మెదక్

మార్కెట్‌కు అనుగుణంగా పంటలను ప్రోత్సహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, నవంబర్ 13: మార్కెట్‌కు అనుగుణంగా పంటలను పండించడానికి రైతులకు అవసరమైన అడ్వాన్స్ టెక్నాలజీని అందించాలని రిటైర్డ్ చీఫ్‌సెక్రెటరి మోహన్‌కందా సూచించారు. మంగళవారం క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా జిల్లాకు విచ్చేసిన మోహన్‌కందా కలెక్టర్ ఎం.హన్మంతరావుతో కలిసి కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో సమావేశమై జిల్లాలో వ్యవసాయ పరిస్థితులు, రైతులు పండిస్తున్న పంటలు, మార్కెటింగ్ సౌకర్యాలు, అందుతున్న ప్రోత్సాహం, వినియోగిస్తున్న టెక్నాలజీ, పాడిపరిశ్రమ, పశుసంవర్ధక శాఖ ద్వారా రైతుల అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పనితీరు, డీసీసీ బ్యాంకు ఇస్తున్న రుణాలు, రికవరీ, రైతులకు వ్యవసాయ అనుబంధ శాఖల పరంగా అందుతున్న సౌకర్యాలు తదితర అంశాలపై ఆరా తీశారు. పలు సలహాలు, సూచనలు చేశారు. రానున్న రోజుల్లో కాంట్రాక్టు ఫార్మింగ్ అభివృద్ధి చెందే అవకాశాలున్నాయన్నారు. రైతులు పండించే పంటలకు మార్కెటింగ్ స్కోపు ఉండాలన్నారు. జిల్లాలో వర్షాభావ పరిస్థితులు, నీటి లభ్యత ఎక్కువగా ఉన్నందున డ్రిప్ ఇరిగేషన్‌ను తక్కువ నీటితో పండించే పంటలను ప్రోత్సహించాలని సూచించారు. రైతులను గ్రూపుగా చేసి వారే స్వయంగా మార్కెటింగ్ చేసుకునేలా మంచి ప్రోత్సాహకరమైన, అనువైన, లాభదాయక వ్యవసాయ పద్ధతులను పాటించేలా చైతన్యపర్చాలన్నారు. ఆత్మ, ఆయా శాఖలు రైతులకు ఉన్న భూమిలో లభ్యతగల నీటి వనరులతో ఏ విధమైన పంటలు వేసి లాభాలు పొందవచ్చో అవకాహన కల్పించి చైతన్యపర్చాలన్నారు. ఆయా ప్రభుత్వ శాఖలు రైతులకు మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటల గురించి తెలుపాలన్నారు. అవసరమైన తాజా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునేలా పూర్తి సహకారాన్ని అందించాలని సూచించారు. ప్రభుత్వం ద్వారా జిల్లాలో పంపిణీ చేసిన గొర్రెల యూనిట్లతో ఆయా లబ్దిదారులకు చేకూరుతున్న లాభాలు, జిల్లాలో డైరీ, ఫౌల్ట్రీ పరిశ్రమ పరిస్థితి, పాడి ఉత్పత్తి వివరాలు సంబంధిత అధికారిని అడిగారు. పంపిణీ చేసిన గొర్రెలతో ఏ విధంగా లాభపడొచ్చన్న విషయాలపై లబ్దిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో కలెక్టర్ హన్మంతరావు, జనరల్ ఎలక్షన్స్ స్పెషల్ ఆఫీసర్ జితేష్ వి పాటిల్, వ్యవసాయ శాఖ జేడీ నర్సింహారావు, ఉద్యానశాఖ అధికారి సునీత, పశుసంవర్ధక శాఖ జేడీ రామారావు రాథోడ్, డీసీఓ ప్రసాద్, డీసీసీబీ ప్రతినిధి తదితరులు పాల్గొన్నారు.