మెదక్

ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ముందు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శివ్వంపేట, నవంబర్ 17: ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుందని నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి సునీతారెడ్డి శనివారం తెలిపారు. మండలంలోని శివ్వంపేట, నాను, బిక్యా, సీత్యా, జెమ్‌సింగ్, పుర్య తండాలు, తిమ్మాపూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా చెయ్యి గుర్తుకు ఓటు వేసి గ్రామాలను అభివృద్ధి చేసుకొని ఆమె ఓటర్లను కోరారు. తెరాస నాయకుల మాటలు నమ్మవద్దని, కాంగ్రెస్‌ను నమ్మితే గ్రామాలు ప్రగతి పథంలో నడుస్తాయని ఆమె తెలిపారు. గతంలో కాంగ్రెస్ హయంలో చేసిన పనులనే నేటికి కనిపిస్తున్నాయని, ప్రతి ఒక్కరిని ఆదుకునే విధంగా ఎన్నికల ప్రణాళిక రూపొందించడం జరిగిందని ఆమె ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ముందుగా హత్నుర మండలంలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన తెరాస నాయకులు శ్రీను, సిద్దు, లక్ష్మణ్, మురళీతో మరో 10 మంది, వెల్దుర్తి మండలం ఆరెగూడెంకు చెందిన తెరాస నుండి రాజిరెడ్డి, లక్ష్మణ్‌రెడ్డి, గణేష్, ప్రభాకర్‌లతో పాటు మరో 20 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో సునీతారెడ్డి సమక్షంలో చేరారు. ఈ ప్రచారంలో నాయకులు యాదాగౌడ్, లక్ష్మీకాంతం, సుదర్శన్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్, హరిశంకర్‌గౌడ్, నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.