మెదక్

పోలీసుల తనిఖీల్లో నగదు పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామాయంపేట, నవంబర్ 20: ఎన్నికల విదుల్లో బాగంగా రామాయంపేట పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీల్లో ఎలాంటి అనుమతులు లేకుండా కారులో తరలిస్తున్న నగదును రామాయంపేట పోలీసులు సీజ్ చేశారు. ఎస్‌ఐ మహేందర్ కథనం ప్రకారం రామాయంపేట-మెదక్ రహదారిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆర్మూర్ మామిడిపల్లికి చెందిన వనం సుదాకర్, దాసరి గంగన్నలు ఏర్టిగా కారు నెంబర్ టిఎస్16 ఈవో 6668 గల కారులో ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా 2లక్షల 85వేల 3వందల రూపాయలు తరలిస్తుండగా పట్టుకొని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

పెట్రోల్ బంక్ ఉద్యోగిపై దాడి
* రూ.1.50 లక్షల అపహరణ
టేక్మాల్, నవంబర్ 20: పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్న వ్యక్తిపై దాడి చేసి కళ్లల్లో కారం చల్లి కొందరు దుండగులు చోరికి పాల్పడిన సంఘటన టేక్మాల్ మండల పరిధిలోని బొడ్మట్‌పల్లిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం మండల పరిధిలోని బొడ్మట్‌పల్లి శివారులో గత ఏడాది చార్మి కడారి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌ను జ్యోతి ఏర్పాటు చేశారు. పెట్రోల్ బంక్‌లో కొందరిని ఏర్పాటు చేసుకొని కొనసాగిస్తున్నారు. గత రెండు రోజుల నుండి బంక్ పనిచేయడంతో నిరుపయోగంగా ఉంది. బంక్ నిర్వాహణ కోసం బంక్ బీరులో రూ.1.50 లక్షలు ఉంచారు. బంక్‌లో పనిచేసే అర్జున్ సోమవారం అక్కడే నిద్రిస్తున్నాడు. ఈ క్రమంలో గది తలుపులు బద్దలుకొట్టి గుర్తు తెలియని వ్యక్తులు బంక్‌లో చొరబడి అర్జున్‌పై దాడి చేసి బీరువాలో ఉన్న 1.50 లక్షల నగదును తీసుకెళ్లారు. సంఘటన తెలుసుకున్న మెదక్ డీఎస్పీ కృష్ణమూర్తి, అల్లాదుర్గం సీఐ రవీందర్‌రెడ్డి మంగళవారం విచారణ చేపట్టారు. బాధితురాలి బంధువు గోవర్దన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అందోల్ తెరాస అభ్యర్థి క్రాంతికిరణ్‌పై కేసు నమోదు
జోగిపేట, నవంబర్ 20: అందోల్ తెరాస అభ్యర్థి చంటి క్రాంతికిరణ్‌పై కేసు నమోదు చేసినట్లు జోగిపేట సబ్ ఇన్స్‌పెక్టర్ వెంకటేశ్ తెలిపారు. నామినేషన్ల చివరి రోజు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి మహా ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. సీ విజన్ మ్యాప్ ద్వారా ప్రజలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. నామినేషన్ వేసే కేంద్రానికి వంద మీటర్ల దూరంలో ర్యాలీ నిర్వహించి ఉపన్యాసాలు చేపట్టాలని నిబంధన ఉంది. దానికి విరుద్ధంగా హద్దుదాటి నడిరోడ్డుపై రెండు గంటల పాటు రోడ్డును స్తంభింపజేయడం వంటి కారణాలతో ఎన్నికల అధికారుల సూచన మేరకు కేసు పెట్టడం జరిగిందన్నారు. ఏది ఏమైనప్పటికీ అందోల్ తెరాస అభ్యర్థి క్రాంతికిరణ్‌పై కేసు నమోదు చర్చనీయాంశంగా మారింది.