మెదక్

కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా దక్కదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సాపూర్,నవంబర్ 17: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కే పరిస్థితి లేదనే ఎక్కువ మాట్లాడుతున్నారని మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఆరోపించారు. శనివారంనాడు నర్సాపూర్ శాసన సభ్యత్వానికి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా చిలుముల మదన్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా దక్కదనే ఎక్కువ మాట్లాడుతున్నారని అన్నారు. నర్సాపూర్‌లో ఇటీవల జరిగిన కాంగ్రెస్ సభకు హాజరైన రేవంత్‌రెడ్డి నర్సాపూర్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని ప్రకటించడం సిగ్గు చేటని అన్నారు. సునీతారెడ్డి 15ఏళ్లు నియోజకవర్గానికి ఏం చేయలేదనే రేవంత్ దత్తత తీసుకుంటానని అన్నారా! అని ప్రశ్నించారు. ప్రజల అభివృద్ధే లక్ష్యంగా పాటుపడే ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలా! లేదా సీట్ల కోసం పాకులాడే కాంగ్రెస్ కావాలా! అని ప్రశ్నించారు. సునీతారెడ్డి 10ఏళ్లు మంత్రిగా ఉండి నర్సాపూర్‌లో బస్‌డిపో తీసుకురానందుకు, ఎరువులు, విత్తనాలు, కరెంటు కొరతల కోసం ఓట్లు వేయాలా! అని అన్నారు. కాంగ్రెస్ హయాంలో కరెంటు కొరత, విత్తనాలు, ఎరువుల కొరత రైతులు అష్టకష్టాలు పడ్డారు. రైతులకు రైతు భీమా, రైతు బంధు, కల్యాణ లక్ష్మీ, షాదీముభారక్ వంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావడం తద్యమని ధీమా వ్యక్తం చేశారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబుతో కలిసి ఓట్ల కోసం వస్తున్న కాంగ్రెస్‌ను ప్రజలు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. లక్ష రూపాయల రుణమాఫీతో పాటు రైతు బంధుకు ఎకరాకు పది వేలు అందించనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ వస్తే కాళేశ్వరం ప్రాజెక్టు, కల్యాణలక్ష్మీ, రైతు సమన్వయ సమితులన్ని కుంటుపడి అభివృద్ధి ఆగిపోతుందని అన్నారు. నర్సాపూర్ నాలుగెళ్ల టీఆర్‌ఎస్ పాలనలో అభివృద్ధి దిశగా పోతుందని అన్నారు. ఆర్టీసీ బస్‌డిపోతో పాటు ప్రతి గిరిజన తండాకు సీసీ రోడ్లు, నర్సాపూర్ నుంచి నాలుగులైన్ల రోడ్డు, హల్ధీపై చెక్ డ్యాంల నిర్మాణానికి 70కోట్లు మంజూరు వంటి ఎన్నో అభివృద్ధి పనులతో దూసుకుపోతుందని అన్నారు. తాజామాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ ఓటమి భయంతోనే కాంగ్రెస్ నాయకులు కవీంపు చర్యలకు దిగుతున్నారని అన్నారు. ఏలాగైనా సానుభూతి ఓట్లతో గెలుపొందాలని చూస్తున్న కాంగ్రెస్‌ను ప్రజలు చిత్తు చిత్తుగా ఓడిస్తారని అన్నారు. సునీతారెడ్డి ఏడుపులతో ఎవరిని నమ్మించే పరిస్థితి లేదని అన్నారు. పదవుల్లో ఉన్నప్పుడు చేసే చేతకాక ఏడ్పులతో ప్రజలను నమ్మించి ఓట్లు దండుకొని మోసం చేయాలని చూస్తున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జడ్పీచైర్‌పర్సన్ రాజమణి, ఎంపీ కొత్త ప్రబాకర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, మార్కెట్‌కమిటీ చైర్‌పర్సన్ హంసీభాయి, టీఆర్‌ఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్, ఎంపీపీలు శ్రీనివాస్‌గౌడ్, హరీకృష్ణ, పద్మ, నాయకులు దేవేందర్‌రెడ్డి, అశోక్‌గౌడ్, కృష్ణాగౌడ్, ప్రతాప్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, చంద్రశేకర్, హబీబ్‌ఖాన్, భిక్షపతి, నాగేష్, నరేందర్‌రెడ్డి, శివాంజనేయులు, శంకర్‌గౌడ్, అనంతరెడ్డి పాల్గొన్నారు.