మెదక్

వరవరరావును వెంటనే విడుదల చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, నవంబర్ 18 : విరసం వ్యవస్థాపక సభ్యుడు, సామాజిక ఆచరణ మేధావి, రచయిత, విప్లవ కవి వరవరరావును, మరో నల్గురు సుప్రసిద్ధ సామాజిక కార్యకర్తలు సుధాభరద్వాజ్, గౌతమ్ నవలఖ, వెర్నజ్ గోంజాల్వెజ్, అరుణ్ పేరాలు ప్రధాన మంత్రి నరేంద్రమోదీని హత్య చేసారని కుట్ర పన్నారని ఆరోపణలతో దుర్మార్గమైన ఊపా చట్టం కింద నిర్భంధించటం దేశ ప్రజస్వామ్యానికి సిగ్గుచేటని మరసం ప్రతినిధులు తైదల అంజయ్య, అలాజీపూర్ కిషన్, శ్రీనివాస్, తోట అశోక్, రంగాచారి, పొన్నల బాలయ్య, సిద్దంకి యాదగిరిలు పేర్కొన్నారు. ఈమేరకు పత్రిక ప్రకటనను విడుదల చేశారు. రెండున్నర నెలల గృహ నిర్బంధం తర్వాత వరవరరావును 17న అత్యంత దుర్బరమైన పుణే జైలుకు తరలించారన్నారు. 78 సంవత్సరాల వయస్సుతో ఆనారోగ్యంతో ఉన్న వ్యక్తిని ఏ వసతులు లేని జైలులో పడేసాంతంగా రాజ్యం ఎందుకు కక్ష కట్టిందని పేర్కొన్నారు. ఎన్ని కుట్రా ఆరోపణలు చేసిన వరవరరావు సుదీర్ఘ సామాజిక ఆచరతంత బహిరంగమేని తెలిపారు. మూడున్నర దశాబ్ధాల పాటు విద్యార్థులకు ప్రియమైన అధ్యాపకునిగా, పాతికేళ్లకు పైగా తెలుగుసామాజిక చరిత్రలో ప్రభావ శీలిగా పనిచేసిన ఆధునిక సాహిత్య వేదిక సృజన సంపాదకునిగా , తెలుగు సాహిత్య, సాంస్కృతిక మేధో రంగాలను మలుపుతిప్పిన విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపకుల్లో ఒకరిగా, ప్రజా ఉద్యమ స్వరంగా అందరికి తెలుసు అన్నారు. ప్రభుత్వానికి, నక్సలైట్లకు మధ్య జరిగిన రెండు సార్లు శాంతిచర్చల ప్రయత్నంలో ఆయన కృషి ఏంతోగానో ఉందన్నారు. ఆగస్టు 28న వరవరరావుతో పాటు దేశ వ్యాప్తంగా పలువురు సామాజిక కార్యకర్తల ఇళ్లలో పుణే పోలీసులు అక్రమంగా దాడులు చేసి ఐదుగురిపై కుట్ర కేసులు బనాయించార్నారు. నెల రోజుల గృహ నిర్బందం తర్వాత రాత్రికి రాత్రే అరెస్టు చేశారన్నారు. సామాజిక కార్యకర్తలను ప్రమాదకర వ్యక్తులుగా చూపెట్టటం మంచి పద్దతి కాదన్నారు. అక్రమ అరెస్టులు, చీకటి నిర్బంధాలకు వ్యతిరేకంగా గొంతు విప్పాలని ప్రజాస్వామిక వాదులను, మేధావులకు విజ్ఞప్తి చేశారు.