మెదక్

కారు దిగి.. కాషాయం కప్పుకున్న నేతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొండాపూర్, అక్టోబర్ 14: కేసీఆర్ కుటుంబ పాలనతో విరక్తి చెందిన మాజీ ఎంపీపీలు, ఎంటీసీలు, మాజీ సర్పంచ్‌లు, వారి అనుచరులు ఆదివారం బీజేపీ తీర్థం తీసుకున్నారు. కేంద్ర మంత్రి సదానందగౌడ సమక్షంలో మాజీ ఎంపీపీ రాజేశ్వర్‌రావుదేశ్‌పాండే ఆధ్వర్యంలో మాజీ ఎంపీపీలు మోహన్‌రెడ్డి, యాదయ్య, ఎంపీటీసీ రమణి నరేష్, మాజీ ఎంపీటీసీలు రాజు, మల్లారెడ్డి, మాజీ సర్పంచ్‌లు రాములు నాయక్, శ్రీనివాస్, మాణయ్యలు బీజేపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుండి 18యేళ్ల పాటు సేవలందించినప్పటికీ తమకు సరైన గుర్తింపు లేదన్నారు. వార్డు సభ్యులుగా గెలుపొందని నాయకులకు ఉన్న విలువ ప్రజలతో ఎన్నుకోబడ్డ తమకు టీఆర్‌ఎస్ పార్టీలో సముచిత స్థానం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికంగా సమస్యలపై ఎన్నిసార్లు విన్నవించినా పట్టింపు లేదని, ముఖ్యంగా నీరు, నిరుద్యోగ సమస్యలతో మండల ప్రజలు, యువకులు నిరుత్సాహంతో ఉన్నారన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, సంగారెడ్డి నియోజకవర్గంలో బీజేపీ జెండాను ఎగరవేస్తామని ధీమావ్యక్తం చేశారు.

భక్తిపారవశ్యంలో వర్గల్ విద్యాధరి క్షేత్రం
* మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు
గజ్వేల్, అక్టోబర్ 14: వర్గల్ విద్యాధరి క్షేత్రంలో శరన్నవరాత్ర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం విద్యాధరి అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ వ్యవస్థాపక చైర్మెన్ యాయవరం చంద్రశేఖరశర్మ నేతృత్వంలో చతుషష్ట్యు పచారపూజలు, సప్తశతి పారాయణం, మహాభి షేకము, మూలమంత్ర హవనము, చంఢీహోమము తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. విద్యాధరి, శనైశ్చర, లక్ష్మిగణపతి, స్వయంభు శంభులింగేశ్వర క్షేత్రాలు భక్తులతో కిటకిట లాడగా, ఆద్యాత్మిక వాతావరణం స్పురింపజేసింది. ముఖ్యంగా ఆలయం వద్ద నిర్వహించిన సంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకోగా, ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులకు ఆలయ నిర్వాహకులు తీర్థ ప్రసాదాలతో పాటు మహా ప్రసాదం అందజేశారు. కాగా తమ చిన్నారులకు భక్తులు అక్షరస్వీకారాలు చేయించుకోగా, ఈ కార్యక్రమాల్లో ఆలయ నిర్వాహకులు పొద్దుటూరి నర్సింహరావు, దాచెపల్లి వెంకటకృష్ణ, బొమ్మిడాల సత్యనారాయణ, గంగా శ్రీనివాస్ గుప్త, నూకా బిక్షపతి గుప్త, ఇర్రి మల్లారెడ్డి, గంగిషెట్టి సుదాకర్, అత్తెల్లి బాపిరాజు, శ్రీరాంరంగయ్య, ఎన్‌బీ ప్రభాకర్‌గుప్త, దోసపాటి లక్ష్మణ్‌రావు, వెంకట్‌రాంరెడ్డి, టేకులపల్లి బాల్‌రెడ్డిలు పాల్గొన్నారు.