మెదక్

అర్హుల ఓట్లను తొలగిస్తే చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, సెప్టెంబర్ 19: అశ్రద్ధ,అజాగ్రత్తతో అర్హుల ఓట్లను తొలగిస్తే సంబంధితులపై చర్యలు తప్పవని కలెక్టర్ ఎం.హన్మంతరావు హెచ్చరించారు. తొలగించిన ఓటరు జాబితాలో దివ్యాంగులు, విఐపిలు తదితరుల ఓట్లు ఉన్నది లేని బీఎల్‌ఓ నుండి ఏఆర్‌ఓ వరకు సరిచూడాలన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈఆర్‌ఓలు, ఏఆర్‌ఓలు, కంప్యూటర్ ఆపరేటర్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈఆర్‌ఓలు, ఏఆర్‌ఓలు బాధ్యతాయుతంగా సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. చనిపోయిన, బోగస్ ఓటర్ల తొలగింపు,మండలం వారిగా వచ్చిన ఫారం 6,7 వివరాలు, ఆయా వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ నమోదు, అప్‌లోడ్, ఈపి రేషియో తదితర అంశాలపై సుదీర్ఘంగా సమీక్షించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో అన్నింటిని ఆన్‌లైన్‌లోనే ధరఖాస్తు చేయాల్సి ఉంటుందని ఈసీఐ పేర్కొన్నారని, సంబంధిత విషయాలపై పూర్తి అవగాహాన కలిగి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఆయా యాప్‌లలో వచ్చిన ధరఖాస్తులను ఏ విధంగా పరిశీలించాలని, పరిష్కరించాలన్న అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఓటరు జాబితాపై ఈఆర్‌ఓలు దృష్టి సారించాలన్నారు. చనిపోయిన ,బోగస్ ఓటర్ల తొలగింపుకు సంబంధించి ఎవిడెన్స్ తీసుకోవాలని, అన్ని డాకుమెంట్లు ఉండాలని, తొలగింపు జాబితాను గ్రామ పంచాయతీలో డిస్‌ప్లే చేయాల్సి ఉంటుందన్నారు. తహసీల్ధార్లు, కంప్యూటర్ ఆపరేటర్లు పని చేస్తున్న హెడ్‌క్వార్టర్‌లోనే ఉండాలని ఆదేశించారు. ఓటర్ జాబితా పరిశీలన, నమోదు, ఈపి రేషియో, బిఎల్‌ఓలపై పర్యవేక్షణ లేకపోవడం, పనులలో జాప్యం చేస్తున్న ముగ్గురు తహసీల్ధార్లపై కలెక్టర్ ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ముగ్గురికి తాకీదు (మెమోలు) జారీ చేశారు. సమీక్షలో ఈఆర్‌ఓలు, ఏఆర్‌ఓలు, కంప్యూటర్ ఆపరేటర్లు పాల్గొన్నారు.

నీళ్ల దొంగలు తెరాస నేతలు
* ఓటమి భయంతోనే ముందుస్తు ఎన్నికలు
* డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి
కొల్చారం, సెప్టెంబర్ 19: తెరాస నీళ్ల దొంగని, సింగూర్ నుండి ఇక్కడి ప్రజలను మోసం చేసి నీళ్లు తీసుకుపోయి ప్రజల నోట్లో మట్టికొట్టారని, ఓటమి భయంతోనే ముందస్తు ఎన్నికలకు సిద్ధమైందని మెదక్ ఉమ్మడి జిల్లా డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని వరిగుంతం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా పండుగకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై వరిగుంతంలో పలువురు తెరాస నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. చిన్నఘణపురంలో కూడా సునీతారెడ్డికి గ్రామస్థులు భారీయేత్తున భజాభజంత్రీలతో స్వాగతం పలికి బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆమె ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియాగాంధీ అని, 1200 మంది ఉద్యమకారులు ఆత్మహత్యలు చేసుకుంటేనే మనస్సు చలించి తెలంగాణను ఇచ్చిందన్నారు. నాడు సోనియాగాంధీని దేవత అని, నేడు ఇష్టవంచినట్లు మాట్లాడటం ఎంత వరకు సమంజసం అని ఆమె ప్రశ్నించారు. గత ప్రభుత్వంలోనే కొల్చారం మండలాన్ని వంద కోట్ల రుపాయలతో అభివృద్ది పనులను తన కృషి వలనే సాధించానన్నారు. మరోసారి తనను కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిపిస్తే నర్సాపూర్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుపాయల రుణమాఫి, ఉపాధ్యాయులకు సీపీఎస్ విధానం రద్దుచేసి పాత పెన్షన్ విధానం అమలు పరుస్తామని, నిరుద్యోగులకు జీవన బృతి క్రింద 10 లక్షలు ఇప్పిస్తామని, డీఎస్సీ 30 వేల పోస్టులతో మెగా డీఎస్సీ ఏర్పాటు చేస్తామన్నారు. వికలాంగులకు 2500, వికలాంగులకు నిత్యవసర వస్తువులు ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. రేషన్ సరఫరాలో సన్నబియ్యం సరఫరా చేస్తామన్నారు. ఇప్పటి వరకు తెరాస ప్రభుత్వం సీసీ రోడ్లుగానీ, ప్రభుత్వ పథకాలను పేర్లు మార్చి అమలు చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాలను రద్దు చేస్తూ కొత్త పేర్లు పెట్టి పంపిణీ చేస్తున్నారని తెలిపారు. అలాగే వరిగుంతం గ్రామం నుండి లిఫ్ట్‌ల ద్వారా ఎత్తిపోతల పథకాలను మంజూరు చేయించి నిర్మించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రైవేటుపరం కాకుండా ప్రభుత్వ సంస్థగా గుర్తింపు తెస్తామన్నారు.

* తెరాస నుండి కాంగ్రెస్‌లో చేరిక
తెరాస పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో బుధవారం మాజీ మంత్రి సునీతారెడ్డి ఆధ్వర్యంలో వరిగుంతం గ్రామానికి చెందిన ఇద్దరు వార్డు సభ్యులు, ఇద్దరు ఎస్‌ఎంసీ చైర్మన్లు, సీతారాం తండాకు చెందిన 25 మంది గిరిజనులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి ఆమె కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో మంజులాల్, పాండు, రాజు, రవి, శ్రీనివాస్, సురేష్, బాలయ్య, లక్ష్మణ్, బద్య, కిషన్, నరేందర్, రఘుపతి, మొగులయ్య, సత్యనారాయణ తదితరులు ఉన్నారు.