మెదక్

నర్సరీల ఏర్పాటులో నిర్లక్ష్యం తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, నవంబర్ 13: అడవులను పెంచడమే లక్ష్యంగా గ్రామానికి ఒక నర్సరీని ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీచేసినా అమలులో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని కలెక్టర్ ధర్మారెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఈజీఎస్ పనులు, హరితహారం అమలు, గ్రామానికి ఒక నర్సరీ ఏర్పాటు, స్వచ్చ భారత్ కార్యక్రమం, పాఠశాలల్లో కిచెన్‌షెడ్లు, మరుగుదొడ్ల నిర్మాణం, ఇంకుడు గుంతల నిర్మాణం తదితర పనులపై ఎంపీడీఓలు, ఎపీఓలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సెప్టెంబర్‌లోనే గ్రామానికి ఒక నర్సరీ ఏర్పాటు చేయాలని గతంలోనే ఆదేశాలు ఇచ్చినా నేటికి గ్రామాల్లో ఎందుకు నర్సరీలు ఏర్పాటు చేయలేదని అధికారులను ప్రశ్నించారు. వర్షకాలం ప్రారంభంలో నాటేందుకు అనువుగా పెరగడం లేదనే కారణంతో సెప్టెంబర్‌లోనే నర్సరీలను ప్రారంభం చేద్దామని అనుకున్నామని, మీ అలసత్వం కారణంగా నేటికి నర్సరీలను ప్రారంభించుకోలేకపోతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 రోజుల్లో నర్సరీల ఏర్పాటుకు సంబంధించి అన్ని పనులు పూర్తి చేసి నర్సరీలను ప్రారంభించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో ఇప్పటికీ మరుగుదొడ్లు నిర్మించుకోని వారికి అనుమతులు మంజూరు చేయాలని, నిర్మించుకున్న వారు వినియోగించుకునేలా అవగాహణ పెంపొందించుకునేందుకు స్వచ్చగ్రాహి సేవలను వినియోగించుకోవాలన్నారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరికి ఉపాది హామి పథకం ద్వారా ఉపాది కల్పించాలని, కొంతమంది ఫీల్డ్ అసిస్టెంట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ప్రతి గ్రామాల్లో నిర్దేశించిన లక్ష్యం మేరకు ఉపాది హామి పనులు కల్పించాలని ఆదేశించారు. అదే విధంగా అవసరం ఉన్న ప్రతి పాఠశాలలో మరుగుదొడ్ల, కిచెన్‌షెడ్ల నిర్మాణం పనులు వేగవంతం చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఇంకుడు గుంతల నిర్మాణం, డంపింగ్ యార్డుకు స్థల సేకరణ విషయాలపై ప్రత్యేక దృష్టి సాధించాలన్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా ఇప్పటి నుంచే ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. భవిషత్తులో తాగునీటి సమస్య ఏర్పడితే దానిని అదిగమించేందకు పకడ్భంది చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి సీతారామరావు, జిల్లా అటవిశాఖ అధికారి పద్మజారాణితో పాటు ఎంపీడీఓలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తివారీ సవారీ ఎటు!
* వౌనం వీడని బ్రదర్స్

సంగారెడ్డి, నవంబర్ 13: రెండు దఫాల సార్వత్రిక ఎన్నికలకు ప్రస్తుత టీఆర్‌ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్‌కు కుడిభుజంగా పని చేసిన మహేష్ తివారీ ఈ సారి ఎటు మొగ్గు చూపిస్తారా అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. 2009 ఎన్నికల సందర్భంగా చింతా ప్రభాకర్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలోకిదిగిన విషయం తెలిసిందే. అప్పట్లో మహేష్ తివారి ఇంటి ఆవరణనే అడ్డాగా చేసుకున్న చింతా ప్రభాకర్ విస్తృత ప్రచారం నిర్వహించుకున్నారు. అప్పట్లో ఎదురైన పరిస్థితులతో చింతా ప్రభాకర్ చివరకు ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా రంగంలోకి దిగిన చింతా తిరిగి మహేష్ తివారి ఇంటి వద్దనే మకాం వేసుకుని ప్రచారం నిర్వహించుకుని భారీ మెజార్టీతో గెలుపొందారు. ఎన్నికల అనంతరం ఎమ్మెల్యే, తివారిల మధ్య మనస్పర్థలు ఏర్పడటంతో మహేష్ ఎమ్మెల్యేకు దూరంగా ఉంటున్నాడు. రాజకీయంగా తనకంటూ ఒక వర్గం కలిగివున్న తివారి ఇప్పటి వరకు వౌనం వీడకుండా ఉండటంతో చివరి క్షణంలో ఏం నిర్ణయం తీసుకుంటారోనన్న చర్చ కొనసాగుతోంది. ఈ సారి ఎన్నికల్లో తివారి ఇంటిని పక్కన పెట్టిన టీఆర్‌ఎస్ అభ్యర్థి మరోచోట మకాం వేసి కార్యకర్తలతో సమావేశాలు, సంప్రదింపులు చేస్తున్నారు. అప్పట్లో అధికారంలో ఉన్న జగ్గారెడ్డికి ఏ మాత్రం భయపడకుండా తన ఇంటినే పార్టీ కార్యాలయంగా మార్చుకున్న తివారి ఇప్పుడు టీఆర్‌ఎస్‌కు దూరంగా ఉండటం, కాంగ్రెస్, బీజేపీల్లో ఏ పార్టీకి మొగ్గు చూపిస్తారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తటస్థంగానే ఉంటూ టీఆర్‌ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తారా అన్న చర్చ టీఆర్‌ఎస్ శ్రేణుల్లో జోరుగా సాగుతోంది. ఎమ్మెల్యేపై అలకవహించిన తివారి సోదరులతో పలు సందర్భాల్లో చర్చలు నిర్వహించినా కొలిక్కి రాలేదంటూ రాజీ కుదిరే అవకాశాలు ఎంత మాత్రం కనిపించడం లేదు. నామినేషన్ల ఘట్టం పూర్తయితే కానీ తివారి సోదరుల రాజకీయ ఎత్తుగడలు ఏమిటన్నవి తెలియనున్నాయి.