మెదక్

నేడు సాదాసీదాగా కేసీఆర్, హరీష్‌రావు నామినేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, నవంబర్ 13 : డిసెంబర్ 7న జరిగే శాసన సభ ఎన్నికలకు ఈనెల 14న గజ్వేల్ నియోజక వర్గానికి ఆపద్ధర్మ సీఎం కేసీఆర్, సిద్దిపేట నియోజక వర్గానికి మంత్రి హరీష్‌రావులు ఏలాంటి హంగు, అర్భాటాలు లేకుండ సాదాసీదాగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. సీఎం కేసీఆర్ సెంటిమెంట్ ఆలయమైన కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, ఆశీర్వచనం తీసుకొని నామినేషన్ పత్రాలు దాఖలు చేయటం ఆనవాయితీగా వస్తోంది. 1985 సంవత్సరం నుండి సీఎం కేసీఆర్ ఇదే పరంపరాను కొనసాగిస్తున్నారు. కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తున్న మంత్రి హరీష్‌రావు సైతం ఇదే సెంటిమెంట్‌ను గౌరవించి ప్రతి ఎన్నికల్లో కోనాయిపల్లి వెంకన్న స్వామి ఆశీర్వాదం తీసుకొని నామినేషన్ దాఖలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ నంగునూర్ మండలానికి ఉదయం 10-40 గంటలకు చేరుకోనున్నారు. సీఎం కేసీఆర్ పర్యటను పురస్కరించుకొని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావులు నంగునూర్ మండలం కోనాయిపల్లి గ్రామాన్ని సందర్శించి ఏర్పాట్లు పర్యవేక్షించారు. సీఎం కేసీఆర్ కోసం సిద్ధం చేస్తున్న హెలీఫ్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. అలాగే వెంకటేశ్వరాలయం వద్ద ఏర్పాట్లను పరిశీలించి తగు సూచనలు చేశారు. కేసీఆర్ కోసం హెల్‌ఫ్యాడ్‌తో పాటు, రోడ్డు మార్గాన వచ్చేందుకు వీలుగా ముందస్తుగా అనుమతి తీసుకొన్నారు. కేసీఆర్ నంగునూర్ కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించి, నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వచనం తీసుకోనున్నారు. అనంతరం గ్రామస్తులతో ముచ్చటించనున్నారు. సీఎం కేసీఆర్ మాట్లాడేందుకు వీలుగా ప్రచార రథాన్ని సిద్ధం చేసి ఉంచారు. కేసీఆర్ మాట్లాడగానే గజ్వేల్‌కు తిరుగుప్రయాణం కానున్నారు. ఏలాంటి హంగు, అర్భాటాలు లేకుండా సాదాసీదాగా మధ్యాహ్నాం 2-45 గంటలకు గజ్వేల్ రిటర్నింగ్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు.
-* సిద్దిపేటలో సర్వమత ప్రార్థనలు చేయనున్న మంత్రి హరీష్‌రావు
రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ఎన్నికల్లో నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన సందర్భంగా సర్వమత ప్రార్థనలు చేయటం ఆనవాయితీగా వస్తుంది. ముందుగా కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజల చేసి ఆశీర్వచనం తీసుకుంటారు. అక్కడ నుండి మెదక్ రోడ్‌లోని ఈద్గా వద్ద ముస్లీంలతో కలసి ప్రార్థనలు చేస్తారు. అలాగే సీఎస్‌ఐ చర్చిలో క్రైస్తవ సోదరులతో కలసి ప్రత్యేక ప్రార్ధనలు చేయనున్నారు. ఆనంతరం ర్యాలీలు, హంగు, అర్భాటాలు లేకుండ సిద్దిపేట రిటర్నింగ్ కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావు నామినేషన్ల సందర్భంగా కోనాయిపల్లిలో పోలీసు యంత్రాంగం గట్టి బందోబస్తు చర్యలు చేపట్టింది.