మెదక్

రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా శ్రమించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, డిసెంబర్ 9: యువనేత రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు శ్రమించాలని పీసీసీ ప్రధాన కార్యదర్శి, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ప్రజ్ఞాపూర్ ఆశాజ్యోతిలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలయ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశాన్ని అన్ని రంగాల్లో ముందుంచిన గాంధీల కుటుంబం దేశ రక్షణ కోసం ప్రాణాలు సైతం అర్పించిన ఘనత దక్కించుకున్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి ఉన్నత ప్రధాని పదవి పొందే అవకాశం వచ్చినప్పటికీ తృణ ప్రాయంగా వదిలిన ఆమె త్యాగశీలి గొప్పదని కొనియాడారు. అలాగే ఇక్కడి ప్రజల మనోభావాలు గౌరవించి తెలంగాణ ఇచ్చిన దేవతగా ప్రజలు గౌరవించాలని, పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి, సంక్షేమం కాంగ్రెస్‌తోనే సాధ్యపడుతుందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు అనుకూల పవనాలు వీయగా, ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేసి అన్ని వర్గాల మెప్పు పొందుతుందని చెప్పారు. త్వరలోనే జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని, ఇప్పటి నుండే ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండి పేదల అభివృద్దిలో మమేకమై పనిచేయాలని వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి నాయిని యాదగిరి, కౌన్సిలర్‌లు తుమ్మ నర్సింలు, ఆర్కె శ్రీనివాస్, తలకొక్కుల దుర్గాప్రసాద్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సర్దార్‌ఖాన్, నియోజకవర్గ ప్రచార కమిటీ రామరాజ శర్మ, నేతలు మతీన్, రియాజ్, గుంటుకు శ్రీను, రమేశ్‌గౌడ్, హన్మంత రెడ్డి, శ్రీనివాస్‌గుప్త, సమీర్, ప్రేంకుమార్, నవాజ్‌మీరా, భూమయ్య, కైలాస మహిపాల్, డ్రైవర్ శ్రీను, ప్రభాకర్ పాల్గొన్నారు.