మెదక్

కారు జోరుకు కుదేలైన కూటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, డిసెంబర్ 11: ఉమ్మడి మెదక్ జిల్లా ఓటర్లు ఊహకు అందని విధమైన తీర్పుతో కారును పరుగులు పెట్టించి గులాబిని గుబాళింపజేసారు. ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా కూటమీ అభ్యర్థిని కనీసం విజయం ముంగిట వరకు కూడా తీసుకువచ్చేందుకు ఓటర్లు ఇష్టపడలేదు. పదింట్లో తొమ్మిది నియోజకవర్గాల్లో కూటమీ అభ్యర్థులు గట్టి పోటీని ఇవ్వలేకపోయారంటే కసితీరా ఓట్లు వేసినట్లు తెలుస్తోంది. నాలుగున్నర సంవత్సరాల టీఆర్‌ఎస్ పాలనలో అందించిన సంక్షేమ పథకాలో..గులాబి దళపతి సంధించిన మాటల పాశుపతాస్త్రాలో..జతకట్టిన కూటమీ అనైతికమనో వెరసి ఉమ్మడి మెదక్ జిల్లా ఓటర్లు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఇచ్చిన తీర్పుకు కూటమీ ఒక్కసారిగా కుదేలై కూర్చుంది. రాజకీయాల్లో రాటుదేలిన కాంగ్రెస్ పెద్దలకు సైతం చావుదెబ్బ తప్పలేదు. మెదక్ జిల్లాలోని పది సెంగ్మెంట్లలో తొమ్మిది స్థానాల్లో కారు జోరుగా సికారు చేసింది. చావుతప్పి కన్ను లొట్టబోయినట్లు సంగారెడ్డి నియోజకవర్గంలో స్వల్ప మెజార్టీతో జగ్గారెడ్డి గెలుపొందడంతో కూటమీకి కాస్తంత పరువు దక్కించుకుని క్లీన్ స్వీప్‌ను అధిగమించిందని చెప్పవచ్చు. భారతీయ జనతా పార్టీ పది స్థానాల్లో పోటీ చేసినా ఎక్కడ కూడా అభ్యర్థులకు డిపాజిట్లు దక్కకపోవడం గమనార్హం. శాసన సభను రద్దు చేసే రోజు వరకు టీఆర్‌ఎస్ అమ్ములపొదిలో ఉన్న తొమ్మిది స్థానాలను పదిలంగా కాపాడుకోగలిగింది. ఓట్ల లెక్కింపు ప్రారంభం మొదలు ముగింపు వరకు రౌండ్ రౌండ్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థుల మెజార్టీ పెరుగుతూ వచ్చింది. ముఖ్యమంత్రి హోదాలో బరిలోకి దిగిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తన సమీప కూటమి అభ్యర్థి ఒంటేరు ప్రతాప్‌రెడ్డిపై 56,922 ఓట్ల మెజార్టీ సాధించి ఆధిపత్యాన్ని పెంచుకున్నారు. 2,06,707 పోల్‌కాగా కేసీఆర్‌కు 1,20,608 ఓట్లు, కూటమీ అభ్యర్థి ఒంటేరు ప్రతాప్‌రెడ్డికి 63,686 ఓట్లు లభించాయి. ఈ ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజార్టీ సాధిస్తానని ప్రతీన చేసిన మంత్రి హరీష్‌రావుకు సిద్దిపేట ప్రజలు బ్రహ్మరథం పట్టి 1,18,699 ఓట్ల మెజార్టీని కట్టబెట్టారు. సిద్దిపేటలో 1,67,113 ఓట్లు పోల్‌కాగా హరీష్‌రావుకు 1,31,295 ఓట్లు లభించగా కూటమీ అభ్యర్థి భవానీరెడ్డికి 12,596 ఓట్లు రావడంతో డిపాజిట్ కోల్పోయారు. శాసన సభ మాజీ ఉప సభాపతి తన మెదక్ నియోజకవర్గంలో తన సమీప కూటమి అభ్యర్థి ఉపేందర్‌రెడ్డిపై 47,983 ఓట్ల మెజార్టీతో గెలుపొంది కూటమీని కోలుకోలేని దెబ్బతీసారు. మెదక్ సెగ్మెంట్లో 1,68,014 ఓట్లు పోల్‌కాగా టీఆర్‌ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డికి 97,670, కూటమీ అభ్యర్థి ఉపేందర్‌రెడ్డికి 49,687 ఓట్లు వచ్చాయి. దుబ్బాక నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి 62,421 ఓట్ల మెజార్టీతో తన సమీప కూటమి అభ్యర్థి మద్దుల నాగేశ్వర్‌రెడ్డిపై సునాయాస విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో 1,63,752 ఓట్లు పోల్‌కాగా టీఆర్‌ఎస్ అభ్యర్థి రామలింగారెడ్డికి 89,112 రాగా కూటమీ అభ్యర్థి నాగేశ్వర్‌రెడ్డికి 26,691 ఓట్లు మాత్రమే లభించాయి. నర్సాపూర్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి చిలుముల మదన్‌రెడ్డి 38,120 ఓట్లతో కూటమి అభ్యర్థి సునితారెడ్డిపై ఘన విజయం సాధించారు. ఇక్కడ 1,83,434 ఓట్లు పోల్‌కాగా టీఆర్‌ఎస్ అభ్యర్థి మదన్‌రెడ్డికి 1,05,465 ఓట్లు రాగా కూటమీ అభ్యర్థి సునితారెడ్డికి 67,345 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఓటరు నాడి ఏమిటో అంతుచిక్కని పటన్‌చెరు నియోజకవర్గంలో కూడా ఓటర్లు టీఆర్‌ఎస్ పక్షాన నిలిచారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్‌రెడ్డి తన సమీప కూటమీ అభ్యర్థి కాట శ్రీనివాస్‌గౌడ్‌పై 37,799 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు. పారిశ్రామిక వాడలో 2,13,750 ఓట్లు పోల్‌కాగా టీఆర్‌ఎస్ అభ్యర్థి మహిపాల్‌రెడ్డికి 1,16,326, కూటమీ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్‌కు 78,527 ఓట్లు వచ్చాయి. నారాయణఖేడ్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి మారెడ్డి భూపాల్‌రెడ్డి తన సమీప కూటమీ అభ్యర్థి సురేష్ షెట్కార్‌పై 58,508 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 1,73,783 ఓట్లు పోల్‌కాగా టీఆర్‌ఎస్ అభ్యర్థి భూపాల్‌రెడ్డికి 95550 ఓట్లు, కూటమీ అభ్యర్థి షెట్కార్‌కు 37042 ఓట్లు వచ్చాయి. ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గమైన అందోల్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి చంటి క్రాంతి కిరన్ తన సమీప కూటమీ అభ్యర్థి దామోదర్ రాజనర్సింహాపై 15,720 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మొత్తం 1,97,503 ఓట్లు పోల్‌కాగా టీఆర్‌ఎస్ అభ్యర్థి క్రాంతి కిరణ్‌కు 1,04,018, కూటమీ అభ్యర్థి దామోదర్ రాజనర్సింహాకు 87,378 ఓట్లు లభించాయి. మరో ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గమైన జహీరాబాద్‌లో టీఆర్‌ఎస్ మొదటి సారి ఖాతా ప్రారంభించుకుంది. టీఆర్‌ఎస్ అభ్యర్థి మానిక్‌రావు తన సమీప కూటమీ అభ్యర్థి జెట్టి.గీతారెడ్డిపై 34,473 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొంది తొలిసారి శాసన సభలో అడుగుపెట్టబోతున్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 1,87,015 ఓట్లు పోల్‌కాగా టీఆర్‌ఎస్ అభ్యర్థి మానిక్‌రావుకు 96,598 ఓట్లు, కూటమీ అభ్యర్థి గీతారెడ్డికి 62,125 ఓట్లు వచ్చాయి. సంగారెడ్డి నియోజకవర్గంలో ఓటర్లు ఊహించని తీర్పును ఇచ్చారు. మొదటి రౌండ్ నుండి కూటమీ అభ్యర్థి తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి తన సమీప టీఆర్‌ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్‌పై స్వల్ప ఆధిక్యంతో గెలుపు దిశగా పయనించారు. అన్ని నియోజకవర్గాల్లో ఒక ఎతె్తైతే సంగారెడ్డి నియోజకవర్గంలో మాత్రం విజయలక్ష్మీ చివరి నిమిషం వరకు దోబూచులాడింది. కూటమీ అభ్యర్థి జగ్గారెడ్డి తన సమీప టీఆర్‌ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్‌పై 2,589 ఓట్ల తేడాతో గెలుపొంది కాంగ్రెస్ పార్టీ పౌరువు నిలబెట్టారు. ఈ నియోజకవర్గంలో 1,65,912 ఓట్లు పోల్‌కాగా కూటమీ అభ్యర్థి జగ్గారెడ్డికి 76,572, టీఆర్‌ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్‌కు 73,983 ఓట్లు వచ్చాయి. మొత్తంమీద ఉమ్మడి మెదక్ జిల్లాలో కారు జోరుకు కాంగ్రెస్ కూటమీ బేజారెత్తిపోయింది. తొమ్మిది సెగ్మెంట్లలో కనీసం గెలుపు ముంగిట్లోకి ఒక్కరంటే ఒక్కరు వెళ్లకపోవడం విచిత్రం.

ప్రతి రౌండ్‌లోనూ సత్తాచాటిన టీఆర్‌ఎస్
* గజ్వేల్‌లో సీఎం కేసీఆర్ ఘన విజయం
గజ్వేల్, డిసెంబర్ 11: గజ్వేల్ నియోజకవర్గం నుండి ప్రాతినిత్యం వహిస్తున్న సీఎం కేసీఆర్ మరోసారి ఘన విజయం సాధించారు. మంగళవారం జరిగిన ఓట్ల లెక్కింపులో సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాప్‌రెడ్డిపై 58వేల 290 ఓట్ల మెజార్టీతో గెలుపొందగా, పోటీ పడిన ఇతర పార్టీలు, స్వతంత్రుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. కాగా పోలైన 2లక్షల 6వేల 707 ఓట్లకుగానూ 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపట్టారు. ప్రతి రౌండ్‌లోనూ టీఆర్‌ఎస్‌కు స్పష్టమైన మెజార్టీ వచ్చింది. టీఆర్‌ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు 1లక్షా 25వేల 444 ఓట్లు పోలవ్వగా, సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి వంటేరు ప్రతాప్‌రెడ్డి 67154ఓట్లు పొందారు. అలాగే బీజేపీ అభ్యర్థికి 1587 ఓట్లు పడగా, స్వతంత్య్ర అభ్యర్థి గజ్జెల కనకయ్యకు 1023 ఓట్లు, స్వతంత్య్ర అభ్యర్థి జీడిపల్లి శ్రీనివాస్‌కు 892 ఓట్లు, బీఎల్‌ఎఫ్ అభ్యర్థి శ్రీరాముల శ్రీనివాస్‌కు 313 ఓట్లు, స్వతంత్య్ర అభ్యర్థి ఇమాంపురం యాదగిరిగౌడ్‌కు 226 ఓట్లు, స్వతంత్య్ర అభ్యర్థి కడియం కృపాకర్‌కు 877 ఓట్లు, స్వతంత్య్ర అభ్యర్థి కంటె సాయన్నకు 3353 ఓట్లు, స్వతంత్య్ర అభ్యర్థి గుర్రపు రాములుకు 1229 ఓట్లు, స్వతంత్య్ర అభ్యర్థి బిట్ల వెంకటేశ్వర్లకు 1636ఓట్లు, స్వతంత్య్ర అభ్యర్థి పెద్దసాయిగారి యాదగిరికి 1350 ఓట్లు, స్వతంత్య్ర అభ్యర్థి సతీశ్‌కు 810 ఓట్లు, నోటాకు 1624 ఓట్లు, 22 ఓట్లు రిజెక్ట్ అయినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి విజయేందర్‌రెడ్డి పేర్కొన్నారు.

అంబరాన్నంటిన టీఆర్‌ఎస్ సంబురాలు
గజ్వేల్, డిసెంబర్ 11: సీఎం కేసీఆర్ గెలుపుతో గజ్వేల్ మున్సిపల్‌తో పాటు రూరల్ మండలం, కొండపాక, జగదేవ్‌పూర్, తూప్రాన్, జగదేవ్‌పూర్, ములుగు, మనోహరాబాద్, మర్కూక్, వర్గల్ మండలాల పరిదిలో టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్బంగా టపాసులు పేల్చడంతోపాటు స్వీట్లు పంచిపెట్టి సంతోషం వ్యక్తం చేయగా, టీఆర్‌ఎస్‌కు, కేసీఆర్‌కు అనుకూలంగా నినాదాలిస్తూ పాదయాత్రలు, బైక్ ర్యాలీలు నిర్వహించారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ ఫారుఖ్‌హుస్సేన్, మున్సిపల్ చైర్మెన్ గాడిపల్లి భాస్కర్, వైస్ చైర్మెన్ అరుణ భూపాల్‌రెడ్డి, నేతలు ఎన్‌సీ రాజవౌళిగుప్త, హైదర్‌పటేల్, సుబాష్‌చంద్రబోస్, ఆకుల దేవేందర్, రాజ్‌కుమార్, స్రవంతి శ్రీనివాస్, జకియొద్దీన్, రామదాసు, నర్సింలు, నర్సింగరావు, మద్దూరి శ్రీనివాస్‌రెడ్డి, మద్ది రాజిరెడ్డి, గోపాల్‌రెడ్డి, అంజనేయులు, నంగునూరి సత్యనారాయణ, ఎన్‌బీ ప్రభాకర్ గుప్త, చేపూరి చంద్రమోహన్, అంజనేయులు, అశోక్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్‌కు అండగా నిలిచిన గజ్వేల్ ప్రజలకు అండగా ఉంటామని, భారీ సంఖ్యలో ఓట్లు వేసి గెలిపించిన ఓటర్లకు రుణపడి ఉంటామని గజ్వేల్ మున్సిపల్ చైర్మెన్ గాడిపల్లి భాస్కర్ పేర్కొన్నారు. మంగళవారం గజ్వేల్ లో టీఆర్‌ఎస్ నిర్వహి3ంచిన సంబరాల్లో పాల్గొని ఆయన మాట్లాడారు. పట్టణంలో నిర్మించిన ఎడ్యుకేషన్‌హబ్, జిల్లా ఆసుపత్రి, విజ్, నాన్‌విజ్ మార్కెట్, రింగ్‌రోడ్డు, సమీకృత ప్రభుత్వ భవనాల నిర్మాణం వంటి అభివృద్ది పనులు రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచినట్లు స్పష్టం చేశారు. అభివృద్దిని కాంక్షిస్తూ అండగా నిలిచిన ప్రజల కష్టసుఖాల్లో ఎప్పుడూ పాలు పంచుకుంటామని వివరించారు.

అభివృద్ధికి అండగా నిలిచిన గజ్వేల్ ఓటర్లు
* మెదక్ ఎంపీ ప్రభాకర్‌రెడ్డి
గజ్వేల్, డిసెంబర్ 11: గజ్వేల్ నియోజకవర్గంలో అభివృద్దికి, అవినీతికి మద్య ఎన్నికలు జరగగా, ఓటర్లు అభివృద్దికి అండగా నిలిచినట్లు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. విజ్ఞులైన గజ్వేల్ ప్రజలు సీఎం కేసీఆర్‌కు అండగా నిలిచి నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శం గా తీర్చిదిద్దుకునేందుకు స్పష్టమైన మెజార్టీతో ముందుకు వచ్చినట్లు స్పష్టం చేశారు. ప్రతిపక్ష కాంగ్రెస్ అభ్యర్థి ఎన్ని జిమ్మిక్కులు చేసినా, టీఆర్‌ఎస్ శ్రేణులను రెచ్చగొట్టినా, పోలీసులను తప్పుదారి పట్టించినా ఓటర్లు ఆయన ఆటలను గుర్తించి సీఎం కేసీఆర్‌కు అండగా నిలిచినట్లు తెలిపారు. నియోజకవర్గంలో రూ. 35వేల కోట్ల వ్యయంతో వివిద అభివృద్ది పనులు చురుకుగా సాగుతుండగా, రైల్వేలైన్ నిర్మాణం, రింగ్ రోడ్డు, ప్రాజెక్టుల నిర్మాణాలు త్వరితగతిన పూర్తయ్యేందుకు అవకాశం ఇచ్చినట్లైందని చెప్పారు. గజ్వేల్‌తో పాటు రాష్ట్రంలో టీఆర్‌ఎస్ స్పష్టమైన ఆదిక్యత చాటగా, కాంగ్రెస్‌కు చెందిన హెమాహెమీలు ఓటమి బాట పట్టడం తో మహాకూటమి ఇచ్చిన హామీలను ప్రజలు విశ్వసించలేదని అన్నారు. అయితే టీఆర్‌ఎస్‌పై ప్రజలు ఎంతో నమ్మకంతో భారీ మెజార్టీ ఇచ్చి ప్రోత్సహిస్తుండగా, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా సీఎం కేసీఆర్ ప్రజాసేవకు పునరంకితం కానున్నట్లు వివరించారు.

భర్తతో ఆనందం పంచుకున్న పద్మ
మెదక్ రూరల్, డిసెంబర్ 11: మెదక్ సెగ్మెంట్ నుండి టిఆర్‌ఎస్ పార్టీ తరపున పోటీ చేసిన ఎం.పద్మాదేవేందర్‌రెడ్డి గెలుపు ధృవీకరణ పత్రాన్ని ఆమె భర్త దేవేందర్‌రెడ్డికి రిటర్నింగ్ అధికారి కె.వీరబ్రహ్మాచారి అందజేశారు. ఎన్నికల పరిశీలకురాలు సునీతావర్మ, కలెక్టర్ దర్మారెడ్డి, జాయింట్ కలెక్టర్ నగేశ్ సమక్షంలో గెలుపు పత్రాన్ని అందుకున్నారు. అంతకుముందు కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్న పద్మాదేవేందర్‌రెడ్డి తన భర్త దేవేందర్‌రెడ్డితో ఆనందం పంచుకున్నారు. ఈ సందర్భంగా పద్మాదేవేందర్‌రెడ్డికి పెద్దయెత్తున అభిమానులు పూలమాలలతో సత్కరించారు. టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు మురళీయాదవ్ పద్మాదేవేందర్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యేగా గెలుపొందిన చిలుముల మదన్‌రెడ్డిలకు పూలమాల, శాలువాలతో సత్కరించి అభినందించి మిఠాయి తినిపించారు.
పద్మాదేవేందర్‌రెడ్డికి భారీ మెజార్టీ
మెదక్: తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 11న జరిగిన ఓట్ల లెక్కింపులో మెదక్ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు. మంగళవారం మెదక్ జిల్లాలోని మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలకు వైపీఆర్ కళాశాలలో కౌటింగ్ జరిపారు. మెదక్ అసెంబ్లీకి 19 రౌండ్లు కౌటింగ్ చేయగా అందులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉపేందర్‌రెడ్డిపై మెజార్టీ ఓట్లు పద్మాదేవేందర్‌రెడ్డి సాధించారు. మొత్తం 47434 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో 39600 ఓట్ల మెజార్టీతో ప్రత్యర్ధి విజయశాంతిపై గెలుపొందారు. పోస్టల్ బ్యాలెట్‌లో తెరాస అభ్యర్థికి 232 రాగా, కాంగ్రెస్ అభ్యర్థికి 517 ఓట్లు వచ్చాయి. మొత్తం తెరాస అభ్యర్థికి 95 వేల 982 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థికి 48548 ఓట్లు వచ్చాయి. ఈ విధంగా తెరాస అభ్యర్ధి పద్మాదేవేందర్‌రెడ్డికి మొదటి రౌండ్ నుండి 19వ రౌండ్ వరకు కాంగ్రెస్ అభ్యర్థిపై మెజార్టీ సాధించారు.