మెదక్

టీఆర్‌ఎస్‌కు రాష్ట్రాన్ని పాలించే దమ్ము లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొండాపూర్, అక్టోబర్ 21: ఎన్నో ఆశలు, ఎంతో నమ్మకంతో రాష్ట్ర ప్రజలు టీఆర్‌ఎస్ చేతికి పాలనా పగ్గాలు అప్పగిస్తే చేతకాక వదులుకుని ముందస్తు ఎన్నికలకు సిద్ధమైందని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ జెండా పండుగ కార్యక్రమంలో భాగంగా ఆదివారం మండలంలోని తొగర్‌పల్లి, మారేపల్లి, అనంతసాగర్ గ్రామాల్లో జెండావిష్కరణ చేశారు. వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు, ముస్లిం మైనార్టీలు మొత్తంగా 500 మంది జగ్గారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని పాలించడానికి టీఆర్‌ఎస్‌కు మరో తొమ్మిది మాసాల సమయం ఉండగానే తాము చేపట్టిన పథకాలకు ప్రజలు విశ్వసించి మళ్లీ అధికారం అప్పగిస్తారనే నమ్మకంతో టీఆర్‌ఎస్ ముందస్తు ఎన్నికలకు సిద్ధమైందని విమర్శించారు. గడచిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతకాక ముందస్తు ఎన్నికలకు దిగారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వృద్దులు, వితంతువులకు రెండు వేల రూపాయల పింఛన్, వికలాంగులకు మూడు వేలు చెల్లిస్తుందన్నారు. రైతులకు ఏక కాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తుందని అన్నారు. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల చొప్పున భృతి కల్పిస్తుందన్నారు. నిధులు, నీళ్లు, నియామకాల కోసం కొనసాగిన తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చెప్పినట్లుగా తన పాలనా సాగించలేకపోయారని మండిపడ్డారు. లక్ష ఉద్యోగాలిస్తామని చెప్పారని ఎక్కడిచ్చారో వెల్లడించారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వకపోగా కాంగ్రెస్ పార్టీ పంచిన ఇళ్ల పట్టాలను లాక్కున్న ఘనత టీఆర్‌ఎస్ పార్టీదని ఆరోపించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమన్నారు. ఎదురించి ప్రశ్నించే వారిని భయబ్రాంతులకు గురి చేయడమే టీఆర్‌ఎస్ లక్ష్యంగా పెట్టుకున్న విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు. భయబ్రాంతులు సృష్టించిన నాయకులంతా కాలగర్భంలో కలిసిపోయిన విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలనకు దేశ ప్రజలు విసిగెత్తిపోయారని, ప్రధానిగా రాహుల్ గాంధీని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ అధికారం చేపట్టడం ఖాయమని, కుటుంబ పాలనకు అంతమొందించేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు నగేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రామక్రిష్ణారెడ్డి, నాయకులు వై.ప్రభు, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

మాణిక్‌రావుకే జహీరాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థిత్వం
* అంచలంచెలుగా ఎదిగిన నేత
జహీరాబాద్, అక్టోబర్ 21: జహీరాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా కొనింటి మాణిక్‌రావు పేరును సీఎం.కేసీఆర్ ఖరారుచేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆనందోత్సవాల్లో మునిగిపోయారు. నిరాడంబరుడు, ప్రజారంజకుడైన మాణిక్‌రావు ఆర్టీఏగా పదవి విరమణచేసి గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి పోటీచేసి కేవలం 842 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యాడు. అప్పటినుంచి పార్టీ ఇన్‌చార్జిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తూ వివాదరహితుడిగా అందరి మన్ననలు అందుకున్న స్థానికుడైన ఆయనకే విజయావకాశాలు అధికంగా ఉన్నాయని పలుసర్వేలు, పార్టీ నాయకుల తమ అభిప్రాయాలను అధిష్టానం ముందు వెల్లడించడంతో తిరిగి ఆయననే బరిలో నిలపాలని అధిష్ఠానం నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం నియోజకవర్గం నాయకులతో మంత్రి హరీష్‌రావు, సీఎం.కేసీఆర్‌లు ప్రత్యేకంగా సమావేశమై చర్చించిన అనంతరం ఆయన పేరునే అధికారికంగా ప్రకటించారు.