మెదక్

రైతు సంక్షేమాన్ని విస్మరించిన సర్కార్ గజ్వేల్‌లో 10,893 మంది రైతులను మోసం చేసిన కేసీఆర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, సెప్టెంబర్ 24: రైతు రుణమాఫీని వర్తింపజేస్తామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ తన సొంత నియోజకవర్గంలోనే 10వేల 893 మంది రైతులను మోసగించగా, భూముల జప్తు కోసం బ్యాంకర్లు నోటీసులు ఇవ్వడం సిగ్గుచేటని రాష్ట్ర కాంగ్రెస్ అధికారప్రతినిధి వంటేరు ప్రతాప్‌రెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం గజ్వేల్‌లోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంకు వద్ద మండల పరిధిలోని ఆయా గ్రామాల రైతులు రుణమాఫీ అమలు కోసం ఆందోళనకు దిగగా, వారు ధర్నాకు సంఘీభావం ప్రకటించి ఆయన మాట్లాడారు. ఇచ్చిన హామీలను విస్మరించడం కేసీఆర్‌కు పరిపాటేనని, సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ మంత్రులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న దృష్ట్యా రాష్ట్రంలో గవర్నర్ పాలనకు చేయాలని డిమాండ్ చేశారు. రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటున్నట్లు టీఆర్‌ఎస్ పేర్కొంటుండగా, బతికి ఉన్నప్పుడు ఆదుకోని వారు చస్తే మాత్రం రూ. 5లక్షలు ఇస్తామని అంటుండడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం కోసం అమలుకు సాధ్యం కాని హామీలు గుప్పించిన కేసీఆర్ సకలజనులను మోసగించగా, అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదని ఆరోపించారు. అయితే రైతులకు వారం రోజుల్లో రుణమాఫీ అవుతున్నట్లు స్పష్టమైన పత్రాలు ఇవ్వని పక్షంలో 10వేల మంది రైతులతో ఆందోళనకు దిగుతామని హెచ్చరించగా, రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితుల దృష్ట్యా కరవు మండలాలను ప్రకటించి అన్ని రకాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నేతలు నర్సింహాచారి, గాలెంక నర్సింలు, బొల్లారం ఎల్లయ్య, విరాసత్‌అలి, మతీన్, రఘుపతిరెడ్డి, కైలాస మహిపాల్, శ్రీనివాస్‌గుప్త, మోచె ప్రభాకర్, సత్తిరెడ్డి, హైమద్ తదితరులు పాల్గొన్నారు.