మెదక్

టీఆర్‌ఎస్‌లో అంతర్గత కుమ్ములాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* సమష్టిగా కృషిచేసి కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి
* పీసీసీ సభ్యుడు, సిద్దిపేట కాంగ్రెస్ ఇన్‌చార్జి శ్రీనివాస్‌గౌడ్
సిద్దిపేట, సెప్టెంబర్ 23 : టీఆర్‌ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ప్రారంభమైనాయని, సిద్దిపేట నుండి సీఎం కేసీఆర్ చేసేందుకు మంత్రి హరీష్‌రావుపై వత్తిడీ చేస్తున్నారని పీసీసీ సభ్యుడు, సిద్దిపేట కాంగ్రెస్ ఇన్‌చార్జి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో రాజన్న సిరిసిల్లా జోన్ మైనార్టీ కాంగ్రెస్ చైర్మన్ నియమించిన వహిద్‌ఖాన్ సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మంత్రి హరీష్‌రావు ఇబ్రహీంపూర్ సభలో ప్రజాభిమానం ఉన్నప్పుడు రాజకీయాల్లో విరమించుకుంటానని మాట్లాడిన విషయం గుర్తు చేశారు. భావోద్వేగంతో అలా మాట్లాడినట్లు మంత్రి హరీష్‌రావు సర్దిచెప్పినప్పనప్పటికీ టీఆర్‌ఎస్‌లో అంతర్గత పోరు మొదలైందని స్పష్టమవుతుందన్నారు. మంత్రి హరీష్‌రావుకే టీఆర్‌ఎస్‌లో స్థానం కరువైందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కేసీఆర్ ఒక్కడితో రాలేదని, కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని సబ్బంద వర్గాలు ఉద్యమంలో పాలుపంచుకోవటం వల్లనే సాధ్యమైందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రారంభమైనప్పడు, మొదటిసారి సిద్దిపట ఉప ఎన్నికలు జరిగినప్పుడు కేటీఆర్ అమెరికాలో ఉన్నాడన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలను నోటికొచ్చినంత విమర్శిస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ కుమారుడు కాబట్టే కేటీఆర్‌కు మంత్రి పదవి దక్కిందన్నారు. టీఆర్‌ఎస్ పార్టీలో మొదటి నుండి పనిచేస్తున్నావారికి సరైన ప్రాధాన్యత లేదన్నారు. సిద్దిపేట నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీకి రోజు,రోజుకు పుంజుకుంటుందున్నారు. కొత్తగా రాజన్న సిరిసిల్లా జోన్ మైనార్టీ కాంగ్రెస్ చైర్మన్ బాధ్యతలు చేపట్టిన వహిద్‌ఖాన్ ఐదు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషిచేయాలన్నారు. సిద్దిపేట జిల్లాలో మైనార్టీ సమస్యల పరిష్కారానికి ఇంటింటీకి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని చేపట్టి వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషిచేయాలన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్ మైనార్టీలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. బీజేపీ పార్టీకి తొత్తుగా టీఆర్‌ఎస్ పార్టీ పనిచేస్తుందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి సేవా చేసే పార్టీని ఎన్నుకోవాలని సూచించారు. సిద్దిపేట నియోజక వర్గంలో సమష్టిగా కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్లాజోన్ మైనార్టీ కాంగ్రెస్ చైర్మన్ వహిద్‌ఖాన్ మాట్లాడుతూ మైనార్టీల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషిచేస్తానన్నారు. జోన్ పరిధిలోని సిద్దిపేట, సిరిసిల్లా, కరీంనగర్, మెదక్, కామారెడ్డి జిల్లాలో మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించటంతో పాటు, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు తన శక్తివంచన లేకుండ కృషిచేస్తానన్నారు. మసీదుల్లో ప్రార్థనలు చేసే వౌలాన, వౌజంలకు 5వేలు రూపాయలు ఇస్తానని హామీనిచ్చిన ఇంతవరకు ఒక్క రూపాయి కేటాయించలేదన్నారు. ఐదు జిల్లాలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్శితులవుతున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రభాకర్‌వర్మ, పీసీసీ నేత గంప మహేందర్‌రావు, పూజల హరికృష్ణ, మార్క సతీష్, సొప్పదండి చంద్రశేఖర్, కలీమోద్దీన్, ముద్దం లక్ష్మిలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. అబద్దాలు చెప్పటంలో సీఎం కేసీఆర్‌ను మించిన వారు లేరని విమర్శించారు. కేసీఆర్‌కు హటావో..తెలంగాణకు బచావో అనే నినాదంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని ధీమాను వ్యక్తం చేశారు. ఆనంతరం రాజన్నసిరిసిల్లా మైనార్టీ సెల్ జోన్ చైర్మన్ వహిద్‌ఖాన్‌ను పూలమాల, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు తిరుపతిరెడ్డి, డీసీసీ మైనార్టీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అత్తుఇమామ్, పట్టణ అధ్యక్షుడు షాబోద్దీన్, మీసం కనకరాజు తదితరులు పాల్గొన్నారు.

ఖాళీ బిందెలతో మహిళల ధర్నా
చిన్నశంకరంపేట, సెప్టెంబర్ 23: ఉమ్మడి మండలంలోని శేరిపల్లి గ్రామంలో నేటికి తాగునీటి ఘోస తప్పడం లేదని నీరసిస్తూ ఆదివారం గ్రామపంచాయతీ ముందు మహిళలు ఖాళీ బిందెలతో ధర్నా చేశారు. గ్రామంలో మిషన్ భగీరథ పథకం పనులు పూర్తి చేయకపోవడంతో తాగునీరు సరఫరా కావడం లేదన్నారు. రక్షిత తాగునీటి పథకాల బోరుబావుల్లో నీళ్లు లేక మోటర్లు మరమత్తుకు నోచుకోక సింగిల్‌ఫేజ్ మోటర్లు పనిచేయకపోవడం తదితర సమస్యలు త్రాగునీటి సమస్యకు తీవ్రరూపం దాల్చిందని గ్రామస్థులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీటి సమస్యను తీర్చాలని వారు డిమాండ్ చేశారు.