మెదక్

పర్యాటక కేంద్రంగా సంగాపూర్ అటవీ ప్రాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, సెప్టెంబర్ 22: గజ్వేల్ పట్టణ శివారులోని సంగాపూర్ అటవీ ప్రాంతం మంచి పర్యాటక కేంద్రంగా విలసిల్లబోతోందని కలెక్టర్ కృష్ణ్భాస్కర్ పేర్కొన్నారు. శనివారం అటవీ ప్రాంతంలోని ఉద్యానవన పార్కు, గజబోల్, వాచ్‌టవర్, స్వాగతతోరణం, వణ్యప్రాణుల బొమ్మలను పరిశీలించిన సందర్బంగా ఆయన మాట్లాడారు. 300ల ఎకరాల్లో ఉద్యాన వన పార్కు ఏర్పాటవుతుండగా, అందులో 9 కిలోమీటర్ల వాకింగ్‌పాత్, నక్షత్రవనం, రాశివనం, స్మృతివనం, చిన్నపిల్లల కోసం అడ్వెంచర్ గేమ్స్ పార్క్, కాంపౌండ్‌వాల్ నిర్మాణం, ఫెన్సింగ్ పనులు, ఎవెన్యూ ప్లాంటేషన్ తోపాటు 20 రకాల మొక్కలు పెంచుతూ గజ్వేల్ పట్టణ ప్రజలు, వృద్దులు, చిన్నారులకు ప్రశాంత, ఆహ్లాదకర వాతావరణం పంచే విధంగా అటవీ శాఖ ఆద్వర్యంలో ప్రకృతి సిద్దంగా కనిపించే విధంగా రూపుదిద్దుకుంటున్నట్లు స్పష్టం చేశారు. కాగా రూ. 10కోట్ల వ్యయంతో వివిద పనులు చివరి దశకు చేరుకోగా, త్వరలోనే గొప్ప పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ది చెందే అవకాశమున్నట్లు వివరించారు. ఆయన వెంట ట్రేయినీ కలెక్టర్ అవిశ్యంత్ పాండ, గడా అధికారి ముత్యం రెడ్డి, ఆర్డీఓ విజేందర్‌రెడ్డి, ఫారెస్ట్ రేంజ్ అధికారి వెంకట్‌రామారావు తదితరులు పాల్గొన్నారు.

కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం
* మహిళల సంక్షేమం మరిచిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం: డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి
కౌడిపల్లి, సెప్టెంబర్ 22. రానున్న అసెంబ్లీ ముందస్తు ఎన్నికలతో ప్రజలు టీఆర్‌ఎస్ కుటుంబపాలనకు చరమగీతం పాడనున్నారని మాజీ మంత్రి, డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి అన్నారు. కాంగ్రెస్ జెండా పండుగ కార్యక్రమంలో భాగంగా శనివారం కౌడిపల్లి మండలంలోని తునికి, ఎస్సీకాలనీ, హరిచంద్‌తండా, అమర్‌సింగ్ తాండాల్లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సునీతారెడ్డి మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పాలనకు చరమగీతం పాడడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. నాలుగున్నర సంవత్సరాల పాటు రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన జరిగిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలు కమీషన్ల పథకాలుగా మారాయని ఈ పథకాలతో ప్రజలకు జరిగిన ప్రయోజనం ఏమీలేదన్నారు. గత నాలుగన్నర సంవత్సరాలో నియోజకవర్గంలోని గ్రామాల్లో, తండాల్లో జరిగిన అభివృద్ది శూన్యమని, కేవలం టీఆర్‌ఎస్ నాయకులే అభివృద్ధి చెందారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్వయం సంఘాల మహిళలకు కేసీఆర్ ప్రభుత్వం చేసింది శూన్యమన్నారు. రానున్న ఎన్నికల్లో మహిళలలు తమ ఓటు ద్వారా టీఆర్‌ఎస్ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. రాబోయే ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు.

ప్రతి ఓటు సక్రమంగా ఉండాలి
* ఎన్నికల రోల్ అబ్జర్‌వర్ అనితా రాజేంద్రన్
ములుగు, సెప్టెంబర్ 22: 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటుహక్కు కల్పించాలని, ఇదివరకు ఉన్న ఓట్లను సవరించి సక్రమంగా ఉండేలా చూడాలని రాష్ట్ర ఎన్నికల రోల్ అబ్జర్‌వర్, బీసీవెల్‌ఫేర్ కమిషనర్ అనితారాజేంద్రన్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం ములుగు ఫారెస్ట్ గెస్ట్‌హౌజ్‌కు రాగా, ఆమెకు జిల్లా కలెక్టర్ కృష్ణ్భాస్కర్, గజ్వేల్ ఆర్డీఓ విజేందర్‌రెడ్డిలు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. అనంతరం గెస్ట్‌హౌస్‌లో కొద్దిసేపు కలెక్టర్‌తో సమావేశమైన అనితారాజేంద్రన్ జిల్లా పరిస్థితులపై కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. అలాగే జిల్లాలో ఓటర్ లిస్టు సవరణ వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. తర్వాత మండల కేంద్రమైన ములుగులో ఓటర్ల నమోదు కార్యక్రమం పూర్తి అయ్యిందా కాలేదా అనే వివరాలను ఆమె స్వయంగా గ్రామంలో పర్యటించి గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. అంతేగాకుండా బూత్ లెవల్ అధికారుల వద్ద ఉన్న సమాచారాన్ని ఆమె వాళ్ల నుండి రాబట్టారు. ఈ కార్యక్రమంలో ట్రేయినీ కలెక్టర్ అవిశ్యంత్ పండా, ములుగు తహసీల్దార్ శ్రీనివాస్, ఎన్నికల అధికారుల బృందం పాల్గొన్నారు.