మెదక్

ఎన్నికల నిర్వహణకు పటిష్టమైన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, నవంబర్ 21: సిద్దిపేట జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ ఎన్నికల పరిశీలకులు డీఎస్ గాధ్వీ, గంగాధర్ పాత్రోలకు వివరించారు. బుధవారం సీపీ కార్యాలయంలో సిద్దిపేట,గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్ పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో సమస్యత్మాకమైన పోలింగ్ కేంద్రాలు, సాధరణ పోలింగ్ కేంద్రాలు గుర్తించి, ఏలాంటి సమస్యలు లేకుండ ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో జిల్లా సరిహద్దులో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిఘా పెట్టడంతో పాటు, జియో ట్యాగింగ్ చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో 12 ఫ్లయింగ్ స్కాడ్ టీంలు, వీడియో సర్వేలైన్ టీంలు నాలుగు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో జియో ట్యాగింగ్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సిద్దిపేటలో 256 పోలింగ్ కేంద్రాల్లో 136 సమస్యత్మాకకమైన పొలింగ్ కేంద్రాలు, గజ్వేల్‌లో 306 కేంద్రాల్లో 125 సమస్యత్మకంగా, దుబ్బాకలో 248లో 111 సమస్యత్మకంగా, హుస్నాబాద్‌లో 292 కేంద్రాల్లో 149 సమస్యత్మకమైన కేంద్రాలుగా గుర్తించినట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు వాహనాల తనిఖీల ద్వారా 1,03,42,508 కోట్ల రూపాయలను సీజ్ చేసినట్లు తెలిపారు. జిల్లాలో 474.61 లీటర్ల లిక్కర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో 549 కేసులు నమోదు చేసి, 4789 మందిని బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న 236 నాన్‌బెయిల్ కేసులను వారెంట్స్ ఎగ్జిక్యూటివ్ చేసినట్లు తెలిపారు. పేలుడు పదార్దాలు 60 జిలిటన్ స్టిక్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే పోలీస్ కమిషనర్ వాట్సప్ నెం 7901100100కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. జిల్లాలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించిన వారిపై 5 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పోలీసు అధికారిక యంత్రాంగం ఆధ్వర్యంలో క్షేత్ర స్థాయిలో చేపట్టిన పెట్రోలింగ్ రూట్ మ్యాప్, సెక్టార్ అంశాలపై వివరించారు. ఈసందర్భంగా ఎన్నికల పరిశీలకులు ఐఎఎస్‌లు డీఎస్ గాధ్వీ, గంగాధర్ పాత్రోలు మాట్లాడుతూ చెక్ పోస్టుల్లో వాహనాల తనిఖీ నిరంతరం కొనసాగాలని, ఎన్నికల నియమావళిని పకడ్బందిగా అమలు చేయాలన్నారు. ఈసమావేశంలో జిల్లా కలెక్టర్ కృష్ణ్భాస్కర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయభాస్కర్, డీఆర్‌ఓ చంద్రశేఖర్, అడీషనల్ డీసీపీ నర్సింహరెడ్డి, ఎసీపీలు రామేశ్వర్, నారాయణ, సైఐలు నందీశ్వర్‌రెడ్డి, వెంకట్రామయ్య, పర్శరామ్‌గౌడ్, శ్రీనివాస్, ప్రసాద్, శ్రీనివాస్, కరుణకర్ తదితరులు పాల్గొన్నారు.

తెరాస సభ సక్సెస్
* కళాకారుల ఆటపాటలు, మహిళలు బతుకమ్మ ఆటలు
మెదక్, నవంబర్ 21: సార్వత్రిక శాసనసభ ఎన్నికలను పురష్కరించుకొని బుధవారం మెదక్ సీఎస్‌ఐ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన మెదక్ నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభ విజయవంతమైంది. సభా ప్రాంగణమంతా సాయంత్రం 3:30 గంటలకు నిండిపోయింది. మహిళలు ప్రత్యేకంగా బతుకమ్మ ఆటపాటలతో అందరిని ఆకట్టుకున్నారు. మహిళలు చాలా ఉత్సహంతో కనిపించారు. మెదక్ నియోజకవర్గంలోని ఆరు మండలాల నుండి అంచనాలను మించి భారీయేత్తున తరలివచ్చారు. కళాకారులు ఆటపాటలు అందరిని ఆకట్టుకున్నాయి. 4:50 గంటలకు మాజీ మంత్రి హరీష్‌రావు, పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మదన్‌రెడ్డి, కరణం ఉమాదేవి, ముత్యంరెడ్డి వేదికపైకి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా హరీష్‌రావు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి ప్రసంగం కొనసాగింది. సభకు పద్మాదేవేందర్‌రెడ్డి అధ్యక్షత వహించారు. తెరాస రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మల్లిఖార్జున్‌గౌడ్, వైస్ చైర్మన్ రాగి అశోక్, జీవన్‌రావు, లింగారెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు వేధిక ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హెలిప్యాడ్‌లో వేదిక ప్రాంగణానికి చేరుకున్నారు. పద్మాదేవేందర్‌రెడ్డి కేసీఆర్‌కు పాదాభివందనం చేశారు. కేసీఆర్‌కు మంత్రి హరీష్‌రావు, దేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ముత్యంరెడ్డి, మదన్‌రెడ్డి, ఎంపీ ప్రభాకర్‌రెడ్డిలు ఘన స్వాగతం పలికారు. జిల్లా ఎస్పీ చందనాదీప్తి సూచనల మేరకు ఏఎస్పీ నాగరాజు ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రత చర్యలు తీసుకున్నారు. ప్రత్యేకంగా వాహనాలకు పార్కింగ్ ఏర్పాటు చేశారు. సాయంత్రం 5:57 నుండి 6:16 గంటలకు సీఎం ప్రసంగం కొనసాగింది. జై తెలంగాణ, జై కేసీఆర్, జై పద్మాదేవేందర్‌రెడ్డి అంటూ ప్రజలు భారీయేత్తున నినాదాలు చేశారు.