మెదక్

కన్నుల పండువగా శోభాయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, సెప్టెంబర్ 23: సిద్దిపేట జిల్లా కేంద్రంలో వినాయక నిమజ్జనం శోభయాత్ర ఆదివారం కన్నుల పండువగా నిర్వహిస్తున్నారు. సిద్దిపేట పట్టణంలో వినాయక నవరాత్రోత్సవాలను ముగించుకొని నిమజ్జనానికి భారీ ఊరేగింపుగా తరళివెళ్తున్నారు. జిల్లా కేంద్రంలో పలు ప్రాంతాల్లో యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ఆకర్షణీయమైన వినాయక విగ్రహాలను ప్రతిష్టించి తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. రాత్రి వేళల్లో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. పట్టణంలోని వినాయక విగ్రహలను కొన్ని శనివారం నిమజ్జనం నిర్వహించారు. రెండవ రోజు ఆదివారం పట్టణంలోని ప్రధాన విగ్రహాలను వినాయక నిమజ్జనానికి ప్రత్యేకంగా ముస్తబుచేశారు. వినాయక నిమజ్జనం పురస్కరించుకొని వినాయక విగ్రహాలను ట్రాక్టర్లను ప్రత్యేకంగా అలంకరించి, విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేక ముస్తాబుచేసిన వాహనాలను వినాయక విగ్రహాలను ఉంచి నిమజ్జనం పురస్కరించుకొని నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్వతిమాత ఫ్యామిలీ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక విగ్రహాల వద్ద తొమ్మిది రోజుల పాటు పూజల నిర్వహించిన లడ్డును వేలం పాటను నిర్వహించగా పట్టణానికి చెందిన గట్టు అమర్‌నాథ్ 46, 116 రూపాయలకు దక్కించుకున్నారు. వినాయక నిమజ్జనం సందర్భంగా పంజాబ్ నుండి ప్రత్యేకంగా బ్యాండ్ పార్టీలను రప్పించారు. పంజాబీ బాంగ్రా, బల్లె..బల్లె నృత్యాలు ప్రత్యేక ఆకర్షనంగా నిలిచాయి. వినాయక నిమజ్జనం పురస్కరించుకొని పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపు నిర్వహించిన వినాయక విగ్రహాల శోభాయాత్రలో మహిళలు కోలాటాలు, బతుకమ్మ ఆటలు, యువకుల నృత్యాలతో వీధులన్నీ సందడిగా మారాయి. డప్పు వాయిద్యాల మధ్య విద్యుత్ దీపాల అలంకరణల మద్య వినాయకుల శోభాయాత్ర పట్టణ ప్రజలన అందరిని ఆకట్టుకుంది. నిమజ్జనానికి తరలిస్తున్న క్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ప్రసాదాలు స్వీకరించారు. పట్టణంలోని లాల్‌కమాన్, మెయిన్‌రోడ్డు, మెదక్‌రోడ్డు, భారత్‌నగర్, గణేశ్‌నగర్, వెంకటేశ్వరాలయం మీదుగా కోమటిచెరువు వద్ద వినాయక విగ్రహాలను నిమజ్జనానికి తరలించారు. వినాయక నిమజ్జనం సందర్భంగా సిద్దిపేట కోమటిచెరువు వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కోమటిచెరువు రహాదారికి వెళ్లే రహదారులను మరమ్మతులు చేయించారు. కోమటిచెరువు ప్రాంగణమంత విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. నిమజ్జనం ప్రాంతాల్లో క్రేన్లు ఏర్పాట్లు చేయటంతో పాటు, ముందు జాగ్రత్త చర్యగా గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో కోమటిచెరువు వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
వినాయక నిమజ్జనం ఊరేగింపులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా సిద్దిపేట పోలీసు యంత్రాంగం గట్టిబందోబస్తు చర్యలు చేపట్టింది. సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ ఆధ్వర్యంలో బందోబస్తు చర్యలు చేపట్టారు. వినాయక విగ్రహాలకు జియో ట్యాగింగ్ ఏర్పాటు చేశారు. అడీషనల్ డీసీపీ నర్సింహరెడ్డి, ఏసీపీలు రామేశ్వర్, బాలాజీలు, సీఐలు నందీశ్వర్‌రెడ్డి, ఆంజనేయులు ఎప్పటికప్పుడు సమీక్షించారు.

ఔరంగాబాద్‌కూ ‘స్టే’
* మెదక్ బల్దియాలో విలీనంపై గ్రామస్థుల ససేమిరా
మెదక్ రూరల్, సెప్టెంబర్ 23: మెదక్ పురపాలక సంఘం పరిధి పెంచేందుకు రెండు గ్రామాలను విలీనం చేయగా అందుకు గ్రామస్థుల నుండి అసంతృప్తి వ్యక్తమైంది. కోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్నారు. మెదక్ మండలం అవుసులపల్లి ఇప్పటికే స్టే తీసుకురాగా తాజాగా హవేళీఘణాపూర్ మండలం ఔరంగాబాద్ గ్రామస్థులు సైతం స్టే తీసుకువచ్చారు. అవుసులపల్లి తాజా మాజీ సర్పంచ్ బాషవ్వ పోచయ్య స్టే తీసుకువచ్చిన విషయం తెల్సిందే. వారి దారిలో ఔరంగాబాద్ గ్రామస్థులు వెళ్లారు. తాజా మాజీ సర్పంచ్ బుడ్డ పద్మ, బీమరి శ్రీనివాస్‌లు కోర్టుకెళ్లి స్టే తీసుకువచ్చారు. ఈ సందర్భంగా గ్రామ నాయకులు బీమరి శ్రీనివాస్, భూపతిలు మాట్లాడుతూ మున్సిపాలిటీలో విలీనం వల్ల గ్రామంలో కూలీలకు ఉపాధి పనులు ఉండవన్నారు. అలాగే కొత్తగా ఇళ్లు కట్టుకునేవారికి ఇబ్బందులుంటాయని, పన్నుల భారం పెరుగుతుందని పేర్కొన్నారు. కలెక్టరేట్, ఎస్‌పి కార్యాలయాల నిర్మాణం కోసం గ్రామానికి చెందిన 80 ఎకరాల భూమి తీసుకున్నారని, ఎక్కువ వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తారని, మున్సిపాలిటీలో విలీనం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశ్యంతో కోర్టుకెళ్లి స్టే తెచ్చినట్లు తెలిపారు. ఈ మేరకు గ్రామస్థులు చావిడి వద్ద సంతోషం వ్యక్తంచేస్తు సంబరాలు జరుపుకున్నారు.

జోగిపేటలో దామోదర్ పూజలు
జోగిపేట, సెప్టెంబర్ 23: మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదివారం జోగిపేట పట్టణంలో ఉన్న వినాయక మండపాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలో ఉన్న పలు ప్రాంతాల్లోన్ని మంటపాలను సందర్శించి పూజలు నిర్వహించడం జరిగింది. మద్యరంగం వద్ద ఏర్పాటు చేసిన మంటపం వద్ద జరిగిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.