మెదక్

రైతుబజారులో మంత్రి హరీష్‌రావు తనిఖీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, అక్టోబర్ 21: గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని పాతూరు రాజీవ్ రహదారిపై గల రైతుబజారును ఆదివారం రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మహిళా రైతులతో మాట్లాడడంతోపాటు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అలాగే మహిళా రైతుల బాగోగులు ఆయన అడిగి తెలుసుకోగా, వ్యాపారం ఎలా సాగుతుందని ఆరా తీశారు. అదే సమయంలో కూరగాయల మార్కెట్ యార్డులో కూరగాయలు కొనుగోలు చేయడానికి వచ్చిన మహిళలతో మంత్రి హరీష్‌రావు ముచ్చటిస్తూ తాజా కూరగాయలు అందుబాటులో ఉంటున్నాయా అని ఆరా తీశారు. మహిళా రైతులకు టీఆర్‌ఎస్ పెద్దపీట వేస్తోందని, జంట నగరాలకు పాతూరు మార్కెట్ సమీపంలో ఉన్నందున ఈ ప్రాంతం విజిటెబుల్‌హబ్‌గా మారుతోందని స్పష్టం చేశారు. ఆయన వెంట టీఆర్‌ఎస్‌వీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మాదాసు శ్రీనివాస్, మండల టీఆర్‌ఎస్ అధ్యక్షులు బెండ మదు, మండల కో-ఆప్షన్ సభ్యులు అహ్మద్, టీఆర్‌ఎస్‌వీ జిల్లా కో-అర్డినేటర్ పాండుగౌడ్, నియోజకవర్గ కో-అర్డినేటర్ కుమార్ యాదవ్, టీఆర్‌ఎస్‌కేవీ అధ్యక్షులు అంతని ఆసా తదితరులు పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్ పార్టీకి జడ్పీటీసీ రాజీనామా
నర్సాపూర్,అక్టోబర్ 21: స్థానిక ఎమ్మెల్యే మదన్‌రెడ్డి వైఖరిని నిరసిస్తూ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు హత్నూర జెడ్పీటీసీ పల్లే జయశ్రీ తెలిపారు. ఆదివారంనాడు నర్సాపూర్‌లో విలేఖరులతో మాట్లాడుతూ నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి అవలంభిస్తున్న వైఖరిని నిరసిస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీపై అభిమానం ఉన్నప్పటికి రాజీనామా చేయకతప్పడం లేదని ఆవేధన వ్యక్తం చేశారు. తన స్వంత గ్రామంలో సైతం నాకు తెలియకుండానే అభివృద్ధి పనులు చేపట్టాడని అన్నారు. ఇలాంటి పరిణామాలపై మంత్రి హరీష్‌రావు దృష్టికి తీసుకువెళ్లినప్పటికి ఎమ్మెల్యేలో ఏలాంటి మార్పురాలేదని అన్నారు. జడ్పీటీసీ సభ్యురాలినైనప్పటికీ తగిన ప్రధాన్యత లభించడం లేదని అన్నారు. పార్టీపై గౌరవం ఉన్నప్పటికి రాజీనామానే శరణ్యమనిపించిందని అన్నారు. తనకు ప్రాదాన్యత లేనిచోట ఉండటం ఇష్టం లేక రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.