మెదక్

సిద్దిపేటలో మంత్రి హరీష్‌రావు డబుల్ హాట్రిక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, డిసెంబర్ 11 : సిద్దిపేట నియోజక వర్గం నుండి మంత్రి హరీష్‌రావు 6సార్లు విజయం సాధించి డబుల్ హాట్రిక్ సాధించారు. జిల్లా కేంద్రంలోని ఇందూర్ కళాశాలల్లో జరిగిన కౌంటింగ్ హాల్‌లో సిద్దిపేట అసెంబ్లీ నియోజక వర్గం ఎన్నికల ఫలితాల్లో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ప్రత్యర్థి మహాకూటమి టీజేఎస్ అభ్యర్థి భవాణిరెడ్డిపై 1,18, 699 భారీ మెజార్టీతో విజయం సాధించారు. 2004 నుండి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ఆరు పర్యాయాలు విజయం సాధించి డబుల్ హాట్రిక్ సాధించారు. సిద్దిపేట నియోజకవర్గంలో 2,09,339 ఓట్లకు 1,67,113 పోలైనాయి. మంత్రి హరీష్‌రావుకు 1,31,295 ఓట్లు రాగా, టిజెఎస్ అభ్యర్థి భవానిరెడ్డికి 12,596, సాధించారు. బిజెపి అభ్యర్థి నరోత్తంరెడ్డికి 11,266ఓట్లతో పాటు మంత్రి హరీష్‌రావు ప్రత్యర్థి భవానిరెడ్డిపై 1,18,699ఓట్ల భారీ మేజార్టీతో రాష్ట్రంలోనే అత్యధిక మేజార్టీతో విజయం సాధించి రికార్డు సృష్టించారు. ప్రత్యర్థులు డిపాజిట్‌లు కొల్పోయారు. బీఎల్‌ఎఫ్ అభ్యర్థి గ్యాదరి జగన్‌కు 798ఓట్లు, స్వతంత్య్ర అభ్యర్థులు పెద్దోల్ల శ్రీనివాస్‌కు 718, పుష్పలత మెరోజుకు 3205, బుర్ర శ్రీనివాస్‌కు 1204, అల్లాడి శ్రీనివాస్‌కు 931, చింతల మల్లేశంకు 492, దరిపల్లి చంద్రంకు 370, బొగి శ్రీనివాస్‌కు 905, దొంతుల లక్ష్మినారాయణ 342, నోటాకు 2932 ఓట్లు సాధించారు. 1736మంది పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారు. మంత్రి హరీష్‌రావుకు 1,31,295 ఓట్లు సాధిస్తే ప్రత్యర్థులంతా కలిసి కేవలం 32,826 ఓట్లు సాధించగా నోటాకు 2932 వేశారు. ప్రత్యర్థులకు అందనంత భారీ మెజార్టీతో హరీష్‌రావు విజయం సాధించారు. ఈసారీ ఎన్నికల్లో సైతం ప్రత్యర్థులు ఎవ్వరు డిపాజిట్లు దక్కించుకోలేదు.