మెదక్

ఈ పరీక్షల్లో నాకెన్ని మార్కులేస్తారో మీచేతిలోనే ఉంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట రూరల్/ సిద్దిపేట అర్బన్/ సిద్దిపేట టౌన్, నవంబర్ 20: మీ ఇంట్లో బిడ్డగా.. మీ అందరి వాడిగా కష్టాల్లో సుఖాల్లో మీ కుటుంబ సభ్యుడిగా నాలుగున్నరేళ్లు పనిచేశా... ఈ ఎన్నికల పరీక్షల్లో ఎన్ని మార్కులు వేస్తారో మీ చేతిలో ఉందని, మీ కుటుంబ సభ్యుడిగా మీరు నన్ను ఆశీర్వదించాలని అపద్ధర్మ మంత్రి, సిద్దిపేట టిఆర్‌ఎస్ అభ్యర్థి తన్నీరు హరీష్‌రావు అన్నారు. సిద్దిపేట పత్తి మార్కెట్ యార్డు మైదానంలో జరిగిన టిఆర్‌ఎస్ ఆశీర్వాద సభలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన దీవెనలతో, ప్రజల ఆశీర్వాదంతో నాలుగున్నరేళ్లుగా చేసిన అభివృద్ధి మీ కండ్ల ముందే ఉందన్నారు. ఇప్పుడు పరీక్ష వచ్చింది ఈ పరీక్షల్లో నాకు ఎన్ని మార్కులు వేస్తారో మీ చేతిల్లోనే ఉందన్నారు. మీ ఇంట్లో మీ కొడుకు పదవ తరగతి పరీక్ష వ్రాస్తే ఫస్ట్ క్లాస్‌లో పాసు కావాలని మీరు ఏలా కొరుకుంటారో లెక్కలో వంద మార్కులు రావాలని ఏలా కోరుకుంటారో అలా మీ కుటుంబ సభ్యుడిగా నిలబడ్డాను, నాలుగున్నరేళ్లలో ప్రగతి పరీక్ష వ్రాశానని, ఈ పరీక్షల్లో నాకు ఎన్ని మార్కులు వేస్తారో మీ చేతిల్లోనే ఉందన్నారు. ఎంత ఎదిగితే అంత ఒదిగి పనిచేయాలని కేసీఆర్ మాకు నేర్పారని, ప్రజల ఆశీస్సులు, దీవేనలు తీసుకొని ఆ శక్తి నుండి ప్రజలకు సేవ చేయాలని మాకు నేర్పించారన్నారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి ఇక్కడ సేవ చేసే అదృష్టాన్ని కల్పించారు. కేసీఆర్ నాయకత్వంలో సిద్దిపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానన్నారు. గతంలో సిద్దిపేటకు వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ సిద్దిపేట జిల్లా, మెడికల్ కాలేజీ ఏర్పాటుతో పాటు రైల్వే లైన్ మూడు హామిలిచ్చి నేరవెర్చిన తర్వాత మళ్లీ సిద్దిపేటకు వచ్చారన్నారు.

సీఎం ఆశీస్సులతోనే దుబ్బాక అభివృద్ధి
- దుబ్బాక మాజీ ఎమ్మెల్యే, టిఆర్‌ఎస్ అభ్యర్థి సోలిపేట
దుబ్బాక నియోజకవర్గం అంటేనే కరువుతో విలయతాండవం చేస్తుండేదని, టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ఆశీస్సులతో దుబ్బాకను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే, టిఆర్‌ఎస్ అభ్యర్థి సోలీపేట రామలింగారెడ్డి అన్నారు. సిద్దిపేటలో జరిగిన టిఆర్‌ఎస్ ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చి ఇంటింటికి మంచినీటి సరఫరాను చేయడం జరుగుతుందన్నారు. సీఎం కృషితోనే దుబ్బాకలో మంచినీటి సమస్యను పరిష్కరించుకోవడం జరిగిందన్నారు. సిద్దిపేట నుండి దుబ్బాకకు కాళేశ్వరం నీళ్లు కాలువల ద్వారా కరువును శాశ్వతంగా తరిమికోట్టేందుకు దుబ్బాక ప్రాంతంలో చెరువులు, కుంటలు, వాగులు ప్రధానంగా కూడవెళ్లి వాగును జీవనది చేస్తు జలకళ సంతరించుకునేలా నింపి ఈ ప్రాంతం సస్యశ్యామలం చేసేందుకు సీఎం కృషి చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రతి సంక్షేమ పథకాన్ని వందకు వందశాతం పూర్తి చేస్తామన్నారు.

బొల్లారంలో మంత్రి హరీష్‌రావు ఆకస్మిక పర్యటన
* బాల్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరికపై చర్చ
* వ్యతిరేకించిన నాయకులు, వెనుదిరిగిన మంత్రి
జిన్నారం, నవంబర్ 20: నియోజక వర్గంలో రోజురోజుకు రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఏ రోజు ఏ నాయకుడు ఏ పార్టీలో వుంటాడో మరే పార్టీలో చేరతాడో అర్ధం కావడం లేదు. ఇటీవల మండల ఎంపీపీ రవీందర్‌రెడ్డి, మాజీ జెడ్పీటిసి కొలను బాల్‌రెడ్డిలు టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా కాంగ్రెస్ టికెట్ కోసం బాల్‌రెడ్డి విశ్వప్రయత్నాలు చేశారు. కాగా చివరకు కాంగ్రెస్ బీఫారం దక్కకపోవడం కాంగ్రెస్ తరపున కాటా శ్రీనివాస్‌గౌడ్‌కు బీ ఫామ్ దక్కడంతో నిరాశ చెందారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలా లేక టీఆర్‌ఎస్ పార్టీలో చేరాలా అన్న మీమాంసలో పడ్డారు. గత వారం రోజుల క్రితమే పార్టీలో చేరుతున్నట్లు ఊహాగానాలు వచ్చాయి. కాగా మంగళవారం స్వయంగా బొల్లారంలోని రాష్ట్ర టీఆర్‌ఎస్ నాయకుడు చంద్రారెడ్డి ఇంటికి రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు చేరుకున్నారు. పార్టీలో బాల్‌రెడ్డి, ఎంపీపీ రవీందర్‌రెడ్డిలు చేరడానికి సిద్దంగా వున్నట్లు చంద్రారెడ్డితో చర్చించారు. దీంతో చంద్రారెడ్డి వారి పార్టీలో చేరడాన్ని వ్యతిరేకించారు. అంతే కాకండా జిన్నారం, గుమ్మడిదల మండల నాయకులు సైతం పలువురు వారి చేరిక వ్యతిరేకించినట్లు సమాచారం. దీంతో మంత్రి చేసేది ఏమిలేక ఎట్టి పరిస్ధితుల్లో టీఆర్‌ఎస్ అభ్యర్ధి గూడెం మహీపాల్‌రెడ్డిని భారీ మెజారిటితో గెలిపించుకోవాలని మండల నాయకులను ఆదేశించి వెళ్లిపోయారు.