మెదక్

రాబోయేది తెరాస ప్రభుత్వమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, సెప్టెంబర్ 22: ప్రతిపక్షాలు తలకిందుల ప్రచారం చేసినా మళ్లీ రాబోయేది తెరాస ప్రభుత్వమేనని జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిన్ స్పష్టం చేశారు. శనివారం ఎంపి బిబి పాటిల్, అందోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే పోటీ అభ్యర్థి క్రాంతికిరణ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన టేక్మాల్ ఎంపీపీ అంజమ్మ, మునిపల్లి మాజీ జెడ్పీటీసీ రాధాబాయి రాంచందర్‌రావుతో పాటు వారి అనుచరులు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాలను నిర్విర్యం చేసాయని, గ్రామాలకు వెళ్లేందుకు కనీసం సరైన రోడ్ల సౌకర్యం కూడా కల్పించలేక పోయారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాలుగేళ్లలో పట్టణాలు, గ్రామాలు, తాండాలను అన్ని విధాల అభివృద్ధి చేసిందన్నారు. మిషన్ భగీరథ కార్యక్రమం చరిత్ర పుటల్లో నిలిచిపోనుందని, మరి కొద్ది రోజుల్లో ఇంటింటికి స్వచ్చమైన తాగునీరు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలు హర్షిస్తున్నారని, పోటీలో ఉన్న అన్ని స్థానాల్లో భారీ మేజార్టీతో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. క్రాంతికిరణ్ మాట్లాడుతూ అందోల్ నియోజకవర్గం నుండి టీఆర్‌ఎస్‌లో చేరేందుకు మరికొంత మంది కాంగ్రెస్ నాయకులు సిద్ధంగా ఉన్నారని, కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ రాజనర్సింహాకు ఓటమి తప్పదన్నారు. సమావేశంలో టీఆర్‌ఎస్ నాయకులు పైతర సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.

పీఏ కుటుంబాన్ని పరామర్శించిన హోంమంత్రి
నంగునూరు, సెప్టెంబర్ 22: తన వద్ద పీఏగా పనిచేస్తున్న వ్యక్తి కుటుంబ సభ్యులను హోంమత్రి నాయిని నర్సింహారెడ్డి శనివారం పరామర్శించారు. రాజగోపాల్‌పేట గ్రామానికి చెందిన చేర్యాల బాలకిషన్ హోంమత్రి నర్సింహారెడ్డి వద్ద వర్సనల్ సెక్రటరిగా పని చేస్తున్నాడు. ఆనారోగ్యానికి గురైన బాలకిషన్ తల్లి రాజమ్మ ఇటీవలే మృతి చెందింది. శనివారం ఆమె కుమారులు బాలకిషన్, సత్యనారాయణ, జగన్నాథంతో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

సిద్దిపేట కాంగ్రెస్ టికెట్ కోసం 15 మంది దరఖాస్తులు
* ఏఏసీసీ కార్యదర్శికి అందచేసిన ఆశావహులు
సిద్దిపేట, సెప్టెంబర్ 22 : సిద్దిపేట నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోసం 15 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. నియోజక వర్గం నుండి టీకెట్ ఆశీస్తున్న 15 మంది అభ్యర్థులు గాంధీభవన్‌లో ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజుకు అందచేశారు. సిద్దిపేట నియోజక వర్గం ఇన్‌చార్జి, పీసీసీ సభ్యుడు తాడూరి శ్రీనివాస్‌గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రభాకర్‌వర్మ, పీసీసీ చేనేత విభాగం చైర్మన్ గూడూరి శ్రీనివాస్, పీసీసీ కార్యదర్శి గంప మహేందర్‌రావు, పీసీసీ ఎస్సీసెల్ కన్వీర్ బొమ్మల యాదగిరి, పీసీసీ సంయుక్త కార్యదర్శి దేవులపల్లి యాదగిరి, భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దరిపల్లి చంద్రం, డీసీసీ ప్రధాన కార్యదర్శి మార్క సతీష్‌గౌడ్, ఎన్‌ఎస్‌యూఐ జాతీయ కార్యదర్శి పూజల హరికృష్ణ, డీసీసీ ఉపాధ్యక్షుడు గొడుగు రఘు, మాజీ పట్టణ అధ్యక్షుడు సొప్పదండి చంద్రశేఖర్, భూపతిరెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి, మహిళ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ముద్దం లక్ష్మి, డీసీసీ మైనార్టీ సెల్ చైర్మన్ కలీమోద్దీన్‌లు దరఖాస్తులను ఏఐసీసీ కార్యదర్శి, పార్లమెంటరీ ఇన్‌చార్జి బోసురాజుకు అందచేశారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల స్కూృటినీ చేసి ముగ్గురు అభ్యర్థుల పేర్లను అధిష్టానానికి పంపించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు.