మెదక్

ఏడుపాయల్లో ఘనంగా అమ్మవారి పల్లకిసేవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాపన్నపేట, సెప్టెంబర్ 24: పవిత్ర పౌర్ణమి సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గామాత క్షేత్రంలో సోమవారం సాయంత్రం దుర్గామాత అమ్మవారి పల్లకి సేవ అంగరంగ వైభవంగా జరిగింది. అమ్మవారి గర్భాలయంలో వనదుర్గామాతకు, ఉత్సవ మూర్తి దుర్గామాతకు ఏడుపాయల ఆలయ కమిటీ చైర్మన్ పి.విష్ణువర్దన్‌రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు నర్సింహాచారి, ఆర్.శంకర్‌శర్మ, పార్థివశర్మ తదితర అర్చకుల ఆధ్వర్యంలో కుంకుమార్చన విశేషాలంకరణ పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తి దుర్గామాత అమ్మవారిని అత్యంత సుందరంగా పట్టు వస్త్రంలో అలంకరించి పల్లకిలో ప్రతిష్టించారు. మొదటగా పల్లకి సేవను ఏడుపాయల ఆయల చైర్మన్ విష్ణువర్దన్‌రెడ్డి లాంచనంగా ప్రారంభించారు. పల్లకిలో వనదుర్గామాత అమ్మవారిని ప్రతిష్టించి పల్లకి సేవలో అమ్మవారిని ఏడుపాయల్లోని మాడ వీధుల్లో భక్తుల మధ్య ఉరేగింపు తీశారు. శోభయాత్ర ఉరేగింపు అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు పోటి పడి భక్తిశ్రద్దలతో అమ్మవారిని దర్శించుకొని పల్లకిని మోయడానికి పోటి పడ్డారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటి చైర్మన్ విష్ణువర్దన్‌రెడ్డి, ఆలయ ఈఓ పి.మోహన్‌రెడ్డి, ధర్మకర్తలు దుర్గయ్య, ఎం.నాగప్ప, పి.కిషన్, ఎం.గౌరిశంకర్, డి.శ్రీ్ధర్, జ్యోతి అంజిరెడ్డి, జి.చంద్రయ్య, కిష్టయ్య, సంగప్ప, ప్రభుగౌడ్, డి.నారాయణ, ఎం.నాగయ్య, శ్రీనివాస్‌రెడ్డితో పాటు ఆలయ సిబ్బంది జెన్న రవికుమార్, సిద్దిపేట శ్రీనివాస్, మోహన్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, ప్రతాప్‌రెడ్డి, సూర్య శ్రీనివాస్‌తో పాటు భక్తులు పాల్గొన్నారు.