మెదక్

2013 భూ సేకరణ చట్టం ప్రకారమే పరిహారం ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, సెప్టెంబర్ 19: జాతీయ రహదారి విస్తరణలో భూములు కోల్పోతున్న వారందరికి 2013 భూ సేకరణ చట్టం ప్రకారమే పరిహారం ఇవ్వాలని, ఇళ్ల కోల్పోతున్న వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మించి ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, బీఎల్‌ఎఫ్ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం కన్వీనర్ చుక్క రాములు డిమాండ్ చేశారు. బుధవారం మామిడిపల్లి గ్రామంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు సాయిలు అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. అనంతరం అక్కడి నుండి సంగారెడ్డి కలెక్టరేట్ నిర్వహించిన పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్రతో వస్తున్న బృందానికి ఫసల్‌వాది, సదాశివనగర్‌లో ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి డీఆర్‌ఓకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా చుక్క రాములు మాట్లాడుతూ 161వ జాతీయ రహదారి రోడ్డు విస్తరణలో భూములు, ఇళ్లు కోల్పోతున్న రైతులకు న్యాయం చేకూర్చే వరకు బీఎల్‌ఎఫ్ అండగా ఉంటుందని, పెద్దల భూములు కాదని పేదల భూముల జోలికొస్తే తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. కంది, సంగారెడ్డి మండలంలోని మామిడపల్లి, తునికిల తాండ, గుడితాండ, ఫసల్‌వాది గ్రామాలలో జాతీయ రహదారి 161 రోడ్డు విస్తరణలో భూములు, ఇళ్లు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ వీరికి ఈ భూములే జీవనాధారంగా ఉన్నాయన్నారు. ఆనాదిగా సాగు చేస్తూ కన్నతల్లిలాంటి భూములను కోల్పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. బోర్లు, ఇళ్లు, చెట్లు, పండించిన పంటలను సైతం కోల్పోతున్న వారికి 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం అందిస్తేనే వీరికి న్యాయం చేకూర్చినట్లవుతుందన్నారు. ఈ చట్టంలో ద్వారా 3, 4 రెట్లు మార్కెట్ విలువను బట్టి నష్టపరిహారం చెల్లించాలన్న నిబంధనను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడ మార్కెట్ విలువ కోటిన్నరకు ఎకరం పలుకుతుందని, ఆ విధంగానే రైతులకు పరిహారం చెల్లించాలని కోరారు. ఇండ్లు కోల్పోతున్న వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఉపాధి కల్పించాలన్నారు. ఐఐటీ హైదరాబాద్‌లో అదనంగా భూమి లాక్కుంటున్న రైతులకు సైతం 2013 చట్టం ప్రకారం నష్ట పరిహారం ఇవ్వాలన్నారు. 2013 భూ సేకరణ చట్టాన్ని పక్కన పెట్టి, అక్రమంగా రైతుల నుండి బలవంతంగా భూములు లాక్కోవడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వ నిర్వాహకంతో రైతులతో పాటు గ్రామాల్లో పని చేసే వృత్తిదారులు, కూలీలు సైతం రోడ్డున పడతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారానికి పోరాటమే సరైన మార్గమని తెలిపారు. పరిష్కరించే వరకు ఆందోళన చేపట్టాలని గ్రామాల నిర్వాసితులకు పిలుపునిచ్చారు. రైతులకు అన్ని విధాలుగా బీఎల్‌ఎఫ్ అండగా ఉందని భరోసా కల్పించారు. ప్రభుత్వ విధివిధానాలు ప్రకటించిన తరువాతనే భూముల సేకరణ చేయాలని, లేనిపక్షంలో పోరు ఉదృతం చేస్తామని చుక్క రాములు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి బీరం మల్లేశం, మామిడిపల్లి మాజీ సర్పంచ్ మధుసుగుణ, రామ్‌ధన్‌నాయక్, ఎండీ అఫ్జల్, జానకీరామ్, శివశంకర్, కిషన్‌నాయక్, మిట్యానాయక్, ఇట్యనాయక్, శంకర్‌నాయక్, పునిబాయి, రుక్మిబాయి, మాలిబాయి, సాలిబాయి, సీపీఎం నాయకులు బాగారెడ్డి, బాలరాజు, శ్రీనివాస్ షఫీ, నర్సింలు, మానిక్యం, నర్సింహారెడ్డి, ఖాజా, రత్నయ్య తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల ప్రచారానికి మంత్రి శ్రీకారం
* గుర్రాలగొంది, కొచ్చగుట్టపల్లిలో ఏకగ్రీవ తీర్మానాలు
* భారీ ర్యాలీతో కదం తొక్కిన కార్యకర్తలు
* ఏడ్లబండిపై మంత్రి హరీష్‌రావు ఊరేగింపు
సిద్దిపేట, సెప్టెంబర్ 19 : రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు సిద్దిపేట నియోజక వర్గం ఈశాన్య దిక్కు గ్రామమైన గుర్రాలగొంది నుండి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మంత్రి హరీష్‌రావుకు అనుకూలంగా సిద్దిపేట రూరల్ మండలం గుర్రాలగొంది, చిన్నకోడూరు మండలం కొచ్చగుట్టపల్లి పల్లిగ్రామస్తులు వచ్చే ఎన్నికల్లో మంత్రి హరీష్‌రావుకు అనుకూలంగా ఏకగ్రీవంగా తీర్మానం చేసి, తీర్మాన పత్రాలను అందచేశారు. బుధవారం మంత్రి హరీష్‌రావు గుర్రాల గొంది గ్రామానికి చేరుకోగానే గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళహరతులు, బతుకమ్మలతో స్వాగతం పలికారు. హరీష్‌రావు నుదుటిపై తిలకం దిద్దారు. మంత్రి హరీష్‌రావుకు అనుకూలంగా టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేశారు. గంగాపుత్రులు జలపందిరీలు, గొల్లకుర్మల డోలు వాయిద్యాలు భారీ ర్యాలీ నిర్వహించారు. టీఆర్‌ఎస్ జెండాలతో ఎడ్లబండిని ప్రత్యేకంగా అలంకరించారు. మంత్రి హరీష్‌రావు ఎడ్లబండీపై ఎక్కించి ప్రత్యేకంగా ఊరేగించారు. గ్రామం నుండి రేణుక మాత ఆలయం వరకు మంత్రి హరీష్‌రావు ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఆనంతరం సభా వేదిక వద్దకు మంత్రి హరీష్‌రావును ర్యాలీగా తీసుకెళ్లారు. మంత్రి హరీష్‌రావుకు గ్రామంలోని యాదవసంఘం, మహిళ సంఘం, మున్నూరుకాపు సంఘం, రెడ్డిసంఘం, అంబేద్కర్ సంఘం, శాలివాహన సంఘం, ముదిరాజ్ సంఘం, ఆర్యవైశ్య సంఘం, గంగాపుత్ర సంఘం, ముస్లీం సొదరులు మంత్రి హరీష్‌రావుకు మద్దతు తీర్మాణ పత్రాలు, నామినేషన్ ఫీజు కోసం 30,216 రూపాయలు అందేచేశారు. చిన్నకోడురు మండలం కొచ్చగుట్టపల్లిలో మంత్రి హరీష్‌రావుకు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. రంగనాయక్ సాగర్ ముంపు గ్రామస్తులు అనుకూలంగా తీర్మానం చేశారు. భూ నిర్వాసితులు కడుపులో దాచుకొని, గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాన్నారు. మంత్రి హరీష్‌రావును ఘనంగా సన్మానించారు.