మెదక్

మీ ఆశీర్వాదంతోనే తెలంగాణ సాధించా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, నవంబర్ 20: సిద్దిపేట నా జన్మస్థలం, ఈ మట్టిలోనే పుట్టిన, ఇదే గడ్డపై మీచేతిలో పెరిగిన, మీ ఆశీర్వాద బలంతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినట్లు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇష్టం లేనివాళ్లు ఎన్నో రకాలుగా ఆపాలని ప్రయత్నం చేశారని, మీ ఆశీర్వాద బలంతోనే అన్ని కుట్రలు జయించి రాష్ట్రాన్ని సాధించానన్నారు. మల్లన్నసాగర్, రంగనాయక్‌సాగర్ నిర్మాణ కట్టడాలు చూస్తుంటే మనస్సు ఎంతో పులకించిందనీ, అతి త్వరలోనే గోదావరి నీళ్లతో ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మారనుందన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పత్తి మార్కెట్ యార్డు మైదానంలో మంగళవారం సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం నాలుగున్నరేళ్లలోనే అందరి అంచనాలు తలకిందులు చేస్తు అభివృద్ధిలో దూసుకెళ్లిందన్నారు. 24గంటల ఉచిత కరెంటు, రైతులకు ఏకరానికి 8వేల పెట్టుబడి సాయం, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి తదితర పథకాలతో సంక్షేమంలో నంబర్‌వన్‌గా నిలిచిందన్నారు. సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాలు ఉద్యమానికి పురిటిగడ్డ అన్నారు. సిద్దిపేటను హరీష్‌రావు, దుబ్బాకను రామలింగారెడ్డి అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారన్నారు. సిద్దిపేట నుండి హరీష్‌రావును, దుబ్బాక నుండి రామలింగారెడ్డిని లక్ష ఓట్ల మేజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. నేను పుట్టిన గడ్డపై నుండే రైతులను మరింతగా అభివృద్ధి చేయాలని, కొత్త కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర అందించేందుకే పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఐకేపి మహిళల ద్వారా ధాన్యం కొనుగోలు చేసి అంతర్జాతీయ ప్రమాణాలతో కల్తీ లేని వస్తువులను తెలంగాణ ప్రజలకు రేషన్ షాపులు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నిత్యవసర వస్తువులు పప్పు, పసుపు, కారం, నూనెలు సైతం కల్తీల వల్ల ప్రజలు ఆనారోగ్యం బారిన పడుతున్నారన్నారు. కల్తీ లేని నాణ్యమైన వస్తువులను రేషన్‌షాపుల ద్వారా ప్రజలకు అందించనున్నట్లు తెలిపారు. నీళ్ల మంత్రి హరీష్‌రావు పర్యవేక్షణలో ప్రాజెక్టులు పూరె్తై సాగునీరు వస్తుందని, పుష్కలమైన పంటలు పండుతాయన్నారు. రైతు సమన్వయ సమితిలు తెలంగాణలో పంటల కాలనీలు ఏర్పాటు చేయాలన్నారు. ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండడం వల్ల పంటలు బాగా పండుతాయన్నారు. పండిన పంటకు గిట్టుబాటు ధరను అందించి దళారీ వ్యవస్థను రూపుమాపి రైతులను ఆర్థికాభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రైతులను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రేషన్ డీలర్ల వ్యవస్థను బలోపేతం చేసి వారిని ఆదుకునేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మన వాతావరణంలో పండించిన పంటలను మన ప్రజలకే అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కల్తీ లేని వస్తువులను అందించాలని డబ్ల్యూహెచ్‌ఓ సైతం కృషి చేస్తుందన్నారు. నేను పెద్ద కాపును, రైతు బిడ్డనని, రైతు అభివృద్ధి కోసం కంకణ బద్ధులై పని చేస్తామన్నారు. రైతు సమన్వయ సమితులకు గౌరవ వేతనం అందించేందుకు కృషి చేస్తామన్నారు. తాము నిరంతరం శ్రమిస్తు అవినీతికి అతీతంగా పనిచేస్తు రాష్ట్ర సంపదను పెంచి పేద ప్రజలకు పంచుతున్నానని తెలిపారు. సిద్దిపేటను జిల్లా చేసుకోవటంతో, మెడికల్ కళాశాలను సాధించినట్లు తెలిపారు. మరో రెండేళ్లలో సిద్దిపేట- గజ్వేల్, సిరిసిల్లా, కొత్తపల్లి వరకు రైలు కూత వినిపిస్తుందన్నరు. సిద్దిపేటలో జన్మించానని, దుబ్బాకలో చదువుకున్నానన్నారు. సిద్దిపేటలో 20ఏళ్ల కిందనే ఎల్‌ఎండి ద్వారా తాగునీటిని తెచ్చి ప్రజలకు అందించానని, సిద్దిపేట స్పూర్తిగానే తెలంగాణలో మిషన్ భగీరథ ద్వారా కృష్ణ, గోదావరి నీళ్లను ఇంటింటికి అందిస్తున్నట్లు తెలిపారు. హరీష్‌రావు, రామలింగారెడ్డి గెలుపుపై ఏలాంటి అనుమానం లేదని, లక్ష మేజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

మాజీ మంత్రి ముత్యంరెడ్డి కేసీఆర్ సమక్షంలో చేరిక
మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి, రిటైర్డ్ ఎస్‌ఐ గుర్రప్పగారి రాజు, టిఎన్‌జివోస్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు సీఎం కేసీఆర్ సమక్షంలో తన అనుచరులతో టిఆర్‌ఎస్‌లో చేరారు. సీఎం కేసీఆర్ గులాబి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈకార్యక్రమంలో మంత్రి హరీష్‌రావు, రాజ్యసభ సభ్యుడు కేశవరావు, ఎంపీ కొత్తప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు సుధాకర్‌రెడ్డి, ఫారూక్‌హుస్సేన్, వెంకటేశ్వర్లు, భూపాల్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, నాయకులు రాధకిషన్‌శర్మ, మోహన్‌లాల్, మచ్చవేణుగోపాల్‌రెడ్డి,బర్లమల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన రాష్ట్ర అబ్జర్వర్
తూప్రాన్, నవంబర్ 20: తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లోని ఎన్నికల కేంద్రాలను రాష్ట్ర అబ్జర్వర్ గంగాదర్‌పాత్రో పరిశీలించారు. మండలాల్లోని రామాయపల్లి, కాల్లకల్, రంగాయపల్లి, గౌరారం, రావెల్లి, యావాపూర్‌లోని 157, 166, 167, 168, 169, 170, 173 పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్, మనోహరాబాద్ తహసీల్దార్‌లు శ్రీదేవి, సాయిగౌడ్ పాల్గొన్నారు.