మెదక్

ఖేడ్ ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దశంకరంపేట, డిసెంబర్ 31: మండల పరిధిలోని సంగారెడ్డిపేట గ్రామంలో నూతనంగా ప్రతిష్టించిన హనుమాన్ దేవాలయంలో నారాయఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంగారెడ్డిపేట గ్రామానికి చెందిన ప్రజలు తమ గ్రామంలో హనుమాన్ దేవాలయం నిర్మించుకొని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని గత మూడు రోజులుగా నిర్వహిస్తున్నారు. సోమవారం ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డితో పాటు మండల పరిధిలోని తెరాస నాయకులు, భక్తులు ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే వెంట మండల తెరాస అధ్యక్షులు విజయరామరాజు, రైతు సమన్వయ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి సురేష్‌గౌడ్, మురళీపంతులు, పేట తాజా మాజీ సర్పంచ్ జంగం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి హరీష్‌రావు
సిద్దిపేట ,డిసెంబర్ 31 : టీఆర్‌ఎస్ యువజన నాయకుడు మరుపల్లి శ్రీనివాస్ గౌడ్ కూతురి వివాహానికి మాజీ మంత్రి , సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావుహాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. సోమవారం సిద్దిపేట పట్టణంలోని తాడూరి తాడూరి బాలాగౌడ్ కళ్యాణ మండపంలో జరిగిన వివాహా శుభకార్యంలో పాల్గొని ఆశీస్సులు అందించారు.
హుండీ దొంగకు 15నెలల జైలు శిక్ష
దుబ్బాక, డిసెంబర్ 31: గుడిలో హుండీని పగలగొట్టి డబ్బులు దొంగిలించిన కేసులో దొంగకు 15 నెలల జైలు శిక్షను దుబ్బాక జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ గోపి కృష్ణ విధించారు. వివరాలు ఇలా ఉన్నాయి. దుబ్బాక మండలం రేకుల కుంట మల్లికార్జున స్వామి దేవాలయంలోని ఎల్లమ్మ దేవాలయంలో 27-09-2017 రాత్రి యండి. రఫి అనే దొంగ హుండీని పగలగొట్టి రూ.5000ల రూపాయాలను దొంగలించారు.
దేవాలయ సిబ్బంది ఫిర్యాదు మేరకు దుబ్బాక ఎస్ ఐ సుభాష్ గౌడ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చుశారు. నేరస్తుని అరెస్ట్ చేసి జుడిషియల్ రిమాండ్‌కు తరలించారు. కేసు పరిశోధన విన్న దుబ్బాక జడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ నేరం రుజువు కావడంతో 1నెలల శిక్ష విధించారు. ఇట్టి కేసులో పిపిగా దుబ్బాక సీ ఐ పరుశురామ్ వాదనలు వినిపించారు. నేరం రుజువు చేసి నేరస్తునికి శిక్ష పడేలా చేసిన దుబ్బాక సీఐ, ఎస్ ఐలతో పాటు సిబ్బందిని అడిషనల్ డిసిపి నర్సింహారెడ్డి అభినందించారు.

అమ్మవార్లను దర్శించుకున్న
ఎమ్మెల్యే మదన్‌రెడ్డి
శివ్వంపేట, డిసెంబర్ 31: మండలంలోని తిమ్మాపూర్ గ్రామ సమీపంలో దట్టమైన అటవి ప్రాంతంలో వెలసిన బంగారమ్మ, నెల్లూరు పోచమ్మ, పెద్దమ్మ దేవతల మూడు రోజుల జాతర ఉత్సవాల సందర్భంగా సోమవారం నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు చంద్రాగౌడ్, ఎంపీపీ కల్లూరి హరికృష్ణలు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. వారి వెంట నర్సాపూర్ ఎంపీపీ శ్రీనవాస్‌గౌడ్, తెరాస నాయకులు అర్జున్, వేణుగోపాల్‌రెడ్డి, లింగం యాదవ్, బిక్షపతిగౌడ్, రాములు, అశోక్‌గౌడ్, రాములుయాదవ్, వెంకటస్వామి తదితరులు ఉన్నారు.
* అంజాగౌడ్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే
అదే విధంగా మండలంలోని తిమ్మాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ కొడకంచి అంజాగౌడ్ బైక్‌పై నుండి తీవ్ర గాయాలు కావడంతో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ అధ్యక్షులు చంద్రాగౌడ్, ఎంపీపీ హరికృష్ణ, శ్రీనివాస్‌గౌడ్‌లు అంజాగౌడ్‌ను పరమార్శించి సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు.

శ్రీ లక్షీ మ వెంకటేశ్వర క్షేత్రంలో ధనుర్మాస ఉత్సవాలు ఆరంభం
గజ్వేల్, డిసెంబర్ 31: గజ్వేల్ పట్టణంలోని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్షేత్రంలో ఆదివారం రాత్రి ధనుర్మాస ఉత్సవాలను ఆలయ వేద పండితులు శేషం శ్రీనివాసాచార్యుల నేతృత్వంలో శాస్త్రోక్తంగా ఆరంభమయ్యాయి. ఈ సందర్బంగా శ్రీ లక్ష్మి, శ్రీ పద్మావతి, శ్రీ వెంకటేశ్వర స్వామివారి మూల విరాట్‌లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చణలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ విగ్రహాలను అధిష్టింపజేసి ప్రత్యేక పూజలు చేయగా, ఈ కార్యక్రమాల్లో ఆలయ వ్యవస్థాపక చైర్మెన్ బుక్కా వెంకటేశంగుప్త, నిర్వాహకులు బుక్కా రమేశ్‌గుప్త, రఘురాం, సంతోష్, శంకరయ్య, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.