మెదక్

కలెక్టరేట్ ముందు సీఐటీయూ ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, సెప్టెంబర్ 25: కిర్బి పరిశ్రమలో గుర్తింపుయూనియన్ ఎన్నికలను వెంటనే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కార్మిక శాఖ అధికారికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి కె.రాజయ్య మాట్లాడుతూ పటాన్‌చెరు మండలం పాశమైలారం ప్రాంతంలోని కిర్బి పరిశ్రమలో గుర్తింపు యూనియన్ కాలపరిమితి ముగిసిందని, ఎన్నికల ప్రక్రియ నిర్వహించేందుకు డీసీఎల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కార్మిక సమస్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నా పట్టించుకోకుండా ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో అధికారి పార్టీ యూనియన్ ఎన్నికలు నిర్వహించకుండ డీసీఎల్‌పై ఒత్తిడి తెస్తుందన్నారు. కార్మికుల సమస్యలు దృష్టిలో పెట్టుకొని వెంటనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు సాయిలు, కార్మికులు రాజు, శ్రీనివాస్, కృష్ణరావు, రవి, ప్రవీన్, రవీందర్, శ్యామ్, రఫి, విఠల్, శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.

సంగారెడ్డిలో భారీ వర్షం
* నిలిచిపోయిన విద్యుత్ సరఫరా
సంగారెడ్డి టౌన్, సెప్టెంబర్ 25: జిల్లాకేంద్రమైన సంగారెడ్డి పట్టణంలో మంగళవారం సాయంత్రం అరగంట పాటు భారీ వర్షం కురిసింది. దీంతో నాలుగు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పట్టణం అందాకారమైంది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడం పట్టణ ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కురిసిన వర్షానికి రోడ్లన్ని జలమయం కావడంతో పాటు మురికి కాల్వలు ఏరులై పారాయి.