మెదక్

సిద్దిపేట క్రీడలకు నెలవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, అక్టోబర్ 21 : సిద్దిపేట క్రీడలకు నెలవని, క్రీడ రంగంలో సిద్దిపేటను అగ్రగ్రామిగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తానని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సిటిజన్స్‌క్లబ్‌లో నూతనంగా నిర్మించిన సింథటిక్ కోర్టు ప్రారంభోత్సవంలో పాల్గొని మాట్లాడారు. సిద్దిపేటలో సింథటిక్ కోర్టు ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. సిద్దిపేటలో క్రీడ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తానన్నారు. 16 క్రీడలకు సంబంధించి క్లబ్‌ను ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సిద్దిపేట క్రికెట్ స్టేడియంలో డే అండ్ నైట్ మ్యాచ్‌లు ఆడే వీలుగా సిద్దిపేట క్రీడకారులకు అందుబాటులో తెచ్చినట్లు తెలిపారు. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్విమ్మింగ్ పూల్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సిద్దిపేట క్రీడకారులు, అభిమానులు ఉన్న ప్రాంతం కాబట్టి ఆ దిశగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. సిటిజన్స్ క్లబ్ ఏంతో మంది ప్రముఖుల వేదిక ఈలాంటి వేదికపై టెన్నిస్ కోర్టు ఏర్పాటు చేయటం సంతోషకరమన్నారు. హైదరాబాద్ తరహాలో సిద్దిపేట క్రీడల్లో ముందుకు పోతుందన్నారు. అందరి సహకారంతో సిద్దిపేట అభివృద్ధిలో సాధించుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూక్‌హుస్సేన్, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సిటిజన్స్ క్లబ్ అధ్యక్షుడు కాచం బాలకిషన్, ఐటిఎ సెక్రటరీ అశోక్, ఆసీఫ్ ఎక్బాల్, గుంటూర్ రాందాస్, సొప్పదండి సత్తు, మురళి, యేల్లారెడ్డి, ప్రకాశ్, నారాయణ, లక్ష్మణ్, వినోద్,మోహన్‌లాల్, ఆకుల కిష్టయ్య, బాలకిషన్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

పోలీసు అమరవీరుల సేవలు చిరస్మరణీయం
* ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి
సంగారెడ్డి, అక్టోబర్ 21: శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా సంఘ విద్రోహ శక్తుల చేతుల్లో అమరులైన పోలీసులు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి కొనియాడారు. పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం పోలీస్ ఫరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమరు స్థూపానికి పూలమాలలు, పుష్పగుచ్చాలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 2017 సెప్టెంబర్ 1వ తేదీ నుండి 2018 ఆగస్టు 31వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా 414 మంది పోలీసు అధికారులు వివిధ సంఘటనల్లో ఉగ్రవాదులు, తీవ్రవాదులతో పోరాడి ఆసువులు బాసారని పేర్కొన్నారు. అమరుల ఆత్మ బలిదానాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్క పోలీసు దేశ రక్షణ కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. సంగారెడ్డి డీఎస్పీ శ్రీ్ధర్‌రెడ్డి దేశ వ్యాప్తంగా అమరులైన పోలీసు అధికారుల పేర్లను చదివి వినిపించారు. అమర పోలీసుల కుటుంబ సభ్యులకు ఎస్పీ జ్ఞాపికలు అందించారు. కాగా ఉమ్మడి మెదక్ జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసు సంస్మరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అమర పోలీసుల చిత్ర పటాలకు పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. సంస్మరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా చేపట్టిన వ్యాస రచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు. రక్తదాన శిబిరాలను నిర్వహించి రక్త నిధి కేంద్రాన్ని రక్తాన్ని చేరవేశారు. అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. పట్టణాల్లో పోలీసులు శాంతి ర్యాలీ నిర్వహించి ప్రజలకు మేమున్నామంటూ భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీ శ్రీ్ధర్‌రెడ్డి, టౌన్, రూరల్ సీఐలు వెంకటేష్, శివకుమార్, టౌన్, రూరల్ ఎస్‌ఐలు లక్ష్మారెడ్డి, శ్రీకాంత్, ఎస్‌బీ ఎస్‌ఐలు యాదవరెడ్డి, మల్లేశం, ప్రేంచందర్ తదితరులు పాల్గొన్నారు.