారిటి సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం ఎంపిపి నాలకంటి యాదగిరి యాదవ్, టిఆర్‌ఎస్ పట్టణ కమిటీ అధ్యక్షుడు బాయికాడి విజయ్‌కుమార్, నియోజకవర్గ మార్కెట్ కమిటీ చైర్మన్ బూరుగడ్డ పుష్ప, డైరెక్టర్ వంగరి అశోక్ తదితరులు పాల్గొన్నారు. పటన్‌చెరు తాజా మాజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి జన్మదిన వేడుకలు బుధవారం పట్టణంలో అత్యంత ఘనంగా నిర్వహించారు.