మెదక్

పోలీసు అమరులను ఎల్లవేళలా స్మరించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, అక్టోబర్ 21 : పోలీసు వ్యవస్థ భారతదేశంలో కీలక వ్యవస్థ అని..ఎందరో త్యాగఫలం వలన మనమంత ప్రశాంతమైన జీవితం గడుపుతున్నట్లు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కృష్ణ్భాస్కర్ అన్నారు. ఆదివారం పోలీస్ సంస్మరణ దినోత్సవం పురస్కరించుకొని సీపీ జోయల్ డేవిస్‌తో కలసి కలెక్టర్ కృష్ణ్భాస్కర్ పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. పోలీసు అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చాలు వేసి శ్రద్ధంజలి ఘటించి, రెండు నిమిషాలు వౌనం పాటించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ కృష్ణ్భాస్కర్ మాట్లాడుతూ ఈసంవత్సరంలో భారతదేశంలో 414 మంది పోలీసులు అమరులైనారని, వారి త్యాగాలను ఎల్లవేళలా గుర్తుంచుకుంటామన్నారు. జిల్లాలోని అమర పోలీసు కుటుంబాలను ఏళ్ల వేళల ఆదుకుంటామన్నారు. ప్రభుత్వ పరంగా రావాల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తామని, వారికి ఏళ్ల వేళల అందుబాటులో ఉంటామన్నారు. పోలీసు కమిషనర్ జోయల్ డేవిస్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులు స్మరిస్తు ప్రతి ఏడాది అక్టోబర్ 21న పోలీసు సంస్మరణ దినోత్సవం పాటిస్తున్నట్లు తెలిపారు. 1959లో ఎస్‌ఐ కరీంసింగ్, 20జవాన్లు లడక్ ప్రాంతంలో హాట్ స్ప్రింగ్ విధులు నిర్వహిస్తుండగా చైనా ఆర్మీ వారిపై దాడి చేసి 10మందిని హతమార్చారని, ఆరోజునే పోలీసు సంస్మరణ దినోత్సవంగా పాటిస్తున్నట్లుగా పేర్కొన్నారు. అమరులైన పోలీసు జీవితాలను ఆదర్శంగా, మార్గదర్శకంగా తీసుకొని ప్రజా సేవకు, ప్రజల, ధన, మాన, ప్రాణాల రక్షణకు పునరంకితం కావాలన్నారు. ఉగ్రవాదం, తీవ్రవాదం, మతతత్వం వంటి విచ్చిన్నకర శక్తులతో నేరాలు, ఘోరాలకు పాల్పడే ఆసాంఘీక శక్తులతో అనుక్షణం పోరాడవల్సిన రావటంతో పోలీసు ఉద్యోగం కత్తిమీద సాములాగా ఏంతో ప్రమాదకరంగా పరిణమించిందన్నారు. ఈ దశలో త్యాగాలకు భయపడకుండ వెనుకడుగు వేయకుండ రెట్టించిన సమరోత్సహంతో ఆ సాంఘీక శక్తులతో పోరాడి విజయాన్ని సాధించాలన్నారు. సెలవులు, పండుగ దినాలు, అధిక గంటలు పనిచేయాల్సి రావటం, ఆరోగ్యాన్ని సైతం నిర్లక్ష్యం చేసి, అవిశ్రాంతంగా పనిచేయటం కూడా త్యాగమే అన్నారు. పోలీసులు తప్పులు ప్రచారం అవుతున్నట్లుగా, వారి త్యాగాలు ఆశీంచిన స్థాయిలో గుర్తింపుకు నోచుకోవటం లేదన్నారు. త్యాగాలు చేసిన వారిని గుర్తించుకోవాల్సిన అవసరం ఏంతైన ఉందన్నారు. ఈయేడాది దేశంలో విధి నిర్వహణలో 414 మంది వీరమరణం పొందినట్లు తెలిపారు. పోలీసు అమరుల కుటుంబాల సంక్షేమం, ఆర్థిక పరమైన ప్రయోజనాలను సర్వస్యం లభింప చేయటం, వారి కుటుంబాలకు మానసిక బలాన్ని అందించటమే పోలీసు అమరులకు అందించే నిజమైన నివాళి అన్నారు. పోలీసులు చేస్తున్న త్యాగాలను సమాజం గుర్తించుకునే విధంగా విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.
పోలీసు అమరవీరుల కుటుంబాలను పరామర్శించిన కలెక్టర్, సీపీ
సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో పోలీసు అమరుల కుటుంబాలను కలెక్టర్ కృష్ణ్భాస్కర్, సీపీ జోయల్ డేవిస్‌లు పేరు, పేరునా పరామర్శించారు. ఈకార్యక్రమంలో జేసీ పద్మాకర్, అడీషనల్ డీసీపీలు ప్రభాకర్, నర్సింహరెడ్డి, బాబురావు, ఏసీపీలు రామేశ్వర్, మహేందర్, బాలాజీ, సీఐలు, ఎస్‌ఐలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

కాంగ్రెస్ చేసిన అభివృద్ధి కనబడకపోతే..
కంటి వెలుగుకి వెళ్లండి
* మాజీ మంత్రి సునీతారెడ్డి
హత్నూర, అక్టోబర్ 21: కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్ధి కనబడకపోతే కంటి వెలుగు కార్యక్రమానికి హాజరై చికిత్స చేయించుకోవాలని మాజీ మంత్రి, డీసీసీ అధ్యక్షురాలు సునితారెడ్డి అన్నారు. ఆదివారం హత్నూర మండలంలోని రొయ్యపల్లి, ఆక్వంచగూడ, షేర్ఖాన్‌పల్లి, కొడపాక, నాగారం, వడ్డెపల్లి, యెల్లమ్మగూడెం గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ జెండాలను ఎగురవేయడంతో పాటు ఇంటింటి ప్రచారం నిర్వహించగా సునీతారెడ్డి పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండలంలో చేసిన అభివృద్ధి పనులను చెప్పడంతో పాటు వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే అమలు చేసే పథకాలను ప్రజలకు వివరించారు. టీఆర్‌ఎస్ పార్టీ మాటలతో నాలుగేళ్ల కాలాన్ని వృథా చేసిందని కాంగ్రెస్ అలా కాకుండా చెప్పిన మాటలను నేరవేర్చుతుందని వివరించారు. కలిసిన ప్రతి మహిళను, స్థానికులను పలుకరించుకుంటూ ఎన్నికల మెనిఫేస్టోను వివరిస్తూ ఇంటింటి ప్రచారంను నిర్వహించారు. అంతకు ముందు ఆయా గ్రామాలలో యువజన కాంగ్రెస్ నాయకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నర్సింహరెడ్డి, ఎస్‌టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మాణయ్య, నాయకులు కొన్యాల వెంకటేశం, ఎంపీటీసీ ఆగమయ్య, పార్టీ యువజన అధ్యక్షులు విప్లవ్‌ఖన్నా, పోచయ్య, హాకీం, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.