మెదక్

మహీపాల్‌రెడ్డి రెండవసారి విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటన్‌చెరు, డిసెంబర్ 11: పటన్‌చెరు నియోజకవర్గం టీఆర్‌ఎస్ అభ్యర్థిగా గూడెం మహీపాల్‌రెడ్డి మరోసారి గెలుపొందారు. 2014 సంవత్సరములో జరిగిన శాసనసభ ఎన్నికలలో విజయం సాధించిన ఆయనను ఈసారి విజయం వరించింది. హోరా హోరీగా జరిగిన ఎన్నికలలో ప్రత్యర్థిపై ఆయన 34 వేల పైచిలుకు ఓట్ల మెజారిటిని సాధించారు. సెప్టెంబర్ ఏడవ తేధీన శాసనసభను రద్దు చేసి వెంటనే అభ్యర్థులను ప్రకటించిన టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ ఎన్నికల రణబేరిని మ్రోగించారు. అప్పటి నుండి దాదాపు మూడు మాసాల పాటు అహోరాత్రులు శ్రమించిన పార్టీ అభ్యర్థి గూడెం మహిపాల్‌రెడ్డి ఉత్కంఠ పోరులో విజయం సొంతం చేసుకున్నారు. మహాకూటమి తరపున కాంగ్రెస్ అభ్యిర్థిగా బరిలో నిలిచిన అమీన్‌పూర్ మాజీ సర్పంచ్, సర్పంచుల ఫోరం జిల్లా మాజీ అధ్యక్షుడు కాట శ్రీనివాస్‌గౌడ్ పోటీలో వెనుకబడ్డాడు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయనను ప్రకటించిన తరువాత సమయం తక్కువగా ఉండడంతో టిఆర్‌ఎస్ అభ్యర్థి ముందు నిలవలేక పోయాడు. మంగళవారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తరువాత మొదటి రౌండు నుండి అధిక్యతను ప్రదర్శించిన టిఆర్‌ఎస్ అభ్యర్థి మహిపాల్‌రెడ్డి చివరికి భారీ మెజారిటిని సొంతం చేసుకున్నారు. పటన్‌చెరు నియోజకవర్గంలో పోలైన ఓట్లను మొత్తం 24 రౌండ్లుగా లెక్కించారు. ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు పోస్టల్ బ్యాలెట్‌తో మొదలైంది. ఆ తరువాత పోలైన ఓట్లు లెక్కింపు ప్రారంభమైన మొదటి రౌండులో మహిపాల్‌రెడ్డి 2856 ఓట్ల ఆధిక్యతను పొందారు. రెండవ రౌండులో 5814 ఓట్ల ఆధిక్యతను సాధించారు. మూడవ రౌండులో 5047 ఓట్లు ఎక్కువ వచ్చాయి. ఇలా పదవ రౌండు ముగిసే లోగా టిఆర్‌ఎస్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కాట శ్రీనివాస్‌గౌడ్‌పై 14137 మెజారిటి వచ్చింది. ఇలా ప్రతి రౌండులోను తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శిస్తూ చివరికి విజయాన్ని సొంతం చేసుకున్నారు. చివరి 24వ రౌండు ఓట్ల లెక్కింపు పూర్తితో 34074 ఓట్ల మెజారిటి మహిపాల్‌రెడ్డి సాధించారు. మహిపాల్‌రెడ్డికి మొత్తం 104145 ఓట్లు రాగా ఆయన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కాట శ్రీనివాస్‌గౌడ్‌కు 70554 ఓట్లు వచ్చాయి. బిజెపి అభ్యర్థి పబ్బతిరెడ్డి కరుణాకర్‌రెడ్డికి 6643 ఓట్లు లభించాయి.
ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయను: మహీపాల్‌రెడ్డి
నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని ఎట్టి పరిస్థితులలోను వమ్ము చేయనని రెండవసారి పటన్‌చెరు ఎమ్మెల్యేగా గెలుపొందిన గూడెం మహిపాల్‌రెడ్డి హామి ఇచ్చారు. నియోజకవర్గ ప్రజలు విశ్వాసంతో రెండవసారి వారికి సేవ చేయడానికి అవకాశం ఇచ్చారని అన్నారు. గత నాలుగు సంవత్సరాలలో నియోకవర్గాన్ని సుమారు రెండు వేల రూపాయలతో అభివృద్ధి చేసామన్నారు.