మెదక్

జిల్లాలో ఒక్క సీటుకే పరిమితమైన కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, నవంబర్ 13 : సిద్దిపేట జిల్లాలోని నాలుగు నియోజక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గజ్వేల్‌లోని ఒక్క నియోజక వర్గానికి పరిమితమైంది. జిల్లాలోని సిద్దిపేట, దుబ్బాకలు టీజేఎస్ పార్టీకి, హుస్నాబాద్ నియోజక వర్గం సీపీఐకి దాదాపుగా ఖరారైనాయి. గజ్వేల్ నియోజక వర్గం నుండి వంటేరు ప్రతాప్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. సిద్దిపేట నుండి టీజేఎస్ అభ్యర్థిగా భవాని రెడ్డి, దుబ్బాక నుండి టీజేఎస్ అభ్యర్థిగా చిందం రాజ్‌కుమార్ పేరును అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. హుస్నాబాద్ నియోజక వర్గం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి దాదాపుగా ఖరారైంది. మహాకూటమి నేతలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. సిద్దిపేట జిల్లాలో బలమైన కాంగ్రెస్ క్యాడర్ ఉన్న దుబ్బాక, హుస్నాబాద్, సిద్దిపేట స్థానాలను మహాకూటమి పొత్తులో భాగంగా ఇతర పార్టీలకు కేటాయించటం పట్ల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో దుబ్బాక సీటు కోసం మాజీ మంత్రి ముత్యంరెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రావణ్‌కుమార్‌రెడ్డి, ఎంజేఆర్ ట్రస్టు వ్యవస్థాపకుడు, గోల్కోండ రీజియన్ ఆర్టీసీ చైర్మన్ మద్దుల నాగేశ్వర్‌రెడ్డి ఆశీంచటంతో పాటు నియోజకం వర్గంలో ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. సిద్దిపేట నియోజక వర్గం నుండి జిల్లా కాంగ్రెస్ నేత దరిపల్లి చంద్రం, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రభాకర్‌వర్మ, నియోజక వర్గం ఇన్‌చార్చి తాడూరి శ్రీనివాస్‌గౌడ్, పీసీసీ చేనేత విభాగం చైర్మన్ గూడూరి శ్రీనివాస్‌లు ఆశీంచి నియోజక వర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. హుస్నాబాద్ సీటు కోసం మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు శ్రీరాం చక్రవర్తిలు ఆశీంచి నియోజక వర్గంలో ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. దుబ్బాకలో మాజీ ముత్యంరెడ్డి సీటు కోసం మాజీ ఉప ముఖ్యమంత్రి, మేనిఫెస్టో చైర్మన్ దామోదర రాజనర్సింహ పట్టుబట్టారు. నియోజక వర్గంలో దుబ్బాక కాంగ్రెస్ పార్టీకే ఖరారైందని ప్రచారం జరిగింది. ఈక్రమంలో దుబ్బాక నియోజక వర్గంలో తాను పోటీ చేయనున్నట్లు స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి ప్రకటించారు. అనూహ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో సిద్దిపేట, దుబ్బాక, మెదక్ నియోజక వర్గాలు టీజేఎస్‌కు మూడు సీట్లు కేటాయించటం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తాము గత ఐదేండ్లు నియోజక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషిచేసామని, నియోజకవర్గాలను బలంగా తీర్చిదిద్దిన తర్వాత పొత్తులో భాగంగా టీజేఎస్‌కు కేటాయించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ అధిష్టానం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహాకూటమి అభ్యర్థులకు ఏట్టి పరిస్థితుల్లో సహాకరించేది లేదని బహిరంగంగా ప్రకటించారు. దుబ్బాక నుండి కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ఆశీంచిన మాజీ మంత్రి ముత్యంరెడ్డి, మద్దుల నాగేశ్వర్‌రెడ్డి, సిద్దిపేట టికెట్ ఆశీంచిన దరిపల్లి చంద్రం, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌వర్మ, నియోజక వర్గం ఇన్‌చార్జి తాడూరి శ్రీనివాస్‌గౌడ్‌లు స్వతంత్రంగా పోటీలో దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. హుస్నాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి స్వతంత్రంగా బరిలో దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. నియోజక వర్గంలోని కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డిని బలపరుస్తున్నారు. జిల్లాలో బలమైన మూడు నియోజక వర్గాలను పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి కేటాయించక పోవటంపై పార్టీ శ్రేణులు అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. మహాకూటమి నేతలకు ఏట్టిపరిస్థితుల్లో సహించేది లేదని అల్టిమెటం ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు మహాకూటమి నేతలకు సహాకరించకుంటే అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కు విజయం నల్లెరుపై నడకగా మారే అవకాశం ఉంది. సిద్దిపేట, దుబ్బాకలో టీజేఎస్‌కు సరైన క్యాడర్ లేకపోవటంతో మంత్రి హరీష్‌రావు, తాజామాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డికి లాభించే అవకాశాలున్నాయి. హుస్నాబాద్‌లో సైతం సీపీఐ క్యాడర్ అంత టీఆర్‌ఎస్‌లో చేరటంతో టీఆర్‌ఎస్ అభ్యర్థి సతీష్‌కుమార్‌కు ప్రయోజనం చేకూరే అవకాశాలున్నాయి. సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు పార్టీ అధిష్టానంను కలిసి కాంగ్రెస్ పార్టీకి టికెట్లు కేటాయించాలని వత్తిడీ తెస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల వత్తిడీ ఏమేరకు ఫలిస్తుందో వేచి చూడాల్సిందే .!