మెదక్

ఎడతెరిపి లేని వాన.. స్తంభించిన జనజీవనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, సెప్టెంబర్ 21: మెదక్ జిల్లాలో శుక్రవారం ఉదయం 4 గంటల నుండి రాత్రి వరకు ఎడతెరిపిలేని వర్షాలతో జన జీవనం స్థంభించింది. ఈ వర్షాలతో వరి రైతులు ఊరట పొందారు. కానీ ప్రాజెక్ట్‌లు, చెరువులకు నీళ్లు చేరలేదు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పొట్టకు వచ్చిన వరి పొలాలు ఊపిరి పోసుకున్నాయి. రైతులు తమ పంటలకు నీళ్లు వదలాలని చేసిన డిమాండ్ మేరకు సింగూర్ నుండి ఘణపురం ఆనకట్ట నీళ్లు వదిలేందుకు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఘణపురం ఆయకట్టు క్రింద ఉన్న పొలాలకు వర్షాలతో పాటు సింగూరు నీరు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇకపోతే బోరుబావుల వద్ద ఉన్న పంటలకు భూగర్భ జలాలు ఆసక్తికరంగా లేవు, కానీ ఈ వర్షాలతో కొంతమేర రైతులు సంతోషంగా ఉన్నారు.

చిత్తడిగా మారిన మెదక్ పట్టణం

కురుస్తున్న వర్షాలతో మెదక్ పట్టణం చిత్తడిగా మారింది. మిషన్ భగీరథ క్రింద మెదక్ పట్టణంలోని 27 వార్డులలో పైప్‌లైన్ల కోసం గుంతలు తీశారు. దీని ద్వారా వర్షాలకు ముందే ప్రజలు, వాహనాలు నడవలేని పరిస్థితులు నెలకొన్నాయి. కురుస్తున్న వర్షాలతో గల్లీలో నడవలేని పరిస్థితి నెలకొంది. మిషన్ భగీరథ పనులేమోగానీ ప్రజలకు మాత్రం చాలా ఇబ్బందులను కలిగిస్తున్నాయి. మరోప్రక్క రోడ్డు విస్తరణ పనులు గత నాలుగు సంవత్సరాలుగా ప్రజలను ఇబ్బంది కలిగిస్తుంది. మెదక్ పట్టణం మెయిన్ రోడ్డులో వాహనాలు నడవలేని పరిస్థితుల్లో ఉన్నాయి. గుంతలు అధికంగా ఉన్నాయి. ఆ గుంతలను పూడ్చడం లేదు. ఫోర్ లైన్స్‌లో భాగంగా కంకర వేసి మరమత్తులు చేపట్టలేదు. డివైడర్ ఇరుప్రక్కల భారీ గుంతలు ఉండట వలన వాహనాలు, ప్రజలు నడవలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ బాధలు ఎప్పుడు తీరుతాయని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు వర్షాలతో తడిసి ముద్దయ్యాయి. మెదక్ బాలికల హైస్కూల్ తడిసి ముద్దయింది. ఎప్పుడు వర్షం వస్తే అప్పుడు సెలవులు ప్రకటించాల్సి వస్తుంది. భవనం ఉరుపులతో గదులు, వరండాల్లో నీళ్లు నిలుస్తాయి. భవనం ఎప్పుడు కూలుతుందోననే భయాందోళనలో విద్యార్థులు ఉన్నారు. అదే పరిస్థితుల్లో ప్రభుత్వ బాలుర హైస్కూల్, న్యూ హైస్కూల్స్ కొనసాగుతుంది. ముఖ్యంగా ఇందిరా ప్రియదర్శిని బాలికల కళాశాల భవనం లేదు. వీరి చదువులంతా గత నాలుగేళ్లుగా చెట్ల క్రిందనే కొనసాగుతుంది. నిర్మిస్తున్న నూతన భవనం పూర్తి కాలేదు. అందువలన ప్రభుత్వం వెంటనే స్పందించి వర్షాకాలంలో ఎదుర్కొంటున్న కళాశాలలు, హైస్కూల్స్ పాఠశాల పరిస్థితులను మెరుగుపర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎబీవీపీ, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.