మెదక్

కాంగ్రెస్‌పై యుద్ధం ప్రకటించిన మంత్రి హరీష్‌రావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, నవంబర్ 17: గజ్వేల్‌లో కాంగ్రెస్‌పై మంత్రి హరీష్‌రావు యుద్ధం ప్రకటించి కులాలు, మతాల పేరిట ఆత్మీయ, ఆశీర్వాద సభలు నిర్వహిస్తూ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నట్లు రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి వంటేరు ప్రతాప్‌రెడ్డి విమర్శించారు. శనివారం గజ్వేల్‌లో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన అనంతరం విలేఖరులతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులు, రోడ్లను ఆంధ్ర కాంట్రాక్టర్లకు కట్టబెట్టి లబ్ధి పొందుతుండగా, మరి ఏపీ సీఎం చంద్రబాబుపై విమర్శలు ఎందుకు చేస్తున్నట్లు ఆయన నిలదీశారు. ముఖ్యంగా ప్రజలను రెచ్చగొట్టి మరోసారి అధికారం చేపట్టే దిశగా కుట్రలకు తెరలేపిన కేసీఆర్ మాయలో ఓటర్లు పడబోరని స్పష్టం చేశారు. సమాజంలో ఆంధ్రోళ్లను అంటరానివారిగా పరిగణిస్తున్న టీఆర్‌ఎస్ ఓట్ల కోసం మాత్రం మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలే తమ ప్రచార అస్త్రాలు కాగా, సర్వేల పేరిట కాలయాపన చేసిన కేసీఆర్ ఏ ఒక్క పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేసిన దాఖలాలు లేవని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కే-్ఫర్ పాలన కొనసాగుతుండగా, గ్రామీణ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారినట్లు ఆరోపించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో విద్యార్థులు, యువత, నిరుద్యోగులు, కార్మికులు, రైతులు, మహిళలు తగిన విదంగా బుద్ది చెప్పడానికి సిద్దంగా ఉండగా, డబ్బు, మద్యంతోగజ్వేల్ ప్రజలు మోసపోరని తెలిపారు. అయితే రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే విత్‌డ్రా అనంతరం గజ్వేల్‌ను వీడుదామని అప్పుడు ప్రజలు చెప్పే నిర్ణయాన్ని శిరోదార్యంగా భావిద్దామని సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావులకు ఆయన సవాల్ విసిరారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు ప్రజలు రుణపడి ఉండగా, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టడం ఖాయమని చెప్పారు. కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, ఎంపీపీ వెంకట్‌రాంరెడ్డి, మాజీ జెడ్‌పీటీసీలు లక్ష్మారెడ్డి, బొల్లారం ఎల్లయ్య, మాజీ ఎంపీపీలు రంగారెడ్డి, మోహన్, నాయిని యాదగిరి, నేతలు ఉప్పల మెట్టయ్య, విరాసత్‌అలి, భానుప్రకాశ్, భాస్కర్ రెడ్డి, వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, ఆర్కె శ్రీను, దుర్గాప్రసాద్, నరేందర్‌రెడ్డి, సర్దార్‌ఖాన్, రామరాజశర్మ, గుంటుకు మల్లేషం, గుంటుకు రాజు పాల్గొన్నారు.