మెదక్

అసమర్థతతోనే ముందస్తు ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌడిపల్లి, సెప్టెంబర్ 20. ఐదు సంవత్సరాలు పాలించమని టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి గత ఎన్నికల్లో పట్టం కట్టినా ఇచ్చిన హమీలను నెరవేర్చలేక ఓటమి భయంతోనే టీఆర్‌ఎస్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళిందని మాజీ మంత్రి, డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి అన్నారు. కాంగ్రెస్ జెండా పండుగ కార్యక్రమంలో భాగంగా చిలప్‌చెడ్ మండలంలోని జగ్గంపేట, అంతారం, నామ్యాతండా, రహీంగుడా తండా, రాందాస్‌గూడ, సోమక్కపేట, శీలాంపల్లి, చిలప్‌చెడ్‌లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో, తండాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో సునీతారెడ్డి మాట్లాడారు. నియంతలా వ్యవహరించి ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలిన సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి కాలం చెల్లిందన్నారు. కల్లబొల్లి మాటలతో ప్రభుత్వం నాలుగున్నర సంవత్సరాల కాలాన్ని వెల్లదీసిందన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హమీలను ఏ ఓక్క హమీని కూడా టీఆర్‌ఎస్ ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. విడతల వారి రుణమాఫీతో రైతులపై రుణభారం పెరిగిందన్నారు. రుణమాఫీలో లబ్ధిపొందిన రైతుకలకు వడ్డ్భీరం లేకుండా చూస్తాన్న ప్రభుత్వం ఇప్పటికీ ఓక్క రుపాయి కూడ బ్యాంకులకు చెల్లించలేదన్నారు. సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గంలోని రెండు, మూడు గ్రామాల్లో తప్ప రాష్ట్రంలో ఎక్కడ డబుల్‌బెడ్ రూం ఇళ్లు కనిపించడం లేదన్నారు. మిషన్ భగీరథ, మిషన్‌కాకతీయ పనులు టీఆర్‌ఎస్ నాయకులకు కమీషన్ పథకాలుగా మారాయని సునీతారెడ్డి ఎద్దేవా చేశారు. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా శుద్ధమైన తాగునీరు ఇస్తానన్న ప్రభుత్వం, ఇస్తేనే మళ్లీ ఎన్నికల్లో ఓట్లు అడుగుతానని ఏ మొఖం పెట్టుకుని ఎన్నికలకు సిద్ధమయ్యారని అన్నారు. నియోజకవర్గంలోని ఏ గ్రామంలో చూసిన గత కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్ధి పనులే కనిపిస్తున్నాయని అన్నారు. గత నాలుగున్నర సంవత్సరాల్లో నర్సాపూర్ నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమన్నారు. టీఆర్‌ఎస్ నాయకులకు మళ్లీ ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు మరోమారు ప్రజలను మోసగించేందుకు ప్రజా క్షేత్రంలో వస్తున్నారన్నారు. గత ప్రభుత్వ అసమర్థతను ప్రజలు ఎండగడుతూ టీఆర్‌ఎస్ నేతలను తిప్పి కొట్టాలని సునీతారెడ్డి పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే రైతులకు 2 లక్షల రుపాయల రుణమాఫీ ఎకకాలంలో అందిస్తామన్నారు. ఇందిరమ్మ గృహనిర్మాణ పథకాన్ని పునఃప్రారంభించి ఇళ్లు లేని పేదలకు ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రుపాయలు మంజూరు చేస్తుందన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించి ప్రతి సంఘాన్నికి 10 లక్షల రూపాయల రుణాన్ని అదనంగా ఇస్తూ మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తామని సునీతారెడ్డి తెలిపారు. డీఎస్సీ నిర్వాహణతో పాటు లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు భర్తిచేస్తామని సునీతారెడ్డి వెల్లడించారు. గ్రామాల్లో పార్టీ జెండాను ఆవిష్కరించిన సునీతారెడ్డికి ఘన స్వాగతం లభించింది. యువకులు భారీ బైకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యాక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఎం.సీ.విఠల్, కౌడిపల్లి పార్టీ అధ్యక్షుడు ఎల్లం, మండల మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు మీనాప్రసన్న, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, నాయకులు సంగాగౌడ్, రాంచెంద్రారెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి, భీమయ్య, అనంతరామాగౌడ్, నారాయణరెడ్డి, బాలరాజు, అంజయ్యగుప్తా, హన్మంతు, మనోహర్‌రెడ్డి, విఠల్, లింగం, తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధిని చూసి అశీర్వదించండి
మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి
చిన్నశంకరంపేట, సెప్టెంబర్ 20: నాలుగు సంవత్సరాల్లో తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని, మరెంతో అభివృద్ధి చేయడానికి తిరిగి తనను ఆశీర్వదించండని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. గురువారం చిన్నశంకరంపేట అమరవీరుల స్థూపం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో 200 మంది మహిళలు తెరాస పార్టీలో చేరగా పద్మాదేవేందర్‌రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మహిళలు రాష్ట్భ్రావృద్దిలో మేము సైతం ముందుకు రావడం జరుగుతుందన్నారు. నాలుగు సంవత్సరాలు ఎంతో అభివృద్ది చేశానని, దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని రైతుబంధు పథకం ద్వారా 12 వేల కోట్లు కేసీఆర్ కేటాయించడం జరిగిందన్నారు. రైతులకు రెండు విడతలుగా ఎనిమిది వేల రుపాయలు అందించడం జరిగిందన్నారు. కల్యాణ లక్ష్మీ పథకం, షాదీముబారక్ వంటి పథకాలతో పేదలకు అండగా ఉంటున్నామని, చెరువు కుంటల అభివృద్ధి, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ తదితర పథకాలతో ప్రజల్లో నిలిచిపోయిన కేసీఆర్ అభివృద్ధిని ఓర్వలేక లేనిపోని అబాండాలు మోపుతున్నారని, ఇది మిత్రపక్షాలకు తగదన్నారు. అభివృద్ధి విషయంలో అందరు కలిసి రావాలని సూచించారు. అనంతరం సభా వేదిక ప్రాంగణంలో మహిళలతో కలిసి బతుకమ్మ ఆట ఆడారు. లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి చైర్మన్ గంగ నరేందర్, జడ్పీటీసీ స్వరూప సురేందర్‌నాయక్, వైస్ ఎంపీపీ విజయలక్ష్మీ, మండల పార్టీ అధ్యక్షులు పి.రాజు, కుమార్‌గౌడ్, సాన సత్యనారాయణ, లక్ష్మారెడ్డి, రమేశ్‌గౌడ్, లస్మాగౌడ్, లింగంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.