మెదక్

టీజేఎస్ అభ్యర్థులు ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, నవంబర్ 17 : సిద్దిపేట జిల్లాలో మహాకూటమిలో భాగంగా సిద్దిపేట, దుబ్బాక నియోజక వర్గాలను తెలంగాణ జనసమితి (టీజేఎస్)కు కేటాయించారు. సిద్దిపేట నియోజక వర్గం టీజేఎస్ అభ్యర్థిగా మరికంటి భవానిరెడ్డి, దుబ్బాక నియోజక వర్గం అభ్యర్థిగా చిందం రాజ్‌కుమార్‌కు పార్టీ అధినేత కోదండరామ్ ప్రకటించారు. టీజేఎస్ ప్రకటించిన తొలి జాబితాలో మర్కంటి భవానిరెడ్డి, చిందం రాజ్‌కుమార్‌లకు అవకాశం దక్కింది. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం నాగిరెరెడ్డిపల్లి గ్రామానికి చెందిన భవానిరెడ్డి సిద్దిపేట సెయింట్‌జాన్స్ హైస్కూల్‌లో పదవ తరగతి వరకు విద్యను అభ్యసించారు. మాసాబ్‌ట్యాంక్‌లో ఆటోమోబైల్ డిప్లోమా, బీఈ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. సిద్దిపేట ఆర్టీసీ డిపో ఉద్యోగంలో చేరి రెండు సంవత్సరాల పాటు విధులు నిర్వహించారు. ఆనంతరం ఉన్నత చదువులకు ఆస్టేలియా దేశం వెళ్లి అక్కడ విధుల్లో చేరింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆస్టేలియా తెలంగాణ ఫోరంలో చురుకైన పాత్ర నిర్వహించింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావించగా ప్రొఫెసర్ కోదండరామ్ టీజేఎస్ పార్టీ స్థాపించగానే పార్టీలో చురుకైన పాత్ర నిర్వహించింది. సిద్దిపేట నుండి టీజేఎస్ పార్టీ టికెట్ కేటాయించటం పట్ల భవానిరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. సిద్దిపేట నియోజక వర్గంలో మంత్రి హరీష్‌రావుకు గట్టి పోటీ నిస్తానని భవాని రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పటికే సిద్దిపేట నియోజక వర్గానికి నామినేషన్ దాఖలు చేసిన భవానిరెడ్డి, సోమవారం మరో సెట్టు నామినేషన్ వేయనున్నట్లు వెల్లడించారు.
దుబ్బాక అభ్యర్థిగా మాజీ జెడ్పీటీసీ చిందం రాజ్‌కుమార్
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామానికి చెందిన చిందం రాజ్‌కుమార్ తెలుగుదేశం పార్టీ పట్టల ఆకర్శితులై రాజకీయ ప్రవేశం చేశారు. 1999లో తెలుగుదేశం పార్టీ పక్షాన ఎంపీటీసీగా విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమం పట్ల ఆకర్శితులై 2001లో ఎంపీటీసీకి, టీడీపీ పార్టీకి రాజీనామా చేసి కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. 2004లో టీఆర్‌ఎస్ టికెట్ ఆశీంచినప్పటికి దక్కక పోవటంతో టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి టీడీపీలో చేరారు. 2006 తెలుగుదేశం పార్టీ నుండి దౌల్తాబాద్ జెడ్పీటీసీగా విజయం సాధించారు. 2008లో మళ్లీ టీడీపీ రాజీనామా చేసి, టీఆర్‌ఎస్‌లో చేరారు. 2014 ఎన్నికల్లో దుబ్బాక నియోజక వర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. 2018లో ప్రొపెసర్ కోదండరామ్ టీజేఎస్ పార్టీ స్థాపించగానే దుబ్బాక నియోజక వర్గ కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించి కోదండరామ్ సమక్షంలో టీజేఎస్‌లో చేరారు. బహిరంగ సభ వేదికగానే దుబ్బాక టీజేఎస్ అభ్యర్థి చిందం రాజ్‌కుమార్ అని ప్రొపెసర్ కోదండరామ్ ప్రకటించారు. శనివారం టీజేఎస్ పార్టీ అధిష్టానం చిందం రాజ్‌కుమార్‌కు అధికారికంగా ఖరారు చేసింది. ఇప్పటికే దుబ్బాక నియోజక వర్గం నుండి నామినేషన్ దాఖలు చేయటంతో పాటు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.