మెదక్

భూ సమస్యను పరిష్కరించకుంటే ఎన్నికలు బహిష్కరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదేవ్‌పూర్, సెప్టెంబర్ 23: తమ గ్రామంలోని భూ సమస్యలు పరిష్కరించకుండా ఏ రాజకీయ పార్టీల నేతలు తమ గ్రామంలోకి అడుగుపెట్టోందంటు, ఎన్నికల ముందు తమ సమస్యలను పరిష్కరించకుంటే ఎన్నికలను బహిష్కరిస్తామని గ్రామస్థులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. భూ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టు తిరిగిన అధికారులు కనికరించడం లేదంటూ గ్రామస్థులు పార్టీలకు ఆతీతంగా ఆదివారం ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఎన్నికల బహిష్కరణకు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ధ ఏకంగా ప్రతిజ్ఞ చేసి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. పూర్తి వివరాల్లోకి వెళ్లితే మండల పరిధిలోని నూతన గ్రామపంచాయతీగా పురుడు పోసుకున్న కొత్తపేట గ్రామస్థులు కష్టాలు వర్ణాణతీతం. గ్రామంలో వెయ్యి పైగా జనాభా ఉండగా, 450 మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఈ గ్రామంలో ప్రధాన సమస్య భూ సంబంధమైనది కాగా ఆ సమస్య పరిష్కారం కోసం అధికారులు చొరవ చూపడం లేదని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో 700 ఎకరాల సాగు భూమిని గ్రామ రైతులు ఇతరుల నుండి గత 50 సంవత్సరాల క్రితం కొనుగోళ్లు చేసినట్లు తెలిపారు. అయితే ఆ భూమిని ప్రభుత్వ భూమిగా రెవెన్యూ అధికారులు భూ రికార్డులలో నమోదు చేయడంతో సంబంధిత రైతులకు ఆ భూమిపై ఎలాంటి హక్కులు లేకుండా పోతున్నాయని ఆవేదన చెందుతున్నారు. అంతే గాకుండా తాము కొనుగోలు చేసిన భూములు ప్రభుత్వ భూమిగా రికార్డులో వస్తున్నందున తమకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు అందడం లేదంటు రైతులు విచారం వ్యక్తం చేస్తుండగా, ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు, బీమా సౌకర్యాలను పొందలేకపోతున్నామని తెలిపారు. ఈ విషయమై గ్రామస్థులంతా లో ల కలెక్టర్ వెంకట్రాంరెడ్డి, గడా హన్మంతరావుల దృష్టికి తీసుకువెళ్లినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టుతిరిగిన తమ సమస్యను పట్టించుకునే అధికారులు లేనందున తాము ప్రభుత్వ తీరుపై విసుగు చెంది ఎన్నికల బహిష్కరణకు గ్రామస్థులమంతా ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు వారు తెలిపారు. ఇప్పటికైన అధికారులు చొరవ చూపక పోతే సీఎం ఫాంహౌస్ ముట్టడికి కూడా వెనుకాడేది లెదని గ్రామ రైతులు తెలిపారు. కాగా సీఎం ప్రాతి నిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజక వర్గంలో ఇంకా ఈలాంటి సమస్యలు ఉంటే రాష్ట్రంలో ఎలా ఉందని ప్రతిపక్షాలు విమర్శనా అస్త్రాలు గుప్పిస్తున్నాయి.

కాంగ్రెస్‌ను గెలిపిస్తే 2లక్షల రుణమాఫీ
* కాంగ్రెస్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ప్రతాప్‌రెడ్డి
తూప్రాన్, సెప్టెంబర్ 23: కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే 2లక్షల రుణమాఫీ, రుణమాఫీ చేసి మళ్లీ ఇస్తామని ఇందిరమ్మ ఇళ్లకు 5లక్షల రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. మనోహరాబాద్ మండలంలోని కూచారం, కొండాపూర్ గ్రామాలలో గడపగడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. విద్యార్థులకు ఫీజ్ రీయంబర్స్‌మెంట్, ఉచిత గ్యాస్‌సిలిండర్‌లు ఇస్తామన్నారు. గత ఎన్నికలలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు మూడెకరాల భూమి, దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తానని, వ్యవసాయానికి సాగునీరు ఇస్తానని హామీలు ఇచ్చారని నాలుగేండ్లలో ఏ ఒక్కటి నెరవేర్చలేదని విమర్శించారు. హామీలు నెరవేర్చుకుంటే ఓట్లడగనని ఎన్నికలలో చెప్పారని మాయమాటలతో మళ్లీ ఎన్నికలకు వస్తే గ్రామాలకు రానివ్వవద్దని కోరారు. గ్రామంలో ఒక డబుల్‌బెడ్‌రూం కూడా ఇవ్వలేదని, 20 రూపాయల విలువ చేసే రైతు పాస్‌బుక్కుకు 160 రూపాయలు ఇచ్చారని ఇలాగే అన్నిటిలో కమిషన్‌లు దండుకున్నారన్నారు. మీకేగానీ, మీ కుటుంబానికి గానీ, మీ గ్రామానికి ఏ సమస్య వచ్చినా గెలిపించిన ముఖ్యమంత్రి ఎవరితోనూ మాట్లాడడని ఇప్పటికీ మీకు అందుబాటులో ఉంటానని చెప్పారు. మీ సమస్యలు పట్టించుకోని వ్యక్తికి ఓటేస్తే ఏమీ లాభం ఉండదని అన్నారు. కూచారం గ్రామంలో 300ల మంది, కొండాపూర్ గ్రామంలో 100 మంది టీఆర్‌ఎస్ నుండి కాంగ్రెస్‌లోకి వచ్చిన వారికి కండువా కప్పి ఆహ్వానం పలికారు.

గంగమ్మ ఒడిలోకి గణపయ్య
* ఘనంగా గణనాథుల శోభాయాత్ర
* మహబూబ్‌సాగర్ చెరువులో నిమజ్జనం
సంగారెడ్డి టౌన్, సెప్టెంబర్ 23: పదకొండు రోజుల పాటు విశేష పూజలందుకున్న గణనాధులు ఆదివారం సాయంత్రం గంగమ్మ ఒడిలోకి చేరుకున్నారు. గణపతి బొప్పా మోరియా.. జై గణేష్ మహరాజ్‌కీ జై అంటూ ప్రజలు బొజ్జ గణపయ్యకు భక్తిశ్రద్ధలతో వీడ్కోలు పలికారు. భక్తుల ఆనందోత్సాహాలు, భజనలు, సాంస్కృతిక నృత్యాల మధ్య శోభాయాత్ర ఘనంగా సాగింది. జిల్లాకేంద్రమైన సంగారెడ్డితో పాటు చుట్టు ప్రక్కల గ్రామాల్లో ప్రతిష్టించిన గణనాధులను నిమజ్జనం చేశారు. ఉదయం నుండి మండపాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం ఆయా ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో వాహనాలను విద్యుత్ దీపాలు, రంగు రంగుల పూలతో అలకరించి విఘ్నేశ్వరుడితో ఊరేగింపుగా వెళ్లి నిమజ్జనం చేశారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.