మెదక్

తెలంగాణ సంక్షేమ పధకాలు దేశానికే ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జిన్నారం, జనవరి 4: తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, ఇతర రాష్టాలలో ప్రవేశ పెడుతున్నారని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంధ్రమైన జిన్నారంలోని ఎంపీపీ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ అధ్యక్షుడు కొలన్ రవీందర్‌రెడ్డి అద్యక్షతన జరిగింది. రెండవ సారి ఎమ్మెల్యేగా ఎన్నికయిన మైపాల్‌రెడ్డిని ఎంపిటిసిలు ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పధకాలు ప్రవేశపెట్టి అమలు చేయడంతోనే ప్రజలు మరోసారి భారీ మెజారిటీతో గెలిపించారని తెలిపారు. ప్రజలకు నేరుగా సంక్షేమ పధకాలు అందించిన ఘనత మా ప్రభుత్వానిదేనన్నారు.
అన్ని మతాలను కులాలను గౌరవిస్తూ అభివృద్ది పధకాలు అమలు చేస్తూ ముందుకసాగుతున్నామని వెల్లడించారు. గతంలో అభివృద్ది చేసినా ఇంకా చేయాల్సింది చాలావుందన్నారు. వచ్చే పంచాయతి ఎన్నికల్లో సామరస్యంగా వుండి ఎన్నికలు జరుపుకోవాలని సూచించారు. ప్రజలకు జవాబుదారిగా వుండి సేవ చేస్తే ప్రజలు నాయకులను గౌరవిస్తారన్నారు. కార్యక్రమంలో జడ్పిటిసి ప్రభాకర్, ఎంపీడీఓ సుమతి, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.
రైతులకు సమస్యలు సృష్టిస్తే ఊరుకునేదిలేదు
* వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండి సేవలందించాలి
- గజ్వేల్ అభివృద్ది అథారిటీ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి
గజ్వేల్, జనవరి 4: రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, దీనిని దృష్టిలో పెట్టుకొని అన్నదాతలకు సమస్యలు సృష్టిస్తూ ఇబ్బందులు కలిగిస్తే ఊరుకునేదిలేదని గజ్వేల్ అభివృద్ది అథారిటీ ప్రత్యేక అధికారి ముత్యంరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం గజ్వేల్‌లోని గడా అధికారి కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ, వ్యవసాయ విస్థరణాధికారుల పనితీరు మెరుగుపర్చుకోవడం తోపాటు స్థానికంగా ఉండి సేవలందించాలని, అందుకు భిన్నంగా వ్యవహరిస్తే ఊరుకునేదిలేదని స్పష్టం చేశారు. ముఖ్యంగా రైతుల వివరాలు, భూముల వివరాలు సేకరించడం, పంటఆరోగ్యం తెలుసుకోవడం, రైతుభీమా, రైతుబంధు పథకాలపై అవగాహన పెంచడం మర్చిపోవద్దని సూచించారు.
అంతేగాకుండా సాగుచేసిన పంటల ఆరోగ్యంపై రైతులకు ప్రతినిత్యం అవగాహన కల్పించడంతోపాటు వారితో మమేకమై పనిచేయాలని కోరారు. రైతుల నుండి ఫిర్యాదులు వస్తే మాత్రం సహించమని, సర్కార్ నిర్ధేశించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని వివరించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్, ములుగు ఏడీలు అనీల్‌కుమార్, అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

పంచాయితీ ఎన్నికల్లో..
పోటీ చేసే వారికి ప్రత్యేక బ్యాంక్ ఖాతా ఉండాలి

మెదక్, జనవరి 4: పంచాయితీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటి చేసే ప్రతి వ్యక్తికి తప్పనిసరిగా ప్రత్యేక బ్యాంక్ ఖాతా కలిగి ఉండాలని, ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు చేయు ఖర్చులన్ని ఈ ఖాతా నుండే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి స్పష్టం చేశారు. పంచాయితీ ఎన్నికల నిర్వాహణపై జిల్లాలోని ఎంపీడీఓలతో కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నామినేషన్లు, స్క్రూట్ని పూర్తి అయిన వెంటనే గ్రామపంచాయితీ వారిగా పోటిలో ఉన్న సర్పంచ్, వార్డు సభ్యుల వివరాలను సత్వరం అందజేయాలన్నారు. దీని ఆధారంగా కావాల్సిన బ్యాలెట్ ముద్రణ జరుగుతుందని, ఇప్పటికే సర్పంచ్, వార్డు సభ్యులకు గుర్తులను కెటాయించడం జరిగిందన్నారు. వివరాలను పంపడంలో ఆలస్యం జరిగితే బ్యాలెట్ ముద్రణపై దీని ప్రభావం పడే అవకాశం ఉందని, అధికారులు తగు జాగ్రత్తలు చేపట్టాలన్నారు. బ్యాలెట్ పేపర్లు మండల కేంద్రాలకు చేరుకోగానే వాటిని గ్రామపంచాయితీలోని వార్డుల వారిగా విభజించేందుకు అవసరమైన సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఎన్నికల కోడ్ (మిగతా 3వ పేజీలో)

పదిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి

ఆంధ్రభూమి బ్యూరో
సంగారెడ్డి, జనవరి 4: పదవ తరగతి ఫలితాలలో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ద వహించాలనికలెక్టర్‌ఎం.హన్మంతరావు సూచించారు.
శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లావిద్యాశాఖఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులు,వసతి గృహాల వార్డెన్లకు నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు నమ్మకం కలిగించాలన్నారు.ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకుని కార్పోరేట్ పాఠశాలలకు దీటుగా ఫలితాలు వచ్చేలా అందరు నిబద్ధతతో పని చేయాలనితెలిపారు.సంగారెడ్డి జిల్లా ను పదవ తరగతి ఫలితాలలో అగ్రగామిగా నిలపాలని కోరారు. ప్రధానోపాధ్యాయులు నాయకత్వ బాధ్యతలను ప్రదర్శించాలని సూచించారు. ప్రత్యేకతరగతులనుఏర్పాటు చేయి ంచి అన్ని సబ్జెక్టుల్లో విద్యార్థులను నిష్ణాతులను చేయలన్నారు. విద్యార్థులుపరీక్షలకు మానసికంగా సిద్దమయ్యేలా తీర్చిదిద్దాలనిచెప్పారు. ఏ రకమైన ప్రశ్నలు అడిగినా సమాధానం వ్రాసే విధంగా అన్ని విషయాల్లో సంసిద్దులను చేయాలని సూచించారు. సబ్జెక్టుల వారిగా విద్యార్థుల ప్రతిభను గమనించి వెనుకబడ్డ సబ్జెక్టులో పట్టు కల్పించేందుకు ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేసి పాఠాలు బోధించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల భవిషత్తు ప్రధానోపాధ్యాయులపై ఉందన్నారు. విద్యార్థులను పూర్తి స్థాయిలో సంసిద్ధం చేసి మంచి ఫలితాలు వచ్చేలాచూడాలన్నారు. అంకిత భావం కలిగి ఉండాలన్నారు. ఉన్నత స్థానాలలో ఉన్న అధికరులందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వారేనని కలెక్టర్ గుర్తు చేసారు. పదవ తరగతి పరీక్షలకు సుమారు 50 రోజుల సమయం మాత్రమే ఉందని, ప్రతి విద్యార్థిపై సబ్జెక్టు వారీగా దృష్టి పెట్టాలని ఆదేశించారు. పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఉత్తీర్ణులైతే తొలిమెట్టు సాధించినట్లు అవుతుందని,వారిజీవితాలకుమలు పుగా మారుతుందన్నారు.విద్యార్థుల బం గారు భవిషత్తును తీర్చిదిద్దే బాధ్యత అందరిపై ఉందని వెల్లడించారు. (మిగతా 3వ పేజీలో)2018 సవరణ బిల్లు ఉపసంహరించేవరకు ఆందోళనలు

గజ్వేల్, జనవరి 4: వినియోగదారుల పరిరక్షణ చట్టం 1986ను సవరించి వినియోగదారుల పరిరక్షణ చట్టం 2018తో వైద్యరంగానికి తీవ్ర నష్టం వాటిల్లనుండగా, ఆ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించే వరకు ఆందోళనలు చేపడతామని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఆకుల నరేశ్‌బాబు హెచ్చరించారు. శుక్రవారం గజ్వేల్ ఐఎంఏ శాఖ ఆద్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం 2018, నేషనల్ మెడికల్ కమీషన్ 2017, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సవరణ బిల్లు 2018కి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతుండగా, మొండి వైఖరితో కేంద్ర సర్కార్ ముందుకెల్తుండ డం సిగ్గుచేటని నిలదీశారు. వినియోగదారుల పరిరక్షణ చట్టం 1986 చట్టం సవరించి నష్టపరిహారాన్ని విపరీతంగా పెంచుతూ 2018 చట్టాన్ని లోకసభ ఆమోదించగా, నష్టపరిహార పరిమితిని జిల్లా ఫోరంకు రూ. 10లక్షల నుండి రూ. కోటి వరకు, రాష్ట్ర ఫోరం పరిది రూ. కోటి నుండి రూ. 10కోట్ల వరకు, జాతీయ ఫోరం పరిదిలో రూ. 10కోట్లకు మించి సవరణ బిల్లు డిసెంబర్ 20, 2018 రోజున పార్లమెంట్‌లో బిల్లు ఆమోదించినట్లు స్పష్టం చేశారు.గతంలో వైద్య సంఘాలతో జరిపిన చర్చలలో ఔషద దరలకు గరిష్ట పరిమితి విదించిన విదంగానే వినియోగదారుల నష్టపరిహారం చెల్లింపు లకు సైతం గరిష్ట పరిమితికి అంగీకరించిన కేంద్రం మాట నిలబెట్టుకోక పోవడం సిగ్గుచేటని విమర్శించారు.
దీంతో వైద్యులు వేదింపులకు గురి కావడంతోపాటు న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తి చిన్న, మద్య తరహా ఆసుపత్రులు మూత పడే ప్రమాదముందని తెలిపారు. పేద ప్రజలకు వైద్యం స్తోమతకు మించి భారం అవుతుండగా, ఎంసీఐ స్థానంలో ఎన్‌ఎంసీ ప్రవేశ పెట్టడంతో వైద్య విద్య ప్రమాణాలు తగ్గడంతోపాటు రోగులకు విపరీతంగా నష్టం కలిగి వైద్యరంగం కుంటుపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య రంగ వ్యతిరేక విధానాలను కేంద్రం వెనక్కి తీసుకోని పక్షం లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
కార్యక్రమం లో గజ్వేల్ శాఖ అధ్యక్షులు డాక్టర్ పెంటాచారి, కార్యదర్శి డాక్టర్ లింగం, సీనియర్ వైద్యులు డాక్టర్ చంద్రారెడ్డి, డాక్టర్ రాజ్‌కుమార్, డాక్టర్ యాదవరెడ్డి, డాక్టర్ వాసవాచారి, డాక్టర్ జయశ్రీ, డాక్టర్ మంజుల, డాక్టర్ శైలజ, డాక్టర్ పద్మజ్యోతి, డాక్టర్ సురేశ్, డాక్టర్ రాజ్‌కుమార్, డాక్టర్ రాజేశ్, డాక్టర్ సాయినాథ్‌రెడ్డి, డాక్టర్ నాగ ముల్లయ్య, డాక్టర్ శంతన్‌రెడ్డి, డాక్టర్ జ్యోతి, డాక్టర్ శ్రీదర్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ మహేశ్, డాక్టర్ శర్మ తదితరులు పాల్గొన్నారు.