మెదక్

నిధులు, నీళ్లను మట్టిలో కలిపారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొల్చారం, సెప్టెంబర్ 21: 14 ఏళ్ల పోరాటంలో ఎన్నో ఉద్యమాలు చేపట్టి అమరవీరుల త్యాగఫలంతో సాధించుకున్న తెలంగాణను నాలుగేళ్లలో అభివృద్ది చేయకుండా గాలికి వదిలేశారని మాజీ మంత్రి, డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి మండిపడ్డారు. శుక్రవారం మండలంలోని మాందాపూర్, ఎనగండ్ల, పైతర, కోనాపూర్ గ్రామాల్లో జెండా పండుగ నిర్వహించిన అనంతరం పైతరలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. రైతులకు రుణమాఫి ఇస్తామని నాలుగు విడతలు ఇచ్చి వడ్డీ మరింత పెచిందని, డ్వాక్రా మహిళలకు గత ప్రభుత్వంలో పవలా వడ్డీ ఇచ్చామని, ఈ ప్రభుత్వం వచ్చాక ఆ ఊసే లేదన్నారు. అభయహస్తం క్రింద మహిళలను ఎంపిక చేస్తే వాటిని పక్కన పెట్టి తూతూ మంత్రంగా ఫించన్లు ఇచ్చిందని ఎద్దేవ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫి, ఉద్యోగులకు మెగా డీఎస్సీ, నిరుద్యోగులకు నిరుద్యోగబృతి, రెండు వేలకు ఫించన్, రేషన్ ద్వారా సన్నబియ్యం, వికలాంగులకు ఉచితంగా సరఫరా చేస్తామని ఆమె తెలిపారు. అదే విధంగా కొల్చారం మండలంలోని వరిగుంతం, కొల్చారం, అంసాన్‌పల్లి, కొంగోడ్ వరకు సాగునీరు అందిస్తామన్నారు. రాహుల్‌గాంధీ ప్రధాని అయితే దేశాన్ని మరింత అభివృద్ది పథంలో నడిపిస్తామన్నారు. బీజేపీ, తెరాసలు రెండు రెండేనని ఆమె దుయ్యబట్టారు. ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నాలుగేళ్లు సాగదీశారని, చివరకు చేతులు దులుపుకున్నారన్నారు. జోనల్ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చి 31 జిల్లాలను ఏడు జోన్లు చేశారని, ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. ప్రజలకు స్వంతింటి కళ నెరవేర్చుతానని, స్వంత స్థలంలో ఆరు లక్షలతో ఇండ్లను నిర్మిస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లకు అధనంగా మరో రూమ్‌కు రెండు లక్షలు అందజేస్తామని తెలిపారు.