మెదక్

రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుచేసి చట్టబద్ధత కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, నవంబర్ 18: రాష్ట్రంలో పేద రెడ్ల సంక్షేమాన్ని పాలకులు నిర్లక్ష్యం చేయగా, రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి చట్టబద్దత కల్పించే పార్టీకే తమ మద్దతు ఉంటుందని రెడ్డి సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు సంతోష్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం గజ్వేల్‌లోని పీఎన్‌ఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన రెడ్డి సంఘాల ఐఖ్యవేదిక సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల లో అత్యధికులు రెడ్డి సమాజమే కాగా, ఏ ప్రభుత్వం కూడా ఆదుకున్న పాపానపోలేదని ఎద్దేవా చేశారు. అయితే అప్పులబాదతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ. 6లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినప్పటికీ అమలులో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించినట్లు విమర్శించారు. పేద రెడ్లు సమాజంలో గౌరవప్రదంగా జీవించేందుకు ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేసి రూ. వేయి కోట్లు కెటాయించాలని గత 4 యేండ్లుగా సర్కార్‌ను డిమాండ్ చేసినప్పటికీ కేసీఆర్‌తో పాటు కనీసం మంత్రులు సైతం అపాయింట్ మెంట్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలు రెడ్డి కార్పోరేషన్ ఏర్పాటుకు మెనిఫెస్టోలో పొందుపర్చినప్పటికీ తమకు అనుమానాలు ఉండగా, స్పష్టమైన హామీ ఇవ్వడంతోపాటు చేతల్లో చూపించే వారికే అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని, వ్యవసాయ రైతులు, నిరుపేద రైతుకూలీలకు పెన్షన్ మంజూరు చేయాలని, విద్యాపరంగా, రాజకీయంగా చేయూతనివ్వాలని, రూ. వేయికోట్లతో ప్రత్యేక రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి సర్వహక్కులు కల్పించాలని, చిరువ్యాపారాలు చేసుకునేందుకు పూచీకత్తు లేకుండా పేద రెడ్లకు రుణాలిచ్చేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఐక్యంగా ముందుకు సాగితే ఏదైనా సాదించవచ్చారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు బాప్‌రెడ్డి అధ్యక్షత వహించగా, నేతలు లక్ష్మినర్సింహా రెడ్డి, దుశ్యంతరెడ్డి, బాల్‌రెడ్డి, నర్సింహారెడ్డి, నరేందర్‌రెడ్డి, సత్తిరెడ్డి, ఆముదాల వెంకట్‌రెడ్డి, శ్రావన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సీఎం ఫామ్‌హౌస్‌లో ప్రారంభమైన హోమాలు
* రాజ్యాధికారం కోసమే రాజశ్యామల హోమం
జగదేవ్‌పూర్, నవంబర్ 18: సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల పరిధిలోని ఎర్రవల్లి సీఎం ఫామ్‌హౌజ్‌లో ఆదివారం రాజశ్యామల, చండీసహిత రుద్ర హోమాలు ప్రారంభించారు. రెండు రోజులు నిర్వహించే ఈ హోమాదికార్యక్రమాలు ఆదివారం ఉదయం 7.30 గంటలకు వేద పండితులు ప్రారంభించగా, రాజశ్యామల హోమంలో కేసీఆర్ దంపతులు మాత్రమే పాల్గొన్నారు. సోమావారం నిర్వహించే చండీసహిత రుద్ర హోమంలో కేసీఆర్ కుటుంబ సభ్యులతో పాటు పార్టీ ముఖ్య నేతలు పాల్గొననున్నారు. రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా చిన్నజీయర్ స్వామి సూచన మెరకు సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా 120 మంది రుత్వికులతో హోమం నిర్వహిస్తున్నారు. కేసీఆర్ 2015లో నిర్వహించిన ఆయుత చండీ యాగస్థలంలోనే ఈ హోమాన్ని నిర్వహిస్తున్నారు. ఆయితే శనివారమే వేదపండితులు ఫాంహౌస్‌కు చేరుకున్నారు.