క్రైమ్/లీగల్

సెక్యూరిటి గార్డ్ దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లాదుర్గం, సెప్టెంబర్ 22: అల్లాదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐబీ చౌరస్తా సమీపంలో ఓ సెక్యూరిటి గార్డ్ దారుణ హత్యకు గురయ్యాడు. అల్లాదుర్గం సీఐ ఇన్‌చార్జి, మెదక్ రూరల్ సీఐ రామకృష్ణ కథనం ప్రకారం శుక్రవారం రాత్రి ఐబీ చౌరస్తా సమీపంలో బీటీ రోడ్డు ప్రక్కన రాకేశ్‌సింగ్ యాదవ్(45)ను దారుణంగా హత్య చేసి రోడ్డు ప్రక్కన గల చెట్టు క్రింద పడవేసినట్లు మృతదేహం ఉంది. మృతుడి తలపై బలమైన గాయాలు ఉన్నట్లు తెలిపారు. మృతి చెందిన రాకేశ్‌సింగ్ యాదవ్ అల్లాదుర్గం కేఎన్‌ఆర్ కన్‌స్ట్రక్షన్ సంస్థలో సెక్యూరిటి గార్డ్‌గా పనిచేస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మిన్‌పూర్ జిల్లాకు చెందిన వాడు. కాగా ఉత్తరప్రదేశ్‌లో ఓ ప్రైవేటు సెక్యూరిటి సంస్థ ద్వారా అల్లాదుర్గంకు ఎనిమిది మందిని కన్‌స్ట్రక్షన్ సంస్థలో సెక్యూరిటి గార్డ్స్‌గా పనిచేస్తున్నారు. మృతుడి భార్యకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో వెళ్లేందుకు సిద్ధం కాగా ఇందులో పనిచేస్తున్న మరొకరు సుశ్విందర్‌సింగ్ యాదవ్ కూడా వెళ్లేందుకు సిద్దమైనట్లు సీఐ తెలిపారు. వీరి వద్ద డబ్బులు లేకపోవడంతో సూపర్‌వైజర్ సురేందర్‌సింగ్ యాదవ్‌ను అడుగగా నెల జీతాలు ఇవ్వడంతో శుక్రవారం రాత్రి వీరు అల్లాదుర్గం ఐబి చౌరస్తాకు వెళ్లి మద్యం తాగినట్లు తెలిపారు. కాగా శనివారం ఉదయం రాకేశ్‌సింగ్ మృతదేహం చెట్టు క్రింద పడి ఉన్నట్లు తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. కాగా ఈ విషయంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపించేందుకు జాగిలాలను రప్పించగా అవి కేఎన్‌ఆర్ సంస్థకు వెళ్లినట్లు సీఐ తెలిపారు. ఇతని మృతికి తోటి సెక్యూరిటి గార్డ్ సుశ్విందర్‌సింగ్ అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుశ్విందర్‌సింగ్ పరారిలో ఉన్నట్లు సీఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. సీఐ వెంట పాపన్నపేట, టేక్మాల్ ఎస్సైలు సందీప్‌రెడ్డి, ఎల్లాగౌడ్, అల్లాదుర్గం ఏఎస్సై సర్దార్‌లు ఉన్నారు.

ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం
* ప్రయాణికులు క్షేమం
మెదక్ రూరల్, సెప్టెంబర్ 22: ఆర్‌టిసి ఎక్స్‌ప్రెస్ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. ఎదురుగా ఉన్న వాహనం తప్పించబోగా బ్రేకులు ఫెయిలైన బస్సును డ్రైవర్ చాకచక్యంతో వరిపొలాల్లోకి దించడంతో ప్రమాదం తప్పిన సంఘటన హవేళీఘణాపూర్ మండలం రాయిన్‌చెరు గేట్ వద్ద మెదక్-బోధన్ మెయిన్ రోడ్డులో శనివారం మద్యాహ్నాం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా బాన్సువాడ డిపోకు చెందిన ఎపి 29జడ్ 2894 నెంబరుగల ఎక్స్‌ప్రెస్ బస్సు హైదరాబాద్ నుండి తిరుగు ప్రయాణంలో మెదక్ నుండి బోధన్ వెళ్తోంది. పట్టణానికి ఆరు కిలోమీటర్ల దూరంలో రాయిన్‌చెరు గేట్ వద్ద రోడ్డుకు అడ్డంగా మిషన్ భగీరథ పైప్‌లైన్ కోసం తవ్విన గుంత వద్ద ఎదురుగా వాహనం ఉండడంతో డ్రైవర్ మోహన్ బ్రేక్ వేయబోగా ఫెయిల్ అవడంతో వెంటనే పక్కనే ఉన్న వరిపొలాల్లోకి బస్సును దించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రయాణికులు పెద్దయెత్తున అరుస్తు ఆదరాబాదరగా కిందికిదిగి ఊపిరిపీల్చుకున్నారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆ సమయంలో బస్సులో ప్రయాణికులు కెపాసిటికి మించి ఉన్నట్లు తెల్సింది. గత వారం రోజులుగా ఆర్‌టిసి బస్సు ప్రమాదాల్లో అనేకమంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్న విషయం తెల్సిందే. బస్సు రోడ్డుకిందికి దిగిపోవడంతో మెదక్-ఎల్లారెడ్డి వైపు వెళ్లే ప్రయాణికులు, ఇతర వాహనదారులు పెద్దయెత్తున గుమిగూడారు.