మెదక్

నిఘా నీడలో ‘గీతం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటన్‌చెరు, డిసెంబర్ 9: పటన్‌చెరు మండలం రుద్రారం గ్రామ పంచాయతి పరిధిలోని గీతం డ్రీమ్డ్ యూనివర్సిటీ... ప్రస్తుతం నిఘా నీడలో బందీ అయింది. శాసనసభ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపునకు వేదికగా మారిన గీతం ఇంజనీరింగ్ కళాశాల సాయుధులైన పోలీసుల పర్యవేక్షణలో ఉండగా ప్రధాన పార్టీల తరపున ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో భద్రంగా ఉంది. డిసెంబర్ 7న జరిగిన పోలింగ్ కోసం పోటా పోటీగా ప్రచారం చేసిన నాయకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి నిరీక్షిస్తున్నారు. ఈ నెల 11వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. శుక్రవారం వివిధ బూత్‌లలో పోలింగ్ ముగియగానే ఈవీఎంలను గీతం కళాశాలలోని భవనంలో స్ట్రాంగ్ రూంలలోకి చేర్చారు. సీసీ కెమెరాల నిఘా నీడలో సదరు భవనం పర్యవేక్షణ కొనసాగుతోంది. సంగారెడ్డి జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన ఇవిఎంలను ఇందులో ఉంచారు. నియోజకవర్గాల వారీగా ప్రత్యేక గదులలో ఈవీఎంల యంత్రాలను భద్రపరిచారు. సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, పటన్‌చెరు, అందోల్, నారాయణఖేడ్, జహీరాబాద్ తదితర ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఇక్కడే జరగనుంది. ప్రధాన పార్టీల నుండి ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులే కాకుండా ఎన్నికలలో పోటీ చేసిన అందరు అభ్యర్థుల భవితవ్యం గీతంలో భద్రపరిచిన ఈవీఎం యంత్రాలలో దాగి ఉంది. జిల్లా పోలీస్ అధికారి చంద్రశేఖర్‌రెడ్డి ప్రతిరోజు గీతం కళాశాలను సందర్శిస్తున్నారు. బందోభస్తు ఏర్పాట్లను ఆయన సునిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ నేపధ్యంలో అధికారులు 11న జరగనున్న ఓట్ల లెక్కింపుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పగడ్భందీగా చేపట్టారు.
ఉదయం ఎనిమిది గంటల నుండి ఓట్ల లెక్కింపు
రుద్రారంలోని గీతం ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల 11న ఉదయం ఎనిమిది గంటల నుండి ఓట్ల లెక్కింపు జరగనుంది. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ఇక్కడే జరగనుండడంతో ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్లను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా ఓట్ల లెక్కింపు సమయంలో అధిక సంఖ్యలో అధికారులను వినియోగిస్తున్నారు. ఒక్కొక్క టేబుల్‌కు ముగ్గురు సూపర్‌వైజర్‌లు, లెక్కింపు అధికారి మాత్రమే కాకుండా వీరిని నిరంతరము పర్యవేక్షించే సూక్ష్మ పరిశీలకులు ఉంటారు. ఇంతే కాకుండా వీరందరిపై నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఒకరు నియమించబడ్డారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చే ఓట్ల లెక్కింపు అత్యంత పగడ్భందీగా జరగడానికి అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేసారు. ఒక్కో నియోజకవర్గానికి రిటర్నింగ్ అధికారి మాత్రమే కాకుండా కేంద్ర బృందం పర్యవేక్షకులు సైతం ఉంటారు. వారందరి నిరంతర పర్యవేక్షణల మధ్య ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
ముందుగా సంగారెడ్డి నియోజకవర్గ ఫలితం
జిల్లా పరిధిలోని ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరగనుండడంతో ముందుగా జిల్లా కేంద్రమైన సంగారెడ్డి నియోజకవర్గం ఫలితాలు వెల్లడించే అవకాశం ఉందని అభ్యర్థులు భావిస్తున్నారు. మొత్తం 18 రౌండ్లు ఉంటాయి. పది నిమిషాలకు ఒకసారి ఒక రౌండ్ ఫలితాలు పూర్తి చేస్తారు. తక్కువ పోలింగ్ కేంద్రాలు ఉండడంతో సంగారెడ్డి నియోజకవర్గం ఫలితాలు ముందుగా వెలువడడానికి అవకాశం ఉంది. సంగారెడ్డి నియోజకవర్గంలో అతి తక్కువగా కేవలం 256 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. పటన్‌చెరు నియోజకవర్గంలో మాత్రం అత్యధికంగా 340 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. దీనితో ఈ నియోకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థులు చివరి దాకా వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. సంగారెడ్డి జిల్లాలోని ఓట్ల లెక్కింపు జరగనున్న ఐదు నియోజకవర్గాల కంటే అధికంగా పోలింగ్ కేంద్రాలు పటన్‌చెరులో ఉన్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారుల నుండి అందిన సమాచారం. డిసెంబర్ 11వ తేదీ మంగళవారం జరగనున్న ఓట్ల లెక్కింపు కోసం గీతం డ్రీమ్డ్ యూనివర్సిటీలో మూడు అంతస్థులను ఎన్నికల అధికారులు వినియోగిస్తున్నారు. ఒక అంతస్థులో రెండు నియోజకవర్గాలు ఉండగా మరో అంతస్థులో ఒక నియోజకవర్గం ఓట్ల లెక్కింపు జరగనుంది. గీతం ఇంజనీరింగ్ కళాశాల బ్లాక్‌లోని మూడవ అంతస్థును కేవలం ఒకే నియోజకవర్గం పటన్‌చెరుకు మాత్రం కేటాయించారు. ఐదవ అంతస్థులో సంగారెడ్డి, నారాయణఖేడ్ నియోజకవర్గాలకు చెందిన ఓట్ల లెక్గింపు చేపడ్తారు. ఇక మిగిలిన అందోల్, జహీరాబాద్ నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు గీతం కళాశాలలోని నాలుగవ అంతస్థులో నిర్వహిస్తారు.
భద్రతకు ప్రత్యేక పోలీసు బలగాలు
శుక్రవారం ఎన్నికల పోలింగ్ ముగియగానే ఇవిఎం యంత్రాలను గీతం కళాశాలకు తరలించిన జిల్లా అధికారులు వాటి భద్రత నిమిత్తం ప్రత్యేక పోలీసు బలగాలను వినియోగిస్తున్నారు. సాయుధులైన పోలీసులు ప్రస్తుతం పహరా కాస్తున్నారు. 11న జరగనున్న ఓట్ల లెక్కింపు కోసం ఒక్కో నియోజకవర్గానికి పది మంది చొప్పున ప్రత్యేక పోలీసు బలగాలు యాబది మంది వరకు పోలీసులతో బందోబస్తు కొనసాగుతోంది. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులతో పాటు ఏజెంట్లను మాత్రం ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి అనుమతిస్తారు. ప్రత్యేకంగా జిల్లా ఎన్నికల అధికారులు జారీ చేసిన పాసులు ఉన్నవారికి మాత్రమే అనుమతి లబిస్తుంది. ఇతరులు ఎవరిని లోనికి అనుమతించడానికి వీలు లేదని జిల్లా పోలీసు అధికారులు స్పష్టం చేసారు. అభ్యర్థుల భవిష్యత్‌కు సంబంధించిన అసలుసిసలు రోజైన ఓట్ల లెక్కింపు రోజున మరింత మంది ప్రత్యేక పోలీసు బలగాలతో బందోబస్తు ఉంటుందని అంచనా.